తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు-2023.. టుడే అప్‌డేట్స్‌ | Telangana Assembly Elections Today Updates 1st December | Sakshi
Sakshi News home page

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు-2023.. టుడే అప్‌డేట్స్‌

Published Fri, Dec 1 2023 6:59 AM | Last Updated on Fri, Dec 1 2023 5:28 PM

Telangana Assembly Elections Today Updates 1st December - Sakshi

Telangana Assembly Elections Today Minute To Minute Update..

ఎల్లుండి(డిసెంబర్‌ 3, ఆదివారం) తెలంగాణ ఎన్నికల కౌంటింగ్

  • అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్న అధికారులు
  • తెలంగాణ : లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రత
  • నలభై కంపెనీల బలగాలతో పటిష్ట భద్రత
  • స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు
  • కౌంటింగ్ కేంద్రాల్లో 1,766 లెక్కింపు టేబుళ్లు
  • కౌంటింగ్ కేంద్రాల్లో 131 పోస్టల్ బ్యాలెట్ టేబుళ్లు
  • 6 నియోజకవర్గాల్లో 500కు పైగా పోలింగ్ కేంద్రాలు
  • ఎల్లుండి ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు
  • ఉదయం 10 గంటలకు మొదటి ఫలితం వెల్లడవుతుందన్న ఈసీ
  • ప్రతి టేబుల్ పై మైక్రో అబ్జర్వర్
  • కౌంటింగ్ సూపర్ వైజర్....ఇద్దరు అసిస్టెంట్లు 
  • ఎన్నికల నిబంధనలపై 2023లో 13 వేల కేసులు
  • 2018 ఎన్నికల్లో నిబంధనల ఉల్లంఘనల పై 2,400 కేసులు

తెలంగాణ ఎన్నికలపై మీడియాతో సీఈవో వికాస్‌రాజ్‌

  • తెలంగాణలో పోలింగ్‌ ప్రశాంతంగా జరిగింది
  • తెలంగాణలో 71.01శాతం పోలింగ్‌
  • లక్షా 80 వేల మంది పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకున్నారు
  • యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా 90.03 పోలింగ్‌
  • హైదరాబాద్‌ జిల్లాలో 46.68 శాతం పోలింగ్‌ నమోదు
  • గతంలో కంటే ఈ ఎన్నికల్లో రెండు శాతం పోలింగ్‌ తగ్గింది
  • తెలంగాణలో రిపోలింగ్‌కు ఎక్కడా అవకాశం లేదు
  •  మునుగోడులో అత్యధికంగా 91.5 శాతం, యాకత్‌పురలో అత్యల్పంగా 39.6 శాతం పోలింగ్‌ నమోదు
  •  80 ఏళ్లు పైబడిన వారికి హోమ్‌ ఓటింగ్‌ కల్పించాం
  • ఎల్లుండి(ఆదివారం, డిసెంబర్‌ 3వ తేదీ) 49 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ
  • దేవరకద్రలో పది మంది ఉన్నా పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశాం
  • పలు పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంల మార్పిడి జరిగింది. 
  • ఆయా పార్టీ ఏజెంట్ల మధ్యనే స్ట్రాంగ్ రూమ్‌కి తరలింపు జరిగింది
  • తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 49 కౌంటింగ్ కేంద్రాలు. హైదరాబాద్‌లో 14 

మీ పాత్ర మరువలేనిది: రేవంత్‌ ట్వీట్‌

  • తెలంగాణ కాంగ్రెస్‌ కేడర్‌కు రేవంత్‌రెడ్డి ధన్యవాదాలు
  • ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం శ్రమించిన, సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు
  • గడచిన పదేళ్లుగా పార్టీకి అండగా.. ప్రజల తరఫున నిలబడ్డారంటూ భావోద్వేగం 
  • మీ కష్టం, మీ శ్రమ వృథా కాలేదంటే ఎక్స్‌లో పోస్ట్‌
  • ప్రజాస్వామ్య పునరుద్ధరణలో పాత్ర మరువలేనిదంటూ.. ప్రతి ఒక్కరికి అభినందనలు

ఇలాంటి ఎన్నికలు చూడడం నా అదృష్టం: ప్రొ. కోదండరామ్‌

  • తెలంగాణ జనసమితి అధ్యక్షుడు, ప్రొఫెసర్‌ కోదండరామ్‌ వ్యాఖ్యలు
  • 1970 ఎమర్జెన్సీ లో జరిగిన ఎన్నికలకు 2023 నిన్న జరిగిన ఎన్నికలకు సారుప్యత ఉంది
  • ప్రజలు ఈ ఎన్నికల్లో పాలకులపై పూర్తిగా వ్యతిరేకత కనబర్చారు
  • తెలంగాణ ఉద్యమ పౌరుషం ఎక్కడా తగ్గలేదు.. ఈ ఎన్నికల్లో స్పష్టంగా ప్రజల్లో కనినిపించింది
  • ఇలాంటి ఎన్నికలను చూడటం అదృష్టం
  • సంపూర్ణ మెజారిటీ కాంగ్రెస్ పార్టీ సాధిస్తుంది
  • నిరంకుశ పాలన రాకుండా చూసుకుంటామని, ప్రజాస్వామ్య పునరుద్ధరణకు కట్టుబడి ఉంటామని రేవంత్ రెడ్డి ప్రకటించారు.. మేము దాన్ని స్వాగతిస్తున్నాం
  • ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపాం
  • ఇప్పటికైనా ప్రజల తీర్పును గుర్తించి పాలకులు పార్టీ ఫిరాయింపులపై పునరాలోచించుకోవాలి
  • పార్టీ ఫిరాయింపులకు పాల్పడితే ప్రజలు సహించరు
  • నాగార్జున సాగర్ నీటి వాటా అంశంలో ఏపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు అప్రజాస్వామికమైనది
  • చట్టపరమైన విధానాలతో వెళ్లాలి
  • తమ నీటి వాటాను తాము వాడుకునేందుకు ఏపీ ప్రభుత్వానికి హక్కు ఉంది..కానీ దానికి కొన్ని విధానాలు ఉన్నాయి
  • ఏపీ ప్రభుత్వం దుందుడుకు ఆలోచనలు సరైనవి కావు
  • ఇలాంటి చర్యలు మానుకొని చట్టపరంగా ముందుకు వెళ్లాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరుతున్నా
  • నాగార్జున సాగర్ వాటర్ అంశాల్లో కేంద్ర ప్రభుత్వం స్పందించాలి
  • ఈ అంశంపై కేంద్ర జల సంఘానికి లేఖ రాస్తాం
  • ఈ ఎన్నికల్లో ప్రజల తీర్పు ఒక వినూత్నమైన తీర్పు ఇవ్వబోతున్నారు 
  • ఎగ్జిట్ పోల్స్ ప్రకారం నేను మాట్లాడటం లేదు
  • గ్రౌండ్ లెవల్లో తిరిగాను కాబట్టి చెబుతున్నా

కేసీఆర్‌ ఓటమి ఒప్పుకున్నట్లే..: షబ్బీర్‌ అలీ

  • మీడియాతో నిజామాబాద్ కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ
  • ఎన్నికల్లో బాగా పనిచేసిన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అన్ని మతాలు కులాల సంఘాలు ఎన్జీవో ఉద్యోగులు అందరికీ ధన్యవాదాలు
  • ఎగ్జి ట్ పోల్స్ లో కాంగ్రెస్ కు మెజార్టీ వస్తుందని వస్తున్నాయి
  • రాహుల్ గాంధీ రేవంత్ లు చాలా రోజుల నుంచి ఇదే విషయాలు చెబుతూ వచ్చారు
  • దీపం ఆరిపోయే ముందు వెలుగు ఎక్కువ
  • కొడుకు కేటీఆర్ తో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయించారు అంటేనే కేసీఆర్‌ ఓటమి ఒప్పుకున్నట్లు అర్థం అయిపోయింది
  • మెజారిటీ మైనారిటీ అనేవి ఉండవు నేను అందరి వాడిని అందరితో ఉంటాను


