తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు-2023.. టుడే అప్‌డేట్స్‌ | Telangana Assembly Elections Today Updates 28 November | Sakshi
Sakshi News home page

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు-2023.. టుడే అప్‌డేట్స్‌

Published Tue, Nov 28 2023 7:09 AM | Last Updated on Tue, Nov 28 2023 9:35 PM

Telangana Assembly Elections Today Updates 28 November - Sakshi

Telangana Assembly Elections Today Minute To Minute Update..

తెలంగాణలో ముగిసిన ఎన్నికల ప్రచారం

మీడియాతో తెలంగాణ  రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈఓ) వికాస్‌రాజ్‌

  • స్థానికేతరులు నియోజకవర్గాలను వదిలి వెళ్లాలని ఈసీ ఆదేశం
  • ఈనెల 30న పోలింగ్‌, డిసెంబర్‌ 3న కౌంటింగ్‌
  • 119 అసెంబ్లీ స్థానాలకు బరిలో 2,290 అభ్యర్థులు
  • ఈసారి ఎన్నికల బరిలో 221 మంది మహిళలు, ఒక ట్రాన్స్‌జెండర్‌
  • రాష్ట్రంలో మొత్తం ఓటర్లు 3 కోట్ల 26 లక్షలు
  • కోటి 63 లక్షల 1,705 మంది మహిళా ఓటర్లు
  • కోటి 62 లక్షల 92వేల 418 మంది పురుష ఓటర్లు
  • 2,676 మంది ట్రాన్స్‌జెండర్లు
  • రాష్ట్రంలో మొత్తం 35,655 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు
  • 12వేల పోలింగ్‌ కేంద్రాలు సమస్యాత్మకమైనవిగా గుర్తింపు
  • తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోనున్న 9 లక్షల 99వేల 667 మంది
  • ఏ రాజకీయ పార్టీ ఎలాంటి సమావేశం నిర్వహించకూడదు
  • సైలెంట్‌ పీరియడ్‌ మొదలైంది
  • స్థానికేతరులు నియోజకవర్గాలను వదిలి వెళ్లాలి
  • ఎలాంటి ఎన్నికల మెటీరియల్‌ను ప్రదర్శించకూడదు
  • సోషల్‌ మీడియాలో కూడా ఎలాంటి ప్రచారం చేయకూడదు
  • రాజకీయ ప్రకటనలు ఇవ్వకూడదు
  • పోలింగ్‌ స్టేషన్లకు మొబైల్‌ అనుమతి లేదు
  • రాష్ట్ర వ్యాప్తంగా 60 వేల బ్యాలెట్‌ యూనిట్లు
  • అదనంగా మరో 14 వేలు రిజర్వ్‌లో పెట్టిన ఎలక్షన్‌ కమిషన్‌
  • రాష్ట్ర వ్యాప్తంగా విధుల్లో 3 లక్షల మంది పోలింగ్‌ సిబ్బంది
  • 27, 094 పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌ క్యాస్టింగ్‌
  • సీనియర్‌ సిటిజన్‌ ఓటర్లు(80 ఏళ్ల పైబడి)4,40,371
  • వీరిలో 1,89, 519 మంది పురుషులు, 2,50,840 మంది మహిళలు, ట్రాన్స్‌జెండర్లు 12 మంది
  • ఎన్‌ఆర్‌ఐ ఓటర్లు 2,933, దివ్యాంగులు 5 లక్షల 6వేల 921 మంది
  • రాష్ట్ర వ్యాప్తంగా 12 వేల సమస్యాత్మక కేంద్రాలు
  • గ్రేటర్‌ హైదరాబాద్‌లో 1,800 సమస్యాత్మక కేంద్రాలు
  • క్రిటికల్‌ పోలింగ్‌ కేంద్రాల్లో మూడంచెల భద్రత
  • అత్యంత క్రిటికల్‌ పోలింగ్‌ కేంద్రాల్లో ఐదంచెల భద్రత
  • మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 600 పోలింగ్‌ కేంద్రాలు
  • సిర్పూర్‌, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్‌, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు కొత్తగూడెం, అశ్వరావుపేట, భద్రాచలం నియోజకవర్గాల్లో సాయంత్రం 4గంటల వరకే పోలింగ్‌
  • 13 నియోజకవర్గాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ పోలింగ్‌
  • మిగిలిన 106 నియోజకవర్గాల్లో ఉదయం 7 నుంచి 5 గంటల వరకూ పోలింగ్‌
  • ఈసారి కొత్తగా మోడల్‌, మహిళా పోలింగ్‌ కేంద్రాలు
  • హోం ఓటింగ్‌, ఫెసిలిటేషన్‌ సెంటర్లు ఏర్పాటు
  • ప్రతి సెగ్మెంట్‌లో 5 మహిళ, 5 మోడల్‌, ఒకటి దివ్యాంగుల పోలింగ్‌ కేంద్రాలు
  • 375 కంపెనీల నుంచి కేంద్ర బలగాలు, 50 వేల సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు
  • ఇప్పటి నుంచి 30వ తేదీ సాయంత్రం 5 గంటల వరకూ 144 సెక్షన్‌ అమలు
  • 30వ తేదీ సాయంత్రం గం. 5.30ని.ల వరకూ మద్యం దుకాణాలు బంద్‌
     

కొడంగల్‌లో మంత్రి హరీశ్‌రావు కామెంట్స్‌

  • మార్పు రావాలని కాంగ్రెస్‌ అంటోంది 
  • ఇచ్చిన హామీలు నెరవేర్చినందుకు మార్పు రావాలా 
  • పేదలకు సంక్షేమం అందించినందుకు మార్పు రావాలా
  • కేసీఆర్‌తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం

తెలంగాణ లోక్‌పోల్‌ మెగా సర్వే  ఇలా ఉంది..
 


బీజేపీ హెడ్‌ క్వార్టర్స్‌లో కిషన్‌రెడ్డి  ప్రెస్‌ మీట్‌ 

  • నవంబర్‌ 30న ప్రజలు ఓటుతో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి
  • మజ్లిస్‌ పార్టీని పెంచి పోషింది కాంగ్రెస్సే
  • రాహుల్‌, ప్రియాంకలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు
  • ముస్లిం మహిళలు, తల్లులు బీజేపీకి అనుకూలంగా ఉన్నారు 
  • అన్ని వర్గాల ప్రజల్లోనూ బీజేపీకి ఆదరణ ఉంది 
  • రాహుల్‌, ప్రియాంకలు అవగాహన లేకుడా మాట్లాడుతున్నారు 
  • మజ్లిస్‌ పార్టీ రౌడీయిజాన్ని సహించేది లేదు 
  • డిసెంబర్‌ 3 తర్వాత తెలంగాణకు బీసీ సీఎం వస్తారు 

తెలంగాణలో బీజేపీ అగ్ర నేతల  దండయాత్ర

  • పట్టున్న అసెంబ్లీ స్థానాలపై విస్తృత ప్రచారం
  • అగ్రనేతల పర్యటనలతో కమలం క్యాడర్ లో జోష్
  • 8 సభల్లో పాల్గొన్న ప్రధాని మోదీ 
  • హైదరాబాద్ లో ప్రధాని భారీ రోడ్ షో
  • బీసీ ఆత్మగౌరవ సభ, మాదిగ ఉప కులాల విశ్వరూప మహా సభల్లో పాల్గొన్న ప్రధాని
  • కామారెడ్డి, మహేశ్వరం, తూప్రాన్, నిర్మల్, మహబూబ్ బాద్, కరీం నగర్ లో ప్రధాని సభలు
  • 12 సభల్లో పాల్గొన్న జేపీ నడ్డా
  • సికింద్రాబాద్, ముషీరాబాద్, కూకట్ పల్లి, జగిత్యాల, బాన్స్ వాడ, జుక్కల్, బోధన్, హుజూర్ నగర్ , చేవెళ్ల, నారాయణ పేట, మల్కాజ్ గిరి, జూబిలీ హిల్స్ సభల్లో పాల్గొన్న నడ్డా 
  • తెలంగాణలో 21 సభల్లో పాల్గొన్న అమిత్ షా 
  • రాజేంద్ర నగర్, శేరిలింగంపల్లి, అంబర్ పేట, కోరుట్ల, కొల్హాపూర్, ఖైరతాబాద్, మక్తల్, ములుగు, భువనగిరి, మునుగోడు, పటాంచేరు, ఆర్మూర్,హుజూరాబాద్, పెద్దపల్లి, మంచిర్యాల, జనగామ, ఉప్పల్, నల్గొండ, వరంగల్,గద్వాల్, సూర్యాపేట సభల్లో పాల్గొన్న అమిత్ షా
  • హైదరాబాద్ లో మేనిఫెస్టో విడుదల చేసిన అమిత్ షా
  • 8 సభల్లో పాల్గొన్న యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్
  • సిర్పూర్, వేములవాడ, గోషామహల్, మహబూబ్ నగర్, కల్వకుర్తి, సనత్ నగర్, ఎల్బీనగర్, కుత్బుల్లాపూర్ సభల్లో పాల్గొన్న యోగి
  • ఆరు సభల్లో పాల్గొన్న రాజనాథ్ సింగ్
  • హుజూరాబాద్, మహేశ్వరం, కంటోన్మెంట్, ఆర్మూర్, మేడ్చల్, కార్వాన్ సభల్లో పాల్గొన్న రాజ్ నాథ్ సింగ్
  • చార్మినార్, మలక్ పేట్, సిర్పూర్, పరకాల, దేవరకద్ర నియోజకవర్గాల్లో పర్యటించిన హిమంత బిశ్వశర్మ 
  • కొల్లాపూర్, ఎల్లారెడ్డి సభల్లో పాల్గొన్న నితిన్ గడ్కరీ
  • తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్ర మంత్రులు 
  • నిర్మల సీతారామన్, స్మృతి ఇరానీ, పీయూష్ గోయల్, సాధ్వి నిరంజన్ జ్యోతి, అనురాగ్ సింగ్ ఠాకూర్
  • చివరిరోజు ప్రచారంలో పాల్గొన్న మహారాష్ట్ర సిఎం ఏక్ నాథ్ షిండే
  • ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాజీ ముఖ్యమంత్రులు
  • దేవేంద్ర ఫడ్నవీస్, యడ్యూరప్ప, జైరాం ఠాకూర్

సిరిసిల్ల ఎన్నికల ప్రచార సభలో మంత్రి కేటీఆర్‌

  • సిరిసిల్లలో ఇంకా చేయాల్సింది చాలా ఉంది
  • 3 గంటల కరెంటు చాలని కాంగ్రెస్‌ నేతలు అంటున్నారు
  • కాంగ్రెస్‌ వల్లనే తెలంగాణ ఎన్నో ఇబ్బందులు పడింది
  • కాంగ్రెస్‌ వస్తే 6 నెలలకో సీఎం మారతారు తప్ప ఇంకేమీ ఉండదు
  • కేసీఆర్‌ వచ్చాక కరెంట్‌, నీటి కష్టాలు తీర్చుకున్నాం

గజ్వేల్‌ ఎన్నికల ప్రచార సభలో సీఎం కేసీఆర్‌

  • ఇందిరమ్మ రాజ్యంలో అన్ని కష్టాలే కదా?
  • ఇందిరమ్మ రాజ్యం ఎవరికి కావాలి?
  • పెన్షన్‌ తమాషాకు ఇవ్వం
  • పెన్షన్‌ రూ. 5 వేలకు పెంచుతాం
  • తెలంగాణ మరింత అభివృద్ధి చెందాలనేది నా ఆకాంక్ష
  • నాకు పదవులు ముఖ్యం కాదు.. తెలంగాణ అభివృద్ధే ముఖ్యం
  • పేదలు లేని తెలంగాణ కావాలి
  • మళ్లీ రాష్ట్రాన్ని ఇబ్బందుల్లోకి నెట్టే పరిస్థితి రావొద్దు
  • పరిశ్రమలు తెచ్చుకున్నాం.. సంపదను పెంచుకున్నాం
  • రైతుబంధు దుబారా అంటూ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతున్నారు
  • పంటలకు 3 గంటల కరెంట్‌ సరిపోతుందా?
  • రైతులకు 3 గంటల కరెంట్‌ చాలని మాట్లాడుతున్నారు
  • 24 గంటల కరెంట్‌ వృథా అంటూ రేవంత్‌ చెబుతున్నారు

తెలంగాణ రాజకీయాల్లో నయా ట్రెండ్‌

  • బాండ్‌ పేపర్ల పేరుతో సరికొత్త రాజకీయం
  • ఆరు గ్యారంటీలకు బాండ్‌ పేపర్‌ రాసిస్తున్న కాంగ్రెస్‌
  • గతంలో పసుపు బోర్డు తెస్తానంటూ బాండ్‌ పేపర్‌ రాసిచ్చిన బీజేపీ ఎంపీ అర్వింద్‌
  • కాంగ్రెస్‌, బీజేపీ నేతలకు బాండ్‌ రాజకీయాలు కొత్త ఏమీ కాదు: ఎమ్మెల్సీ కవిత

మద్యం షాపులు బంద్

  • ఎల్లుండి పోలింగ్ నేపథ్యంలో  మద్యం షాపులు బంద్
  • ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి ఎల్లుండి పోలింగ్ ముగిసే సమయం వరకు తెలంగాణలోని మొత్తం మద్యం షాపులు మూసివేత

బీఆర్‌ఎస్‌, బీజేపీ కలిసిపోయాయి: రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గహ్లోత్‌

  • ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ ఈడీని ఉపయోగించుకుంది.
  • అవినీతిలో తెలంగాణ నెంబర్‌ 1 స్థానంలో ఉంది
  • తెలంగాణలో అధికారంలోకి రాబోతున్నాం.

ఇందిరమ్మ రాజ్యమంటే ఎమర్జెన్సీ, ఎన్‌కౌంటర్లే: సీఎం కేసీఆర్‌

  • తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నెంబర్‌ వన్‌గా ఉంది. 
  • 50 ఏళ్ల కాంగ్రెస్‌ పాలన, 10 ఏళ్ల బీఆర్‌ఎస్‌ పాలనను మీరు బేరీజు వేసుకోవాలి. 
  • తెలంగాణ ఉద్యమంలో కీలక ఘట్టాలకు వరంగల్‌ వేదికగా నిలిచింది. 
  • రాయి ఏదో, రత్నం ఏదో గుర్తించి ఓటు వేస్తే మంచి జరుగుతుంది.
  • ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ, ఎన్‌కౌంటర్లే.
  • తెలంగాణ ప్రజల హక్కులు కాపాడటం కోసమే బీఆర్‌ఎస్‌ పనిచేసింది. 
  • ఎన్నికల ప్రచారంలో ఇది నా 95వ సభ. 
  • 1956లో ఉన్న తెలంగాణను ఊడగొట్టింది కాంగ్రెస్‌ పార్టీనే. 
  • అందరూ మద్దతిచ్చాక తప్పనిసరి పరిస్థితుల్లో తెలంగాణ ఇచ్చారు. 
  • కేసీఆర్‌ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని దీక్ష చేస్తే తెలంగాణ ప్రకటన చేశారు. 
  • కాంగ్రెస్‌ హయాంలో వరంగల్‌ సిటీకి ఎన్నిరోజులకు ఒక్కసారి నీళ్లు వస్తుండేవి. 
  • విద్య, వైద్య రంగాల్లో ఎన్నో మార్పులు తీసుకువచ్చాం. 
  • వరంగల్‌ అభివృద్ధి ఇప్పుడు స్టార్ట్‌ అయ్యింది. 
  • హెల్త్‌ యూనివర్సిటీని స్థాపించుకున్నాం. 
  • వరంగల్‌కు ఎన్నో పరిశ్రమలు రాబోతున్నాయి. 
     

రేపు, ఎల్లుండి విద్యాసంస్థలు బంద్‌

  • హైదరాబాద్‌లో రేపు(బుధవారం), ఎల్లుండి(గురువారం) అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. 
  • మళ్లీ డిసెంబర్‌ ఒకటో తేదీన విద్యాసంస్థలు యథావిధిగా ప్రారంభం కానున్నాయి. 

మోదీతో కాంప్రమైజ్‌ అయ్యే పరిస్థితి లేదు: రాహుల్‌ గాంధీ

  • నాంపల్లిల్లో కాంగ్రెస్‌ బహిరంగ సభ
  • బీజేపీ విభజన రాజకీయాలు చేసింది. మన దేశ సంస్కృతి ఇది కాదు
  • ప్రేమను పంచాలనే లక్ష్యంతో భారత్‌ జోడో యాత్ర చేశాను.
  • నాపై దేశ వ్యాప్తంగా కేసులు పెట్టారు.
  • నాపై పరువు నష్టం కేసు కూడా వేశారు. నా లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేశారు.
  • నేను మోదీతో కాంప్రమైజ్‌ అయ్యే పరిస్థితి లేదు
  • నాపై 24 కేసులు ఉన్నాయి. ఓవైసీపై ఎన్ని కేసులు ఉన్నాయి?.
  • కాంగ్రెస్‌ వాళ్లపై ఈడీ, కేసు పెట్టారు. ఓవైసీపై ఎందుకు ఉండవు.
  • కాంగ్రెస్‌, బీజేపీ పోటీచేసే రాష్ట్రాల్లో మా ఓట్లు చీల్చేందుకు ఎంఐఎం వస్తుంది.
  • బీజేపీ ఇచ్చిన లిస్ట్‌తో తమ అభ్యర్థులను ఎంఐఎం ప్రకటిస్తుంది

బీఆర్‌ఎస్‌తో ప్రజలు కష్టాలు పెరిగాయి: ప్రియాంక

  • ప్రియాంక గాంధీ.. జహీరాబాద్‌లో ఎన్నికల ప్రచారం
  • పదేళ్లలో బీఆర్‌ఎస్‌ ఏంచేసింది. ప్రశ్నాపత్నాలు లీక్‌ అయ్యాయి. 
  • ధరణితో రైతుల కష్టాలు పెరిగాయి. 
  • రుణమాఫీ పూర్తి కాలేదు. 
  • ఇచ్చిన హామీలను బీఆర్‌ఎస్‌ నెరవేర్చలేదు. 
  • అధిక ధరలు సామాన్యుడికి భారంగా మారాయి. 
  • బైబై కేసీఆర్‌.. మార్పు రావాలి.
  • కాంగ్రెస్‌ గెలిస్తే బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం
  • మహిళలకు ప్రతీ నెల డబ్బుల ఇస్తాం. 

నిర్మల్‌లో ఉద్రిక్తత

  • ఎన్నికల ప్రచారంలో నిర్మల్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. 
  • బీజేపీ అభ్యర్థి మహేశ్వర్‌ రెడ్డి ప్రచారంలో ఘర్షణ. 
  • మహేశ్వర్‌ రెడ్డి ప్రచారం చేస్తుండగా కర్రలతో దాడి చేసుకున్న బీఆర్‌ఎస్‌, బీజేపీ కార్యకర్తలు
  • ఒక వర్గం దాడికి దిగిందంటూ బీజేపీ నేతలు నిరసన
  • కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌

రాహుల్‌ గాంధీ మాటామంతి..

  • హైదరాబాద్‌లోని వివిధ వర్గాలతో రాహుల్‌ గాంధీ భేటీ
  • ఆటో డ్రైవర్లు, డెలివరీ బాయ్స్‌, పారిశుధ్య కార్మికులతో మాటామంతి
  • వారి సమస్యలు అడిగి తెలుసుకున్న రాహుల్‌
  • సంపాదించినదంతా డీజీల్‌, పెట్రోల్‌కే సరిపోతుందన్న ఆటోడ్రైవర్లు
  • తమ సమస్యలు పరిష్కరించాలని, ఈఎస్‌ఐ, పీఎఫ్‌ సదుపాయాలు కల్పించాలని డెలివరీ బాయ్స్‌ విజ్ఞప్తి
  • గిగ్‌వర్కర్స్‌ సోషల్‌ సెక్యూరిటీ కోసం రాజస్థాన్‌లో ఒక స్కిమ్‌ అమలు చేస్తున్నాం: రాహుల్‌
  • ప్రతి ట్రాన్సాక్షన్‌లో కొంత మొత్తాన్ని గిగ్‌ వర్కర్స్‌ సోషల్‌ సెక్యూరిటీ కోసం కేటాయిస్తున్నాం

కామారెడ్డి పట్టణంలో ప్రారంభమైన టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి రోడ్ షో..

  • కామారెడ్డి చౌరస్తా వరకు సాగనున్న రేవంత్‌ రోడ్ షో.
  • కామారెడ్డి చౌరస్తాలో కార్నర్ మీటింగ్‌లో ప్రసంగించనున్న రేవంత్.
  • హైదరాబాద్‌లో టీ కాంగ్రెస్ అభ్యర్థులు, నియోజకవర్గ అబ్జర్వర్‌లతో జూమ్‌లో సమావేశం అయిన ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్.
  • రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్‌కు పాజిటివ్ వేవ్ నడుస్తుందని, కాంగ్రెస్ మెజారిటీ సాదిస్తుందన్న కేసీ.
  • కాంగ్రెస్ అభ్యర్థులు బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంతో పోరాడుతున్నారని కానీ కానీ కాంగ్రెస్‌కు అన్ని వర్గాల మద్దతు ఉందంన్నారు కేసీ.

కాంగ్రెసోళ్లను నమ్మొద్దు: ఎమ్మెల్సీ కవిత

  • కాంగ్రెస్ వాళ్లు బాండ్ పేపర్లతో డ్రామాలు చేస్తున్నారు
  • కర్ణాటకలో ఇలాగే బాండ్ పేపర్లు రాసిచ్చి మాట తప్పారు
  • పదవుల కోసం కాంగ్రెస్ నాయకులు దిగజారి మోసం చేస్తారు
  • కర్ణాటకలో సంతకాలు చేసి 100 రోజులు అవుతున్నా ఒక్క కార్యక్రమం కూడా మొదలు పెట్టలేదు
  • మోదీ అధికారంలో ఉన్న కేంద్రంలో 13 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి.
  • ఒక్కటంటే ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు
  • తెలంగాణకు వచ్చి యువతతో సమావేశాలు నిర్వహించి రెచ్చ గొడుతున్నారు
  • కాంగ్రెస్ మొసలి కన్నీళ్లకు బలైతే ఐదేళ్లు బాధ పడతారు
  • 11 సార్లు పాలించిన కాంగ్రెస్ పాలనలో కరెంట్ సరిగ్గా లేదు
  • 9 ఏళ్లు పాలించిన బీఆర్‌ఎస్‌ హయాంలో 24 గంటల కరెంట్ ఇచ్చాం
  • 50 ఏళ్లలో 41 రిజర్వాయర్‌లు నిర్మిస్తే 9 ఏళ్లలో 107 రిజర్వాయర్‌లు బీఆర్‌ఎస్‌ హయాంలో నిర్మించాం

ప్రారంభమైన సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వీడియో కాన్ఫరెన్స్

  • పాల్గొననున్న సీఈఓ వికాస్ రాజ్ అండ్ టీం.
  • హాజరైన జిల్లా ఎన్నికల అధికారులు, సీపీలు, ఎస్పీలు.
  • పాల్గొన్న లా అండ్ ఆర్డర్ అడిషనల్ డిజి సంజయ్ కుమార్ జైన్, నోడల్ ఆఫీసర్ చీఫ్ మహేష్ భగవత్.
  • ఎలక్షన్ ప్రిపరేషన్‌పై ఈసీఐకి వివరించనున్న సీఈఓ వికాస్ రాజ్.
  • మద్యం, నగదు కట్టిడిలో చివరి రెండు రోజులు కీలకమన్న సీఈసీ.
  • మావోయిస్టు - సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పై స్పెషల్ ఫోకస్ పెట్టాలన్న ఈసీఐ.

కాసేపట్లో సీఈసీ వీడియో కాన్ఫరెన్స్‌

  • మరికాసేపట్లో సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిషన్‌ వీడియో కాన్ఫరెన్స్‌
  • పాల్లొననున్న సీఈవో వికాస్‌రాజ్‌ అండ్‌ టీం
  • హాజరుకానున్న జిల్లా ఎన్నికల అధికారులు, సీపీలు, ఎస్పీలు
  • ఎలక్షన్‌ ప్రిపరేషన్‌పై ఈసీఐకి వివరించనున్న వికాస్‌రాజ్‌
     

కామారెడ్డిలో పీక్స్‌కు ప్రచారం..

  • నేడు జిల్లా కేంద్రంలో ప్రధాన మూడు పార్టీల అభ్యర్థుల రోడ్ షోలు
  • బీఆర్‌ఎస్‌ తరఫున రోడ్‌ షోలో పాల్గొననున్న కేటీఆర్‌,
  • దోమకొండ, బీబీపేట, కామారెడ్డిలో రోడ్‌ షోలో  రేవంత్‌ 
  • కాంగ్రెస్‌ బైక్‌ ర్యాలీలో పాల్గొననున్న రేవంత్‌
  • కామారెడ్డి జిల్లా కేంద్రంలో బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి రోడ్‌ షో
  • ప్రధాన పార్టీల ప్రచారం నేపథ్యంలో పోలీసుల భారీ బందోబస్తు.

నేటితో ప్రచారానికి ముగింపు

  • నేటితో ముగియనున్న ప్రచార పర్వం 
  • సాయంత్రం ఐదు గంటకు మూగబోనున్న మైకులు
  • 35వేలకు పైగా పోలింగ్ కేంద్రాలు 
  • మూడు లక్షల మంది పోలింగ్ సిబ్బంది
  • 13 జిల్లాలో సాయంత్రం 4 గంటలకు ముగియనున్న ప్రచార గడువు
  • పోలింగ్ టైం ముగియగానే సెగ్మెంట్లు ఖాళీ చేయాలని స్థానికేతరులకు ఎలక్షన్ కమిషన్ ఆదేశం
  • 119 అసెంబ్లీ స్థానాలకు సింగిల్ ఫేజ్‌లో ఎన్నికలు
  • రాష్ట్ర వ్యాప్తంగా 60వేల బ్యాలెట్ యూనిట్లు, అదనంగా మరో 14వేలు ఏర్పాటు చేస్తున్న ఎలక్షన్ కమిషన్
  • ఈ నెల 30వ తేదీన పోలింగ్
  • డిసెంబర్ 3వ తేదీన కౌంటింగ్.

కామారెడ్డిలో అర్ధరాత్రి హైడ్రామా

  • కామారెడ్డిలో కాంగ్రెస్‌ నేత ఇంట్లో పోలీసుల సోదాలు
  • కామారెడ్డి మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్‌, కాంగ్రెస్ నేత గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ ఇంటి వద్ద ఉద్రిక్తత
  • భారీగా నగదు ఉందనే ఫిర్యాదుతో అర్థరాత్రి దాటాక పోలీసులు, స్పెషల్ పార్టీ పోలిసుల సోదాలు
  • గడ్డం ఇందుప్రియ ఇంటికి భారీగా చేరుకున్న కాంగ్రెస్ నేతలు, పోలీసులకు మధ్య తోపులాట వాగ్వాదం
  • ఏ రైట్స్‌తో ఏ ఫిర్యాదుతో ఇంట్లోకి వస్తున్నారని ప్రశ్నించిన కాంగ్రెస్‌ నేతలు
  • మహిళా కానిస్టేబుల్స్ ఎక్కడా అని ప్రశ్నించిన ఇందు ప్రియ
  • ఇంట్లో ఏమీ దొరక్కపోవడంతో వెనుదిరిగిన పోలీసులు
  • కాంగ్రెస్ నేతల‌ ఇళ్లపై కావాలనే దాడులు చేస్తున్నారని డీసీసీ అధ్యక్షుడు శ్రీనివాస్ రావ్ ఆగ్రహం.
  • ఫిర్యాదు చెస్తే పోలిసులు వచ్చారా? లేక బీఆర్ఎస్ నేతలు చెప్తే వచ్చారా అని ఆగ్రహం.
  • నేడు కామారెడ్డిలో రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో పోలిసుల తీరుపై మండిపడుతున్న కాంగ్రెస్ నాయకులు
     

పోస్టల్ బ్యాలెట్‌పై బండి సంజయ్ ఫైట్ 

  • పోస్టల్‌ బ్యాలెట్‌పై కొనసాగుతున్న వార్‌
  • ఎన్నికల సంఘానికి ఇటీవల లేఖ రాసిన బండి సంజయ్
  • ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్నారంటూ ఈసీకి ఫిర్యాదు
  • కరీంనగర్‌లోనూ ఉద్యోగులందరికీ తగిన సమయమివ్వాలని కలెక్టర్‌ను కోరిన బండి
  • బండి లేఖపై సానుకూలంగా స్పందించిన ఈసీ
  • నేటి సాయంత్రం వరకు గడువు పొడిగించిన ఈసీ
  • బండికి ధన్యవాదాలు చెప్పిన ఉద్యోగులు

ఖమ్మం జిల్లా రాజకీయం ఇలా..

  • నేటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం
  • ఉమ్మడి జిల్లాను చుట్టేసిన రాజకీయ పార్టీల అగ్రనేతలు
  • కేసీఆర్‌, కేటీఆర్‌ పర్యటనలతో జోష్‌లో గులాబీ శ్రేణులు
  • రాహుల్‌, ప్రియాంక రాకతో కాంగ్రెస్‌లో కోలాహలం
  • పొంగులేటి, భట్టి, తుమ్మల ముగ్గురు కలిసి ప్రచారం
  • ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పదికి పది స్థానాలు తమవే అంటున్న కాంగ్రెస్
  • గత రెండు ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఖమ్మంలో సీట్ల సంఖ్య పెరుగుతాయంటున్న బీఆర్ఎస్
  • కొత్తగూడెం నియోజకవర్గంలో కీలకంగా మారిన ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి జలగం వెంకట్రావు
  • జలగంతో పాటు వనమా, కూనంనేని మధ్య నడుస్తున్న త్రిముఖ పోటీ
  • ఖమ్మం, పాలేరు, సత్తుపల్లిలో బీఆర్ఎస్, కాంగ్రెస్‌ల మధ్య నడుస్తున్న రసవత్తరమైన పోటీ
  • ఈ మూడు నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపు ఓటమిలపై 300కోట్లు బెట్టింగ్‌లు దాటినట్లు సమాచారం
  • మధిరలో గెలుపుపై ధీమాతో ఉన్న సీఎల్పీ నేత భట్టి విక్కమార్క.


నల్లగొండ జిల్లాలో రాజకీయం ఇలా..

  • చివరిరోజు హోరాహోరీగా ప్రచారం నిర్వహించనున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు
  • నల్లగొండ ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల త్రిముఖ పోరు. 
  • సూర్యాపేటలో చతుర్ముఖ పోటీ. 
  • నియోజకవర్గాల వారీగా పోటీ వివరాలు. 
  • నల్లగొండ: కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి మధ్య గట్టి పోటీ
  • ఇక్కడ ప్రధాన పార్టీలకు ధీటుగా పోటీనిస్తున్న ఏఐఎఫ్బీ అభ్యర్థి పిల్లి రామరాజు. 
  • మిర్యాలగూడ: బత్తుల లక్ష్మారెడ్డి(కాంగ్రెస్), భాస్కర్ రావు( బీఆర్ఎస్) మధ్య తీవ్రస్థాయిలో పోటీ
  • బీజేపీ పోటీలో ఉన్నా నామమాత్రమే.
  • నాగార్జునసాగర్: బీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ కాంగ్రెస్, అభ్యర్థి కుందూరు జైవీర్ రెడ్డి మధ్య నువ్వా నేనా అన్నట్లు పోటీ
  • బీజేపీ పోటీలో ఉన్నా నామమాత్రమే 
  • దేవరకొండ: కాంగ్రెస్ అభ్యర్థి  నేనావత్ బాలునాయక్, బీఆర్ఎస్ అభ్యర్థి రమావత్ రవీంద్ర మధ్య గట్టి పోటీ 
  • నకిరేకల్: కాంగ్రెస్ అభ్యర్థి వేముల వీరేశం, బీఆర్ఎస్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్య మధ్య తీవ్ర స్థాయిలో పోటీ
  • బీజేపీ ఉనికి నామమాత్రమే 
  • మునుగోడు: మునుగోడులో ముక్కోణపు పోటీ
  • నువ్వా నేనా అన్నట్లు పోటీపడుతున్న బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు
  • సూర్యాపేట జిల్లా: సూర్యాపేట నియోజకవర్గంలో చతుర్ముఖ పోటీ.
  • బీఆర్ఎస్ అభ్యర్థి జగదీశ్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి దామోదర్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి సంకినేని వెంకటేశ్వరరావు, బీఎస్పీ అభ్యర్థి వట్టే జానయ్య మధ్య తీవ్రస్థాయిలో పోటీ. బీఎస్పీ అభ్యర్థి చీల్చే ఓట్లే ఇక్కడ కీలకం 
  • తుంగతుర్తి: బీఆర్ఎస్ అభ్యర్థి గాదరి కిషోర్, కాంగ్రెస్ అభ్యర్థి మందుల సామ్యూల్ మధ్య తీవ్ర స్థాయిలో పోటీ
  • కోదాడ: బీఆర్ఎస్ అభ్యర్థి బొల్లం మల్లయ్య, కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ పద్మావతి మధ్య నువ్వా నేనా అన్నట్లు పోటీ.
  • బీజేపీ, జనసేన పొత్తులో భాగంగా పోటీ చేస్తున్న పవన్ కల్యాణ్ అభ్యర్థి సతీష్ రెడ్డి పోటీలో ఉన్నా నామమాత్రమే
  • హుజూర్‌నగర్: హుజూర్ నగర్‌లో ముక్కోణపు పోటీ
  • బీఆర్ఎస్ నుంచి సైదిరెడ్డి, కాంగ్రెస్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, బీజేపీ నుంచి శ్రీలత రెడ్డి నువ్వా నేనా అన్నట్లు ప్రచారం 
  • బీజేపీకి వచ్చే ఓట్లే ఇక్కడ గెలుపునకు కీలకం 
  • భువనగిరి: త్రిముఖ పోరు
  • బీఆర్ఎస్ అభ్యర్థి పైళ్ల శేఖర్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి కుంభ అనిల్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి గూడూరు నారాయణరెడ్డి మధ్య తీవ్రస్థాయిలో పోటీ
  • ఆలేరు: బీఆర్ఎస్ అభ్యర్థి సునీత మహేందర్రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి ఐలయ్య మధ్య తీవ్రస్థాయిలో పోటీ

ప్రియాంక కీలక కామెంట్స్‌

  • తెలంగాణ ప్రజల ఈ ఉత్సాహం సరికొత్త చరిత్ర లిఖించబోతోంది.
  • ఈసారి తెలంగాణ ప్రజలు తమ కలల కోసం, అభివృద్ధి కోసం, వారి బలమైన భవిష్యత్తు కోసం ఓటు వేయడానికి నిర్ణయించుకున్నారు.
  • మార్పు కావాలి! కాంగ్రెస్ రావాలి!


నేడు కాంగ్రెస్ ముఖ్య నేతల ప్రచార షెడ్యూల్..

  • జూబ్లీహిల్స్, నాంపల్లి, మల్కాజ్‌గిరి నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం చేయనున్న రాహుల్ గాంధీ.
  • జహీరాబాద్, మల్కాజ్‌గిరి  నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం చేయనున్న ప్రియాంక గాంధీ.
  • కామారెడ్డి, మల్కాజ్‌గిరిలో ఎన్నికల ప్రచారం చేయనున్న రేవంత్ రెడ్డి

నేడు నల్లగొండకు ఫడ్నవీస్‌

  • తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌
  • నల్లగొండ జిల్లాలోని దేవరకొండలో బీజేపీ బహిరంగ సభ. 
  • హాజరుకానున్న ఫడ్నవీస్.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement