తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు-2023.. ఈరోజు అప్‌డేట్స్‌ | Telangana Assembly Elections 29th November Updates | Sakshi
Sakshi News home page

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు-2023.. ఈరోజు అప్‌డేట్స్‌

Published Wed, Nov 29 2023 6:57 AM | Last Updated on Wed, Nov 29 2023 7:05 PM

Telangana Assembly Elections 29th November Updates - Sakshi

Telangana Assembly Elections Today Minute To Minute Updates..

ఈసీ సీఈఓ వికాస్‌రాజ్ కీలక వ్యాఖ్యలు

  • పోలింగ్ ప్రారంభానికి 90 నిమిషాల ముందు ఉ.5:30 గం.లకు మాక్ పోలింగ్
  • రాజకీయ పార్టీల ఏజెంట్లు సమయానికి చేరుకోవాలి
  • బ్యాలెట్ యూనిట్‌తోపాటు వీవీప్యాట్ ట్రేను పూర్తిగా క్లియర్ చేయాలని ఆదేశాలు
  • రాష్ట్రంలో 35,655 పోలింగ్ కేంద్రాలు
  • 27,094 సమస్యాత్మక కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ నిర్వహిస్తాం
  • పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసిన 1.48 లక్షల మంది ఉద్యోగులు
  • పోలింగ్ ముగిసే వరకు రాష్ట్రంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుంది

ఉపాధ్యాయ సంఘాలు వేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

  • పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ సదుపాయం కల్పించలేదని హైకోర్టులో పిటిషన్‌
  • పోస్టల్‌ బ్యాలెట్‌ అప్లై చేసుకున్న వారందరికీ అవకాశం కల్పించామని కోర్టుకు తెలిపిన ఈసీ
  • అందరూ ఓటు హక్కు వినియోగించుకున్నారని కోర్టుకు తెలిపిన ఈసీ
  • పిటిషన్‌ను ముగించిన హైకోర్టు

  • రేపు సెలవు ఇవ్వడం లేదని ఎలక్షన్ కమిషషన్‌కు వరుస ఫిర్యాదులు
  • పలు MNC సంస్థల నుంచి 1950కి కంప్లైంట్స్

దీక్ష దివస్‌పై కాంగ్రెస్‌ ఫిర్యాదు

  • తెలంగాణ భవన్‌లో దీక్ష దివస్‌ కార్యక్రమం
  • మంత్రి కేటీఆర్‌ చేస్తున్న దీక్ష దివస్‌పై ఎన్నికల సంఘానికి కాంగ్రెస్‌ ఫిర్యాదు
  • రాష్ట్రంలో 144 సెక్షన్‌ అమల్లో ఉన్న టైమ్‌లో దీక్ష దివస్‌ చేయడం ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కిందికి వస్తుందని కాంగ్రెస్‌ పార్టీ ఫిర్యాదు

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: సీపీ సందీప్‌ శాండిల్య

  • ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రతీ ఒక్కరూ సహకరించాలి.
  • నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
  • హైదరాబాద్‌లో 1700 ప్రాంతాల్లో 4915 పోలింగ్‌ బూత్‌లు ఏర్పాటు. 
  • హైదరాబాద్‌లో 666 సమస్యాత్మక ప్రాంతాలు గుర్తింపు. 
  • అత్యంత సమస్మాత్మమైన 310 ప్రాంతాల్లో అదనపు ఫోర్స్‌ ఏర్పాటు. 
  • సిటీ పోలీసుతో పాటు 40 కంపెనీల సెంట్రల్‌ ఫోర్స్‌ అందుబాటులో ఉంటాయి. 
  • ప్రతీ పోలింగ్‌ కేంద్రం వద్ద సీసీ కెమెరా మానిటరింగ్‌కు స్పెషల్‌ టీమ్‌. 
  • హైదరాబాద్‌లో 2400 మందిని బైండోవర్‌ చేశాం. 
  • నగరంలో 7 జోన్లలో 1600 మంది రౌడీషీటర్లు ఉన్నారు. 
  • ప్రతీ రౌడీ షీటర్‌పై దృష్టిపెట్టాం. 
  • 48 గంటలు పోలీసులు అలర్ట్‌గా ఉండాలి.

తెలంగాణభవన్‌కు ఈసీ స్క్వార్డ్‌ టీమ్‌

  • తెలంగాణ భవన్‌కు చేరుకున్న ఎలక్షన్ కమిషన్ స్క్కార్డ్ టీమ్
  • కోడ్ అమలులో ఉన్నందున తెలంగాణ భవన్‌లో దీక్ష దివాస్ కార్యక్రమం చేయవద్దన్న ఈసీ టీమ్‌
  • సంప్రదింపులు జరుపుతున్న బీఆర్‌ఎస్‌ లీగల్ టీమ్
  • 200 మీటర్ల పరిధిలో పోలింగ్ కేంద్రం లేదని, ఇది కొత్తగా చేసే కార్యక్రమం కాదన్న బీఆర్‌ఎస్‌ లీగల్‌ టీమ్‌ వాదన
  • దీక్ష దివస్ చేయడానికి వీల్లేదని ఎన్నికల కమిషన్ స్పష్టం
  • డీసీపీతో సంప్రదింపులు జరిపిన బీఆర్‌ఎస్‌ లీగల్‌ టీమ్‌. 
  • తెలంగాణ భవన్‌ లోపల కార్యక్రమాలు జరుపుకోవాలని సూచించిన డీసీపీ
  • తెలంగాణ భవన్‌ లోపల కార్యక్రమం యథావిధిగా కొనసాగింపు
  • కాసేపట్లో దీక్ష దివస్‌లో పాల్గొననున్న కేటీఆర్‌

గంగుల కమలాకర్ సీరియస్‌ కామెంట్స్‌

  • రేపు జరగబోయేది నాకు నాలుగో ఎన్నిక 
  • విజయం దిశగా  బీఆర్‌ఎస్‌ ముందుకు వెళ్తుంది 
  • కరీంనగర్‌లో నేను మంచి మెజారిటీతో గెలవబోతున్నాను. 
  • బండి సంజయ్ అకృత్యాలకు ప్రజలు విసిగిపోయారు. 
  • కరీంనగర్ అభివృద్ధికి రూపాయి కూడా ఇవ్వలేదు. ధర్మం పేరుతో రూపాయి కూడా ఖర్చుచేయలేదు. 
  • బండి సంజయ్ మూడోసారి సక్సెస్‌ఫుల్‌గా ఓడిపోతున్నారు. 
  • బండి సంజయ్‌కి ఓటు అడిగే హక్కులేదు.  
  • నిన్న కొత్తపల్లిలో బండి సంజయ్  గుండాలను వేసుకొని విచ్చల విడిగా డబ్బు పంచారు 
  • భాగ్యలక్ష్మి టెంపుల్లో డబ్బులు, మందు పంచలేదని ప్రమాణం చేద్దామా?
  • మేమే డబ్బులు పంచుతున్నామని ఆరోపిస్తున్నారు 
  • బండి సంజయ్  డబ్బులు  పంచుతున్నాట్లు  సీసీ టీవీ ఫుటేజీలో రికార్డ్  అయ్యింది 
  • చట్టాన్ని నువ్వు ఎలా చేతుల్లోకి తీసుకుంటావ్?.
  • బండి సంజయ్ డబ్బులు పంచుతుండగా దొరికిండు 
  • వంద శాతం బండి సంజయ్ నువ్వు ఓడిపోతున్నావ్

పాడి కౌశిక్‌రెడ్డిపై ఈసీ సీరియస్‌

  • హుజురాబాద్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై ఎలక్షన్ కమిషన్ సీరియస్
  • నివేదిక ఇవ్వాలని రిటర్నింగ్ అధికారిని ఆదేశించిన ఈసీ
  • నిన్న హుజురాబాద్‌లో ఎమోషనల్ వ్యాఖ్యలు చేసిన కౌశిక్ రెడ్డి

కొనసాగుతున్న ఈవీఎం పంపిణీ..

  • మాసబ్ ట్యాంక్ ప్రభుత్వ కాలేజీ డీఆర్సీ సెంటర్‌లో రిపోర్ట్ చేస్తున్న పోలింగ్ సిబ్బంది..
  • కొనసాగుతున్న ఈవీఎంల పంపిణీ..
  • ఏఆర్వో జ్యోతి కామెంట్స్‌..
  • మధ్యాహ్నంలోపు అన్ని బూత్‌లకు ఈవీఎంలు పంపిణీ చేస్తాం.
  • సాయంత్రంలోపు అన్ని బూత్‌ల ఎన్నికల అధికారులు బూత్‌లకు చేరుకుని రిపోర్ట్ చేయాలి.
  • ఈసారి పోలింగ్ మెటీరియల్ మిస్ కాకుండా చెక్ లీస్ట్ ఇస్తున్నాం.
  • నాంపల్లిలో 5 మోడల్ పోలింగ్ బూత్‌లు, ఐదు ఉమెన్ పోలింగ్ బూత్‌లు, ఒక యూత్ పోలింగ్ బూత్ ఏర్పాటు చేసాం.
  • డీఆర్సీ సెంటర్ నుంచి ఈవీఎంల పంపిణీ నుండి రేపు పోలింగ్ ముగిసే వరకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంన్నాం.

నిజామాబాద్‌లో భారీ నగదు స్వాధీనం..

  • జిల్లాల్లో నాలుగు కోట్ల 60 లక్షల నగదు, కోటి 10 లక్షల బంగారం, ఆభరణాలు..
  • కోటీ రెండు లక్షల విలువ చేసే బహుమతులు, నాలుగు కోట్ల ఐదు లక్షల విలువ చేసే లిక్కర్ సీజ్..
  • సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేసిన ఎనిమిది మందిపై కేసులు నమోదు
  • ప్రతీ నియోజక వర్గంలో ఐదు మహిళ పోలింగ్ కేంద్రాలు, పోలింగ్ సిబ్బంది కూడా అంతా మహిళలే
  • మొత్తం పోలింగ్ వెబ్ క్యాస్టింగ్..
  • పోలింగ్ కేంద్రాలకు వంద మీటర్ల వరకు 144 సెక్షన్ నిషేధాజ్ఞలు

రేపటి పోలింగ్‌కు సర్వం సిద్దం

  • డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల వద్దకు చేరుకుంటున్న పోలింగ్ సిబ్బంది
  • అభ్యర్థుల నమూనా పత్రాలు, ఈవీఎం మెషీన్లు, వీవీప్యాట్స్, ఇంక్, ఎన్నికల ఇతరత్రా సామగ్రి సిద్దం చేసుకోనున్న సిబ్బంది
  • కాసేపట్లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి పోలింగ్ కేంద్రాలకు వెళ్లనున్న ఎన్నికల సిబ్బంది
  • పోలింగ్ కేంద్రాలకు వెళ్లేందుకు బస్సులు సిద్ధం

ఎన్నికల వేళ డబ్బు తరలిస్తున్న సీఐ సస్పెండ్‌

  • మేడ్చల్‌లోని మేడిపల్లి మండలం చెంగిచర్లలో డబ్బుతో పట్టుపడిన సీఐ అంజిత్‌ రావ్‌
  • కారులో డబ్బుతో వెళ్తుండగా పట్టుకున్న కాంగ్రెస్‌ నేతలు
  • డబ్బు, కారును సీజ్‌ చేసిన ఎన్నికల అధికారులు
  • ఎక్సైజ్‌ సీఐ అంజిత్‌ రావు సస్పెండ్‌

భైంసాలో అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్తత..

  • నిర్మల్ జిల్లాలోని భైంసాలో అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. 
  • బీజేపీ అభ్యర్థి రామారావు పటేల్ బంధువు ఇంటిలో సమాచారం మేరకు ఎఫ్‌ఎస్‌టీ టీంతో పోలీసుల సోదాలు
  • బీజేపీ కార్యకర్తల ఆందోళన..
  • పోలీసులు, బీజేపీ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ..
  • పలువురు పోలీసులకు , కార్యకర్తలకు గాయాలు,
  • పలు కార్ల అద్దాలు ధ్వంసం..
  • చెదరగొట్టిన పోలీసులు.. పలువురుని అదుపులోకి తీసుకున్న పోలీసులు.
     

నేడు కాంగ్రెస్‌ నేతల అత్యవసర సమావేశం

  • నేడు తెలంగాణ కాంగ్రెస్‌ నేతల అత్యవసర సమావేశం
  • గాంధీభవన్‌లో ఉదయం 10:30 గంటలకు సమావేశం కానున్న సీనియర్లు
  • సమావేశానికి హాజరు కానున్న రేవంత్‌, మానిక్‌రావ్‌ ఠాక్రే, ఉత్తమ్‌ కుమార్‌, మధు యాష్కీ, వీహెచ్‌, మహేష్‌ గౌడ్‌ సహా తదితరులు

కరీంనగర్‌లో అర్ధరాత్రి హైటెన్షన్‌

  • కరీంనగర్ నియోజకవర్గం కొత్తపల్లిలో ఉద్రిక్తత
  • బీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచుతున్నారనే సమాచారంతో కొత్తపల్లికి చేరుకున్న బండి సంజయ్
  • బీఆర్ఎస్ నేతలు ఓటర్ల స్లిప్పుల్లో డబ్బులు పంచుతుండగా అడ్డుకున్న బీజేపీ శ్రేణులు
  • రెచ్చిపోయిన బీఆర్ఎస్ నేతలు… 
  • బీజేపీ నేతలతో ఘర్షణకు దిగిన కార్యకర్తలు
  • ఇంత బాహాటంగా డబ్బులు పంచుతుంటే ఏం చేస్తున్నారంటూ బండి సంజయ్ ఆగ్రహం
  • సమాచారం తెలుసుకున్న బీజేపీ శ్రేణులు కొత్తపల్లికి రాక
  • బీఆర్ఎస్ కార్యకర్తల తీరుపై తీవ్ర ఆగ్రహం
  • ఇరువర్గాల మధ్య నెలకొన్న ఉద్రిక్తత
  • పోలీసుల రంగ ప్రవేశం
  • ఇరువర్గాలను వేర్వేరుగా ఉంచిన పోలీసులు

రాజకీయ ప్రకటనలు ఇవ్వకూడదు: వికాస్‌రాజ్‌

  • మీడియాతో తెలంగాణ  రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈఓ) వికాస్‌రాజ్‌
  • స్థానికేతరులు నియోజకవర్గాలను వదిలి వెళ్లాలని ఈసీ ఆదేశం
  • ఈనెల 30న పోలింగ్‌, డిసెంబర్‌ 3న కౌంటింగ్‌
  • 119 అసెంబ్లీ స్థానాలకు బరిలో 2,290 అభ్యర్థులు
  • ఈసారి ఎన్నికల బరిలో 221 మంది మహిళలు, ఒక ట్రాన్స్‌జెండర్‌
  • రాష్ట్రంలో మొత్తం ఓటర్లు 3 కోట్ల 26 లక్షలు
  • కోటి 63 లక్షల 1,705 మంది మహిళా ఓటర్లు
  • కోటి 62 లక్షల 92వేల 418 మంది పురుష ఓటర్లు
  • 2,676 మంది ట్రాన్స్‌జెండర్లు
  • రాష్ట్రంలో మొత్తం 35,655 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు
  • 12వేల పోలింగ్‌ కేంద్రాలు సమస్యాత్మకమైనవిగా గుర్తింపు
  • తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోనున్న 9 లక్షల 99వేల 667 మంది
  • ఏ రాజకీయ పార్టీ ఎలాంటి సమావేశం నిర్వహించకూడదు
  • సైలెంట్‌ పీరియడ్‌ మొదలైంది
  • స్థానికేతరులు నియోజకవర్గాలను వదిలి వెళ్లాలి
  • ఎలాంటి ఎన్నికల మెటీరియల్‌ను ప్రదర్శించకూడదు
  • సోషల్‌ మీడియాలో కూడా ఎలాంటి ప్రచారం చేయకూడదు
  • రాజకీయ ప్రకటనలు ఇవ్వకూడదు
  • పోలింగ్‌ స్టేషన్లకు మొబైల్‌ అనుమతి లేదు
  • రాష్ట్ర వ్యాప్తంగా 60 వేల బ్యాలెట్‌ యూనిట్లు
  • అదనంగా మరో 14 వేలు రిజర్వ్‌లో పెట్టిన ఎలక్షన్‌ కమిషన్‌
  • రాష్ట్ర వ్యాప్తంగా విధుల్లో 3 లక్షల మంది పోలింగ్‌ సిబ్బంది
  • 27, 094 పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌ క్యాస్టింగ్‌
  • సీనియర్‌ సిటిజన్‌ ఓటర్లు(80 ఏళ్ల పైబడి)4,40,371
  • వీరిలో 1,89, 519 మంది పురుషులు, 2,50,840 మంది మహిళలు, ట్రాన్స్‌జెండర్లు 12 మంది
  • ఎన్‌ఆర్‌ఐ ఓటర్లు 2,933, దివ్యాంగులు 5 లక్షల 6వేల 921 మంది
  • రాష్ట్ర వ్యాప్తంగా 12 వేల సమస్యాత్మక కేంద్రాలు
  • గ్రేటర్‌ హైదరాబాద్‌లో 1,800 సమస్యాత్మక కేంద్రాలు
  • క్రిటికల్‌ పోలింగ్‌ కేంద్రాల్లో మూడంచెల భద్రత
  • అత్యంత క్రిటికల్‌ పోలింగ్‌ కేంద్రాల్లో ఐదంచెల భద్రత
  • మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 600 పోలింగ్‌ కేంద్రాలు
  • సిర్పూర్‌, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్‌, మంథని, భూపాలపల్లి,
    ములుగు, పినపాక, ఇల్లందు కొత్తగూడెం, అశ్వరావుపేట, భద్రాచలం నియోజకవర్గాల్లో సాయంత్రం 4గంటల వరకే పోలింగ్‌
  • 13 నియోజకవర్గాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ పోలింగ్‌
  • మిగిలిన 106 నియోజకవర్గాల్లో ఉదయం 7 నుంచి 5 గంటల వరకూ పోలింగ్‌
  • ఈసారి కొత్తగా మోడల్‌, మహిళా పోలింగ్‌ కేంద్రాలు
  • హోం ఓటింగ్‌, ఫెసిలిటేషన్‌ సెంటర్లు ఏర్పాటు
  • ప్రతి సెగ్మెంట్‌లో 5 మహిళ, 5 మోడల్‌, ఒకటి దివ్యాంగుల పోలింగ్‌ కేంద్రాలు
  • 375 కంపెనీల నుంచి కేంద్ర బలగాలు, 50 వేల సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు
  • ఇప్పటి నుంచి 30వ తేదీ సాయంత్రం 5 గంటల వరకూ 144 సెక్షన్‌ అమలు
  • 30వ తేదీ సాయంత్రం గం. 5.30ని.ల వరకూ మద్యం దుకాణాలు బంద్‌.

పోలింగ్‌ రోజు సెలవు ప్రకటించకుంటే కఠిన చర్యలు.. సీఈఓ వికాస్‌రాజ్‌

  • శాసనసభ సాధారణఎన్నికల్లో ఓటేసేందుకు నవంబర్‌ 30న పోలింగ్‌ రోజు సెలవు ప్రకటించని ప్రైవేటు వ్యాపార సంస్థలు, కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) వికాస్‌రాజ్‌ ఆదేశించారు. గత శాసనసభ సాధారణ ఎన్నికల పోలింగ్‌ రోజు కొన్ని ఐటీ, ఇతర ప్రైవేటు కంపెనీలు తమ ఉద్యోగులకు సెలవు ప్రకటించలేదని ఫిర్యాదులొచ్చాయని ఆయన గుర్తు చేశారు. ఈ సారి ఎవరైనా తమ ఉద్యోగులకు సెలవు ప్రకటించని పక్షంలో కార్మిక చట్టంతో పాటు ఎన్నికల చట్టాల కింద కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ రాష్ట్ర కార్మిక శాఖకు మంగళవారం లేఖ రాశారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement