
పల్లె లక్ష్మణ్‌రావు గౌడ్
సాక్షి, హైదరాబాద్: కాం గ్రెస్ ఇప్పటివరకు ప్రక టించిన 75 స్థానాల్లో 15 చోట్ల బీసీలకు టికెట్లు ఇచ్చిందని, మరో 10 నుంచి 12 స్థానాల్లో బీసీ అభ్యర్థులకు టికెట్లు ఆశిస్తున్నామని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పల్లె లక్ష్మణ్‌రావు గౌడ్ తెలి పారు. బుధవారం గాంధీభవన్‌లో ఆయన మీడి యాతో మాట్లాడుతూ బీసీలకు కాంగ్రెస్ తప్ప కుండా న్యాయం చేస్తుందన్న నమ్మకం తనకుం దని చెప్పారు. 40 ఏళ్లుగా ఎన్‌ఎస్‌యూఐ, యూత్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీల్లో పనిచేస్తున్న తనకు సికింద్రాబాద్ అసెంబ్లీ టికెట్ వస్తుందని ఆయన ధీమా ఆయన వ్యక్తం చేశారు.