సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సమీకరణాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల్లో కొంత టెన్షన్ నెలకొంటోంది. ఇక, తాజాగా కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం రేపటికి వాయిదా పడింది. ఈరోజు సాయంత్రం తెలంగాణ స్క్రీనింగ్ కమిటీ మరోసారి సమావేశం కానుంది. దీంతో, మిగిలిన స్థానాల్లో ఎవరికి టికెట్ వరిస్తుందోనని నేతలు ఎదురుచూస్తున్నారు.
కాగా, తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికలో తీవ్ర జాప్యంతో అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. ఇదే సమయంలో ఎన్నికల సందర్భంగా తమకు ప్రచార సమయం తగ్గిపోతుందని ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు, అధికార బీఆర్‌ఎస్ పార్టీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతోంది. ఇక, ఈ ఎన్నికల్లో బీసీలకు ఎక్కువ సీట్లు ఇస్తామని అన్నీ పార్టీలు ప్రకటించిన నేపథ్యంలో బీసీ నేతలు టికెట్ల అంశంపై ఫోకస్ పెట్టారు.
కాంగ్రెస్ బీసీ నాయకులు టికెట్స్ అడుగుతున్న స్థానాలివే..
1.మక్తల్(77): వి.శ్రీహరి.
2.నర్సాపూర్(37): జి.అనిల్‌కుమార్.
3.ఎల్బీనగర్(49). మధుయాష్కీ
4.పరకాల(104): కొండా సురేఖ
5.దేవరకద్ర(76): కె. ప్రదీప్
6.నారాయణఖేడ్(35): సురేష్ షెట్కార్.
7.వరంగల్ ఈస్ట్(106): కె.వెంకటస్వామి
8.శేరిలింగంపల్లి(52): జె. జైపాల్
9.హుస్నాబాద్(32): పి.ప్రభాకర్.
10.మహబూబ్ నగర్(74): ఎ.సంజీవ్ ముదిరాజ్
11.పటాన్‌చెరువు(40): కె.శ్రీనివాస్.
12.ముథోల్(10): ఎస్.ఆనందరావు.
13.జడ్చర్ల(75): యర్రా.శేఖర్.
15.రాజేంద్రనగర్(51): ఎం.వేణుగోపాల్.
16.ఆదిలాబాద్(7): జి.సుజాత.
17.సూర్యాపేట(91): తండు శ్రీనివాసయాదవ్
18.భువనగిరి(94): పి.రామాంజనేయులు.
Comments
Please login to add a commentAdd a comment