ఫలితాల కోసం చూస్తున్న వేళ.. ఆసక్తికర పరిణామం

  • తెలంగాణలో హైకోర్టులో ధర్మపురి ఎమ్మెల్యే ఎన్నిక పిటిషన్‌పై తీర్పు 
  • మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు ఊరట
  • కొప్పుల 2018 అసెంబ్లీ ఎన్నిక చెల్లదంటూ హైకోర్టులో పిటిషన్‌
  • పిటిషన్‌ వేసిన కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్
  • ఎన్నికలో కొప్పుల ఈశ్వర్ స్వల్ప మెజారిటీతో గెలుపు 
  • ఎన్నికల ఫలితాలపై లక్ష్మణ్ రీకౌంటింగ్ దరఖాస్తు
  • రీకౌంటింగ్ తర్వాత కొప్పుల గెలిచినట్లు ఎన్నికల అధికారుల ప్రకటన
  • అయితే, రీకౌంటింగ్ లో గందరగోళం జరిగిందని, కొప్పుల అక్రమ పద్ధతులతో గెలిచారని.. ఎన్నికల కౌంటింగ్‌ అధికారులపై చర్యలు తీసుకోవాలని లక్ష్మణ్ ఆరోపణ
  • హైకోర్టులో పిటిషన్‌.. శుక్రవారం(డిసెంబర్‌ 1) పిటిషన్‌ కొట్టేసిన హైకోర్టు

ఎగ్జిట్‌పోల్స్‌పై మళ్లీ కేటీఆర్‌ స్పందన

  • తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలపై స్పందించిన మళ్లీ కేటీఆర్‌
  • రబ్బిష్‌.. న్యూసెన్స్‌ అంటూ పోలింగ్‌ ముగిసిన అనంతరం స్పందన
  • తాజాగా మళ్లీ ట్విటర్‌లో మళ్లీ..
  • చాలా కాలం తర్వాత ప్రశాంతంగా నిద్రపోయా
  • ఎగ్జిట్‌ పోల్స్‌ ఎంతదాకా అయినా వెళ్లొచ్చు, కానీ.. 
  • కచ్చితమైన ఫలితాలు తమకు అనుకూలంగా ఉంటాయనే అర్థం వచ్చేలా ఎక్స్‌లో పోస్ట్‌

గట్టి కాపలా మధ్య..

  • ఈవీఎంలలో అభ్యర్థుల భవితవ్యం
  • స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద భారీ భద్రత
  • అనుమతి ఉన్నవాళ్లకు మాత్రమే  స్ట్రాంగ్ రూమ్‌లోకి
  • ఒక డీఎస్పీ,  ఇద్దరు సీఐలు, నలుగురు ఎస్సైలతో పర్యవేక్షణ 
  • డిసెంబర్‌ 3వ తేదీన కౌంటింగ్‌.. అదే రోజు వెల్లడికానున్న ఫలితాలు
     

తెలంగాణ ఎన్నికలపై జోరుగా బెట్టింగ్

  • ప్రధాన అభ్యర్ధులు, ఏ పార్టీ అధికారంలోకి వస్తుందన్న దానిపై బెట్టింగ్
  • రూ.లక్ష పెడితే రూ.2 లక్షలు ఇచ్చేలా బెట్టింగ్
  • ఎగ్జిట్ పోల్స్ తర్వాత పెరిగిన బెట్టింగ్స్
  • నెల క్రితం నుంచే ఏపీలోని పలు ప్రాంతాల్లో బెట్టింగ్ ల నిర్వహణ
  • హైదరాబాద్, తెలంగాణలో బెట్టింగ్ నిర్వహిస్తే పట్టుబడే అవకాశం ఉందని ఏపీలో మకాం వేసిన బుకీలు
  • యాప్ ల ద్వారా ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి బెట్టింగ్
  • కేసీఆర్, రేవంత్, ఈటల, బండి సంజయ్, కోమటిరెడ్డి బ్రదర్స్, ఉత్తమ్, మల్లారెడ్డి సహా పలువురు పోటీ చేస్తున్న స్థానాలపై ఎక్కువ బెట్టింగ్

ఊహించని ఫలితాలు రాబోతున్నాయి: బండి సంజయ్

  • ఎన్నోసార్లు సర్వేలు తారుమారయ్యాయి
  • రాష్ట్రంలో మెజారిటీ సీట్లను బీజేపీ సాధించబోతోంది
  • నాగార్జునసాగర్ ఇష్యూను బీఆర్ఎస్ రాజకీయాల కోసం వాడుకోవాలని చూసింది
  • రాష్ట్రంలో హంగ్ చర్చ.. బీఆర్ఎస్, ఎంఐఎంతో కలిసి బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు అనేవి ప్రతిపక్షాలు, కొన్ని వర్గాలు చేసే కుట్ర ప్రచారం
  • ఐదు రాష్ట్రాల ఎన్నికల్లోనూ బీజేపీకి మంచి మెజారిటీ రాబోతోంది
  • మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గడ్‌లో కూడా బీజేపీదే అధికారం
  • గంగుల కమలాకర్ అవినీతి చరిత్రను, కరీంనగర్‌లో జరిగిన అక్రమాలను బీజేపీ అధికారంలోకి రాగానే తవ్వి తీస్తాం
  • వదిలే ప్రసక్తే లేదు

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేపై కేసు నమోదు

  • బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై కేసు నమోదు
  • పార్టీ కండువా వేసుకుని పోలింగ్‌ కేంద్రంలోకి ప్రవేశించినట్లు ఫిర్యాదు

స్ట్రాంగ్ రూమ్స్‌లో నిక్షిప్తమైన అభ్యర్థుల భవితవ్యం

  • స్ట్రాంగ్ రూముల వద్ద ఐదంచెల పటిష్టమైన భద్రత
  • నిఘా నీడలో స్ట్రాంగ్ రూమ్స్
  • డిసెంబర్ 3న వెలువడనున్న అభ్యర్థుల భవితవ్యం
  • నల్లగొండ జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో 85.49శాతం పోలింగ్ నమోదు
  • రాష్ట్రంలోనే అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 90.03 శాతం పోలింగ్ నమోదు

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో పోలింగ్‌ శాతం

  • ఆదిలాబాద్-77.2 శాతం
  • బోథ్-82.93శాతం
  • చెన్నూరు- 79.97శాతం
  • బెల్లంపల్లి-81.19శాతం
  • మంచిర్యాల-69.06 శాతం
  • సిర్పూర్ టి- 71.8 శాతం
  • అసిపాబాద్- 72.08 శాతం
  • ఖానాపూర్-77.46 శాతం
  • నిర్మల్-76.56 శాతం
  • ముథోల్- 80.54 శాతం 

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పోలింగ్ శాతం-83.28

  • ఖమ్మం -71.53
  • పాలేరు-90.28
  • మధిర -87.83
  • వైరా -86.66
  • సత్తుపల్లి-85.27

ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా పోలింగ్ శాతం వివరాలు

  • సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 76.61 శాతం పోలింగ్ నమోదు
  • మెదక్ జిల్లా వ్యాప్తంగా 86.69 శాతం పోలింగ్ నమోదు
  • సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా 79.84 శాతం పోలింగ్ నమోదు

ఓటెత్తని హైదరాబాద్‌! 

  • అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్‌ జిల్లా పరిధిలో రాష్ట్రంలోనే తక్కువగా పో లింగ్‌ నమోదు
  • అధికారులు ఎంతగా అవగాహన కల్పించే ప్రయత్నం చేసినా..ఎప్పటిలాగే ఓటు వేసేందుకు వెళ్లని హైదరాబాద్‌ జనం
  • పోలింగ్‌ కేంద్రాల్లో ఎంత క్యూ ఉందో, ఎంత సమయంలో ఓటేయవచ్చో ఆన్‌లైన్‌లో ముందే తెలుసుకునే సదుపాయం
  • అయినా ఫలితం రాలేదు.
  • చాలా వరకు సెలవురోజుగానే భావించి విశ్రాంతి తీసుకునేందుకు, వినోద కార్యక్రమాల్లో మునిగిపోయి ఉండటమే దీనికి కారణమని అధికారవర్గాలు చెప్తున్నాయి.
  • అంతేగాకుండా ఒకటి కంటే ఎక్కువచోట్లా ఓట్లున్నవారూ ఇక్కడ గణనీయంగా ఉండటం
  • వారంతా స్వస్థలాలకు తరలడం కూడా పోలింగ్‌ తగ్గడానికి మరో కారణం
  • జిల్లాలో కడపటి వార్తలు అందేసరికి 46.65 శాతమే పోలింగ్‌ నమోదు
  • గత అసెంబ్లీ ఎన్నికల (50.51 శాతం)తో పోలిస్తే ఐదు శాతం తగ్గడం గమనార్హం.

హస్తం గాలి ‘వీచినట్టేనా’!

  • కాంగ్రెస్‌ శిబిరంలో ధీమా 
  • రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్‌ అనుకూలంగాజరిగిందని అంచనా.. 70 స్థానాలకు పైగా గెలుస్తామని లెక్కలు... 
  • నల్లగొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్,వరంగల్‌ జిల్లాలపై భారీ ఆశలు 
  • సింగరేణి సహకరించిందంటున్నహస్తం పార్టీ.. హైదరాబాద్‌ శివారుఓటర్లూ తమవైపేనని ధీమా 
  • వార్‌ రూం నుంచి పోలింగ్‌ సరళి సమీక్షించిన ఠాక్రే, దీపాదాస్‌ మున్షీ, కుసుమ కుమార్‌  

తెలంగాణ అంచనాలు కాంగ్రెస్‌వైపే!

  • మెజారిటీ ఎగ్జిట్‌ పోల్స్‌ది అదే మాట 
  • రాజస్తాన్‌లో కమల వికాసమన్న సర్వేలు 
  • మధ్యప్రదేశ్‌నూ నిలుపుకోనున్న బీజేపీ! 
  • ఛత్తీస్‌లో మళ్లీ కాంగ్రెసే, మిజోరంలో హంగ్‌!
  • ఐదు రాష్ట్రాల్లోనూ ఈనెల 3న ఫలితాల వెల్లడి 

ప్రశాంతంగా ముగిసిన అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్‌..

  • పోలింగ్‌ 70.66 శాతం!
  • ఈ నెల 3న ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి
  • ఈవీఎంలలో నిక్షిప్తమైన అభ్యర్థుల భవితవ్యం
  • ఉదయం వడివడిగా పోలింగ్‌.. మధ్యలో మందకొడిగా 
  • ఈవీఎంల మొరాయింపుతో పలుచోట్ల ఆలస్యంగా ప్రారంభం  
  • ఓటేసేందుకు మళ్లీ బద్ధకించిన జంట నగరాల జనం 
  • స్వల్ప ఉద్రిక్తతలు.. గతంతో పోల్చితే తగ్గిన ఓట్ల గల్లంతు ఘటనలు 
  • సజావుగా ముగియడంతో ఊపిరిపీల్చుకున్న ఎన్నికల సంఘం
  • అత్యధిక పోలింగ్‌ జరిగిన సెగ్మెంట్‌: మునుగోడు 91.51 శాతం 
  • అత్యల్పంగా పోలింగ్‌ జరిగిన సెగ్మెంట్‌: యాకుత్‌పుర 39.69 శాతం 
  • అత్యధిక పోలింగ్‌ జరిగిన జిల్లా: యాదాద్రి భువనగిరి 90.03 శాతం 
  • అత్యల్పంగా పోలింగ్‌ జరిగిన జిల్లా: హైదరాబాద్‌లో 46.65 శాతం  (కడపటి వార్తలు అందే సరికి లెక్క ఇది. పోలింగ్‌ శాతాలు మారే అవకాశం ఉంది.) 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement