tickets allottment
-
అట్టుడుకుతున్న టీడీపీ
సాక్షి, అమరావతి/సాక్షి, నంద్యాల/సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): టీడీపీలో టికెట్ల కేటాయింపు చంద్రబాబుకు పెద్ద తలనొప్పిలా మారింది. తమ్ముళ్లకు సర్దిచెప్పలేక బాబు నిద్రలేని రాత్రిళ్లు గడుపుతున్నారు. ఉండవల్లికి పిలుపించుకుని వారికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా టీడీపీ శ్రేణులు వెనక్కితగ్గకపోవడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో పడిపోయారు. ఇదంతా చంద్రబాబు నిర్వాకం వల్లేనని, పార్టీ కోసం కష్టపడినవారికి కాకుండా టికెట్లు అమ్ముకున్నారంటూ సీనియర్లు, కిందిస్థాయి నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు. దీంతో టీడీపీలో టికెట్ల చిచ్చు ఇప్పట్లో చల్లారేలాలేదు. వేరే వారికి సీట్లు ప్రకటించారని కొన్నిచోట్ల, తమ సీట్లు జనసేనకు కేటాయించారని మరికొన్ని చోట్ల ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు రచ్చ రచ్చ చేస్తున్నారు. చంద్రబాబు తన నిర్ణయం మార్చుకోకపోతే ఎన్నికల్లో తమ సత్తా చూపిస్తామని అల్టిమేటం జారీ చేశారు. టీడీపీ కీలక నేతపై దాడి అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం సీటును మహాసేన రాజేష్‌కు ఇవ్వడంపై అక్కడి టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. టీడీపీ కేడర్‌తో పాటు జనసేన నేతలు, కార్యకర్తలు రాజేష్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మంగళవారం టీడీపీ అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి గంటి హరీష్ మాధుర్‌పై కేడర్ ఏకంగా దాడికి పాల్పడ్డారు. దీంతో చంద్రబాబు ఇరకాటంలో పడ్డారు. అవనిగడ్డ సీటును జనసేనకు కేటాయించారనే సమాచారంతో అక్కడి టీడీపీ నేతలు ఇప్పటికే తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. కాగా, తనకు సీటు ఇవ్వకపోవడం మహదానందంగా ఉందంటూ నియోజకవర్గ ఇన్చార్జి మండలి బుద్ధప్రసాద్ వ్యంగ్యంగా స్పందించారు. జనసేనకు సీటు ఎలా ఇస్తారంటూ ఆయన అనుచరులు నియోజకవర్గంలో హడావుడి చేస్తున్నారు. ఉండిలో రామరాజును ఓడిస్తా: శివరామరాజు పశ్చిమగోదావరి జిల్లా ఉండిలో సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజుకు మళ్లీ సీటు ఇవ్వడంపై మాజీ ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు (కలవపూడి శివ) తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని ఇప్పటికే ఆయన ప్రకటించగా.. ఆయన్ను బుజ్జగించేందుకు టీడీపీ సీనియర్ నేతలు ఎంత ప్రయత్నించినా వినేందుకు సిద్ధంగా లేరు. మంగళవారం శివరామరాజు కార్యాలయానికి వెళ్లిన రామరాజు ఆయన మద్దతు కోరి అభాసుపాలయ్యారు. రామరాజుతో కరచాలనం చేసేందుకు శివరామరాజు ఇష్టపడకపోగా తన కార్యాలయానికి రావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ రామరాజు మీడియాతో మాట్లాడేందుకు ప్రయత్నించడంపై శివరామరాజు అభ్యంతరం తెలిపారు. రామరాజును ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడిస్తానని ఆయన స్పష్టం చేశారు. భగ్గుమన్న శేషారావు వర్గం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు సీటును జనసేనకు కేటాయించారనే ప్రచారంతో అక్కడి టీడీపీ ఇన్చార్జి బూరుగుపల్లి శేషారావు వర్గం ఆగ్రహంతో ఉంది. శేషారావుకు టికెట్ ఇవ్వాల్సిందేనని ఆయన వర్గం డిమాండ్ చేస్తోంది. నియోజకవర్గంలోని నాలుగు మండలాల నేతలు సమావేశమై జనసేన అభ్యర్థికి సహకరించేది లేదని తీర్మానాలు చేశారు. రాష్ట్రంలో పలు నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక చిచ్చు కొనసాగుతోంది. ఎన్టీఆర్ జిల్లా మైలవరం, తిరువూరు, కృష్ణా జిల్లా పెనమలూరు, పెడన, ఏలూరు జిల్లా నూజివీడు, విజయనగరం జిల్లా గజపతినగరం, విశాఖపట్నం వెస్ట్, నంద్యాల జిల్లా డోన్, కర్నూలు జిల్లా కోడుమూరు, సత్యసాయి జిల్లా పెనుకొండ, అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె, చిత్తూరు జిల్లా చిత్తూరు తదితర నియోజకవర్గాల్లో నేతలు సీట్ల కోసం సిగపట్లు పడుతున్నారు. చంద్రబాబు వారిని తన వద్దకు పిలిపించుకుని సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నా వినేందుకు సిద్ధంగా లేరు. సూళ్లూరుపేటలో ఆరని చిచ్చు సూళ్లూరుపేట నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా నెలవల విజయశ్రీని ప్రకటించడంపై మాజీ ఎమ్మెల్యే పరసా వెంకటరత్నయ్య కుమార్తె షాలిని తీవ్రంగా మండిపడ్డారు. 1994 నుంచి కష్టాల్లో పార్టీకి అండగా ఉన్న వెంకటరత్నయ్యకు ఒక్కమాట చెప్పకుండా అభ్యర్థిని ప్రకటించడాన్ని ఆమె తప్పుపట్టారు. తనను గాని, తన భర్తను గాని ఐవీఆర్ సర్వేలో ఎందుకు పెట్టలేదని ఆమె ప్రశ్నించారు. డోన్‌లో నువ్వా.. నేనా! డోన్‌లో కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించడంపై టీడీపీ మాజీ ఇన్చార్జి ధర్మవరం సుబ్బారెడ్డి వర్గం రగిలిపోతోంది. మార్చి 1న డోన్‌లో నూతన కార్యాలయం ప్రారంభించాక ఓ ఫంక్షన్ హాలులో కార్యకర్తలతో ఆత్మీయ సమావేశానికి కోట్ల సిద్ధమవుతుండగా.. పోటీగా సమావేశం నిర్వహించేందుకు సుబ్బారెడ్డి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కోట్ల తనయుడు మండలాల్లో కార్యకర్తలతో సమావేశమై తమకు మద్దతుగా నిలవాలని అభ్యర్థిస్తున్నారు. తనకు టికెట్ ఇస్తామని చెప్పి.. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఏకపక్షంగా అభ్యర్థిని ప్రకటించడంపై సుబ్బారెడ్డి సీరియస్‌గా ఉన్నారు. ప్రజా మద్దతు తనకే ఉందని అధినాయకత్వానికి చాటిచెప్పేలా మార్చి 2న సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అభిమానులు, కార్యకర్తల అభీష్టం మేరకే వచ్చే ఎన్నికల్లో రెబల్‌గా పోటీపై నిర్ణయం తీసుకుంటామని మంగళవారం బేతంచెర్లలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో స్పష్టం చేశారు. -
ధనవంతులకు ఫ్రీ పాస్లా..! : హర్ష్ గొయెంకా
న్యూఢిల్లీ: దేశమంతా వరల్డ్ కప్ ఫైనల్ సందడి నడుస్తోంది. సోషల్ మీడియా మొత్తం భారత్-ఆసీస్ మ్యాచ్ ఫీవరే కనిపిస్తోంది. ఈ ఫీవర్ పరిస్థితుల్లో ప్రముఖ పారిశ్రామిక వేత్త, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆర్పీజీ గ్రూప్ అధినేత హర్ష్ గొయెంకా చేసిన ట్వీట్ వివాదాస్పదమైంది. ట్వీట్‌ను నెటిజన్లు ఆయనకే బూమరాంగ్ చేసి రివర్స్ ప్రశ్నలేశారు. ఇంతకీ హర్ష్ గొయెంకా ఏమని ట్వీట్ చేశారంటే ‘ ప్రముఖ వ్యాపారస్తులైన నా స్నేహితులెవరూ డబ్బులు చెల్లించి ఫైనల్ మ్యాచ్ టికెట్లు కొనలేదు. వాళ్లందరూ ఫ్రీ పాస్‌లు తీసుకున్నారు. ఇక్కడ బాధేంటంటే ధనవంతులు డబ్బు చెల్లించడానికి ఇష్టపడకపోవడమే’ అని వ్యాఖ్యానించారు. దీనికి స్పందించిన ఆయన ఫాలోవర్ ఒకతను ‘మరి మీ పరిస్థితేంటి సార్? టికెటా..పాసా..?’ అని ప్రశ్నించారు. దీనికి స్పందించిన హర్ష్ గొయెంకా ఏదీకాదని సమాధానమిచ్చారు. అహ్మదాబాద్‌లో జరుగుతున్న వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ టికెట్లు ఒక్కోటి రూ. 2 లక్షల దాకా ప్రముఖ రీసెల్లింగ్ ప్లాట్‌ఫాంలో అమ్ముడవుతున్నాయి. ఈ ప్లాట్‌ఫాంలో టికెట్ స్టార్టింగ్ ధర 32వేలుండడం విశేషం. భారత్, ఆసీస్ మధ్య వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానుంది. None of my businessmen friends have paid to get tickets for the #WorldcupFinal, they have all managed to get a ‘pass’. And that’s where the irony lies- it’s the rich who don’t want to pay! — Harsh Goenka (@hvgoenka) November 18, 2023 How about you, Sir? Ticket or Pass. — Anand Singh (@Anands_page) November 18, 2023 ఇదీచదవండి...‘టీమిండియా గెలిచేవరకూ మెతుకు ముట్టం’ -
ఢిల్లీలోనే తేల్చుకుందాం
సాక్షి, హైదరాబాద్: బలహీన వర్గాల నేతలకు తగినన్ని టికెట్లు కేటాయించాల్సిందేనని, ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు 34 స్థానాలు ఇవ్వాలని రాష్ట్ర కాంగ్రెస్ బీసీ నేతల సమావేశం డిమాండ్ చేసింది. ఈ విషయంలో ఎందాకైనా కొట్లాడాలని, ఢిల్లీ వెళ్లి సోనియాగాం«దీ, రాహుల్, మల్లికార్జున ఖర్గే సమక్షంలోనే తేల్చుకోవాలని నిర్ణయించింది. ఇటీవల జరిగిన మహిళా రిజర్వేషన్ల బిల్లుపై చర్చ సందర్భంగా కూడా రాహుల్ ఓబీసీల పక్షాన మాట్లాడారని, తెలంగాణ కాంగ్రెస్‌లో మాత్రం సర్వేల పేరుతో బీసీలకు అన్యాయం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఈ సమావేశం అభిప్రాయపడింది. ఏఐసీసీ ఓబీసీ సెల్ కోఆర్డినేటర్ కత్తి వెంకటస్వామి అధ్యక్షతన ఆదివారం గాం«దీభవన్‌లో బీసీ నేతల సమావేశం జరిగింది. ఈ భేటీలో సీనియర్ నాయకులు వి.హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, మధుయాష్కీగౌడ్, సురేశ్ షెట్కార్, మహేశ్‌కుమార్‌గౌడ్, పొన్నం ప్రభాకర్, చెరుకు సుధాకర్, గాలి అనిల్‌కుమార్, సంగిశెట్టి జగదీశ్వర్‌రావు, మెట్టు సాయికుమార్, ముత్తినేని వీరయ్య వర్మలతోపాటు పలువురు నేతలు పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ నేతలకు టికెట్ల కేటాయింపే ఎజెండాగా చర్చించారు. సమావేశంలో తీసుకున్న ముఖ్య నిర్ణయాలివీ.. ♦ పార్టీ అధిష్టానాన్ని కలిసేందుకు సోమ లేదా మంగళవారాల్లో ఢిల్లీ వెళ్లాలి. అక్కడ సోనియా, రాహుల్, ఖర్గేను కలిసి తమ డిమాండ్లను వారి ముందుంచాలి. ♦ అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు కచ్చితంగా 34 సీట్లు కేటాయించాలని కోరుతూ అందరి సంతకాలతో అధిష్టానానికి లేఖ రాయాలి. పీసీసీ అధ్యక్షుడు, సీఎల్పీ నేతకు కూడా ఈ లేఖను అందజేయాలి. ♦ టికెట్ల కేటాయింపులో అన్ని కులాలకు ప్రాధాన్యమివ్వాలి. అభ్యర్థుల ప్రకటన కోసం విడుదల చేసే తొలిజాబితాలో బీసీ నేతల పేర్లు రాకుండా కుట్ర జరుగుతోంది. తొలి జాబితాలోనే బీసీ నేతల పేర్లను కూడా ప్రకటించాలి. ♦ బీసీలకు ఇచ్చే స్థానాలను ముందుగా గుర్తించి అక్కడ బీసీ నేతల పేర్లతోనే సర్వేలు జరపాలి. ♦ బీసీ నేతల్లో ఎవరికి టికెట్ వచ్చినా అందరం కలిసి గెలిపించుకోవాలి. ♦ పార్టీ పదవులు, నామినేటెడ్ పదవుల్లో బీసీల వాటాను అమలు చేయాలి. పెరిక, పద్మశాలీలకు అన్యాయం బీసీ కులాల్లో పెద్ద సంఖ్యలో జనాభా ఉండే పద్మశాలీలతోపాటు పెరిక వర్గానికి చెందిన నాయకులకు పార్టీలో అన్యాయం జరుగుతోందని పలువురు నాయకులు అభిప్రాయపడ్డారు. పద్మశాలీల పక్షాన మునుగోడు నుంచి పున్నా కైలాశ్ నేత, ముషీరాబాద్ నుంచి సంగిశెట్టి జగదీశ్వర్‌రావు, బాల్కొండ నుంచి ఈరవత్రి అనిల్ లాంటి నాయకులు దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో వారికి అవకాశం ఇవ్వాలనే చర్చ జరిగింది. నల్లగొండ, ఖమ్మం, మహబూబాబాద్, పెద్దపల్లి లాంటి లోక్‌సభ స్థానాల్లో రెండు స్థానాలను బీసీలకిచ్చే పరిస్థితి లేదని అంటున్నారని, సికింద్రాబాద్, భువనగిరి, నిజామాబాద్ లాంటి లోక్‌సభ స్థానాల పరిధిలో అవసరమైతే మూడు సీట్లు బీసీలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నుంచి కామారెడ్డి ఎమ్మెల్యేగా పెరిక కులానికి చెందిన ఎమ్మెల్యే ఉన్నాడని, ఆయన సీటును కూడా కేసీఆర్ గుంజుకున్న నేపథ్యంలో తమ కులానికి కాంగ్రెస్‌లో అయినా న్యాయం చేయాలని వికలాంగ విభాగం చైర్మన్ ముత్తినేని వీరయ్య వర్మ కోరారు. -
ఒక టికెట్.. తొమ్మిది నిబంధనలు!
సాక్షి, హైదరాబాద్: పార్టీ అభ్యర్థుల ఖరారు ప్రక్రియ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత చర్చలకు దారితీస్తోంది. ఈసారి టికెట్ల కేటాయింపులో అనుసరించాల్సిన నిబంధనలు, ఉదయ్‌పూర్ డిక్లరేషన్ వంటి డాక్యుమెంట్లతోపాటు తెలంగాణ వరకు ప్రత్యేకంగా పాటించాల్సిన షరతులు కొన్ని ఉన్నాయని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ఆదివారం గాంధీభవన్ వేదికగా జరగనున్న ప్రదేశ్ ఎన్నికల కమిటీ (పీఈసీ) సమావేశంలో ఆశావహుల జాబితాను షార్ట్‌లిస్ట్ చేయనున్న నేపథ్యంలో.. ఎలాంటి నిబంధనలు పాటిస్తారు? ఏయే నియోజకవర్గాల నుంచి ఎవరిని ఎంపిక చేసి అధిష్టానానికి ప్రతిపాదనలు పంపిస్తారన్నది ఆసక్తిగా మారింది. ఈ క్రమంలో ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పార్టీ టికెట్ ఇవ్వాలంటే తొమ్మిది నిబంధనలు పాటించాలని కొందరు సీనియర్లు సూచిస్తున్నారు. వారసులు.. కుటుంబ సభ్యుల లొల్లి! గతంలో ఎప్పుడూ ఉన్నదే అయినా.. ఈసారి ఉదయ్‌పూర్ డిక్లరేషన్ నేపథ్యంలో ఒక కుటుంబంలో ఎంత మందికి టికెట్లు ఇస్తారన్న దానిపై కాంగ్రెస్‌లో చర్చ జరుగుతోంది. గతంలో కంటే ఈసారి ‘ఫ్యామిలీ ప్యాక్’ డిమాండ్లు ఎక్కువగా ఉండటం, ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌లో చెప్పిన అంశాలపై పూర్తి స్పష్టత లేకపోవడంతో.. ఎవరెవరికి టికెట్లు రావొచ్చన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. వాస్తవానికి ఒక కుటుంబంలో ఒకరికే టికెట్ ఇవ్వాలని ఉదయ్‌పూర్‌లో జరిగిన కాంగ్రెస్ చింతన్‌శిబిర్‌లో నిర్ణయించారు. అయితే కుటుంబంలోని మరో వ్యక్తి ఐదేళ్లకంటే ఎక్కువకాలం కాంగ్రెస్‌లో క్రియాశీలకంగా పనిచేస్తే.. వారికి మినహాయింపు ఉంటుందని తీర్మానించారు. ఈ లెక్కన ఇప్పుడు టీపీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుటుంబం విషయంలో జరుగుతున్న చర్చకు తెరపడినట్టేనని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. ఉత్తమ్‌తోపాటు ఆయన భార్య పద్మావతి కూడా గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. 2018 ఎన్నికల్లో ఓడినప్పటికీ.. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం టీపీసీసీ ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు. దీంతో ఉత్తమ్, పద్మావతిలకు టికెట్ల విషయంలో ఎలాంటి గందరగోళానికి తావులేదని ఆ పార్టీ సీనియర్ నేతలు అంటున్నారు. ఇక కుటుంబంలో రెండు టికెట్లు అడిగే అవకాశాలున్న వారిలో జానారెడ్డి, దామోదర రాజనర్సింహ, దామోదర్‌రెడ్డి, బలరాం నాయక్, జగ్గారెడ్డి, కొండా సురేఖ, అంజన్‌కుమార్ యాదవ్, సీతక్క తదితరులు ఉన్నారు. వీరి కుటుంబ సభ్యులకు ఉదయ్‌పూర్ డిక్లరేషన్ ఏ మేరకు వర్తిస్తుంది? దాన్ని ఎలా అన్వయిస్తారన్న దానిపై పార్టీలో చర్చ జరుగుతోంది. రాష్ట్ర కాంగ్రెస్‌లో చర్చ జరుగుతున్న నిబంధనలు ఇవే.. 1) ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌ను తప్పకుండా పాటించాలి. 2) మూడుసార్లు వరుసగా ఓడిపోయిన వారికి టికెట్ ఇవ్వద్దు. 3) 2018 శాసనసభ ఎన్నికల్లో ఇతర పార్టీ గుర్తులతో పోటీచేసిన వారికి టికెట్లు ఇవ్వద్దు. 4) చివరి నిమిషంలో పార్టీలోకి వచ్చే ప్యారాచూట్ నేతలకు టికెట్లు నిరాకరించాలి. 5) క్షేత్రస్థాయిలో దశాబ్దాలుగా పనిచేస్తున్న వారికి, యువకులకు ప్రాధాన్యతనివ్వాలి. 6) పార్టీ అనుబంధ సంఘాల నేతలకు ఎన్నికల్లో పోటీచేసే అవకాశం కల్పించాలి. 7) ఇతర పార్టీల నుంచి ఇటీవలే కాంగ్రెస్‌లోకి వచ్చిన వారికి ప్రాధాన్యమిచ్చే రీతిలో వ్యవహరించవద్దు. రాహుల్‌గాంధీ ఆమోదంతో పార్టీలోకి వచ్చిన కొందరికి మినహాయింపు ఇవ్వాలి. 8) దరఖాస్తులు తీసుకుంటున్నారు కదా అని అప్లై చేసిన వారిని, పార్టీలో క్రియాశీల సభ్యత్వం లేని వారిని ప్రాథమిక స్థాయిలోనే తొలగించాలి. 9) ప్రదేశ్ ఎన్నికల కమిటీలోని మొత్తం సభ్యుల్లో 50శాతం మందికిపైగా టికెట్లు ఆశించనివారు ఉండాలి. పీఈసీలోని అందరూ టికెట్లు ఆశించే వారయితే షార్ట్‌లిస్ట్ ప్రక్రియ సజావుగా జరిగే అవకాశం ఉండదు. -
అనకాపల్లి.. ఇదేం లొల్లి..?
అనకాపల్లి జిల్లా టీడీపీలో ముసలం మొదలైంది. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై జిల్లా నేతలు కారాలు మిరియాలు నూరుతున్నారు. సీనియర్ నాయకుడై ఉండి ఒక పార్టీలో వర్గాలను సృష్టించడం పట్ల మండిపడుతున్నారు. ప్రస్తుతం అనకాపల్లి తెలుగుదేశంలో పరిస్థితి నివురు గప్పిన నిప్పులా మారింది. ఎప్పుడైనా మంటలు రేగవచ్చంటున్నారు. ఇంతకీ అనకాపల్లిలో అయ్యన్న ఏం చేశారు? చింతకాయల మంత్రాంగం తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడు, మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన చింతకాయల అయ్యన్నపాత్రుడు అనకాపల్లి జిల్లాలో వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదంగా మారుతోంది. ఒక వర్గానికి కొమ్ము కాస్తూ మరొక వర్గాన్ని తొక్కి పెట్టడంపై ఇతర నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తన అనుచరులుగా ముద్రపడిన వారికి వచ్చే ఎన్నికల్లో అనకాపల్లి జిల్లాలో సీట్లు ఇప్పించుకునే ప్రయత్నం చేస్తుండడంపై మిగిలిన నేతలు మండిపడుతున్నారు. ముఖ్యంగా జిల్లాలో కాపు వర్గం నేతలను తొక్కిపెట్టి తన వర్గం వారికి సీట్లు ఇప్పించుకునే ప్రయత్నం చేయడంపై టీడీపీలోని కాపు వర్గం నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. చోడవరం నియోజకవర్గంలో ఇన్చార్జిగా కాపు సామాజిక వర్గానికి చెందిన బత్తుల తాతయ్య బాబు కొనసాగుతున్నారు. చోడవరంలో బత్తుల తాతయ్య బాబు స్థానంలో తన శిష్యుడైన కేఎస్ఎన్ రాజుకు సీటు ఇప్పించాలని పార్టీ నాయకత్వం వద్ద పావులు కదుపుతున్నారని అయ్యన్నపై విరుచుకుపడుతున్నారు కాపువర్గం నాయకులు.. డబ్బులుంటేనే టికెట్ ఎలమంచిలి నియోజకవర్గ టిడిపి ఇన్చార్జిగా ఉన్న కాపు సామాజిక వర్గానికి చెందిన ప్రగడ నాగేశ్వరరావు ఆర్థిక పరిస్థితి బాగోలేదంటూ.. ఆయన స్థానంలో వేరొక వ్యక్తిని పోటీకి దించాలంటూ అయ్యన్నపాత్రుడు చంద్రబాబుకు సిఫార్సు చేశారు. అనకాపల్లి పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయడానికి చాలామంది కాపు నాయకులు ఉత్సాహం చూపిస్తున్నారు. గతంలో ఇక్కడి నుంచి కాపు వర్గం నేతలే పోటీ చేసి విజయం సాధించారు. అయితే ఎంపీ స్థానంలో కూడా కాపులు పోటీ చేయకుండా అడ్డుకోవాలని అయ్యన్నపాత్రుడు ప్రయత్నిస్తున్నారు. అనకాపల్లి ఎంపీ సీటులో తన కుమారుడిని పోటీ చేయించాలనే ఉద్దేశంతోనే అయ్యన్న ఇలా వ్యవహరిస్తున్నారని టీడీపీ కాపువర్గం నేతలు భావిస్తున్నారు. చదవండి: (టీ గ్లాస్లో తుఫాన్?.. ఉన్నదే గుప్పెడు మంది.. అందులో ముఠాలు) కలిసిన వాళ్లందరికీ హామీలు జిల్లాలోని మిగతా నియోజకవర్గాల్లో కూడా తన వర్గానికి చెందిన వారికే సీట్లు ఇప్పించడానికి అయ్యన్న పావులు కదుపుతున్నారు. చోడవరం సీటు కెఎస్ఎన్ రాజుకు, మాడుగుల సీటు గరివిరెడ్డి రామానాయుడుకు ఇప్పించే బాధ్యత తనదే అంటూ తిరుపతిలో అయ్యన్నపాత్రుడు వారిద్దరికీ మాట ఇచ్చినట్లు తెలుగుదేశం పార్టీలోనే విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఇక అనకాపల్లి ఎమ్మెల్యే సీటు కోసం మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ ప్రస్తుత అనకాపల్లి జిల్లా టిడిపి అధ్యక్షుడు బుద్ధా నాగ జగదీశ్వరరావు పోటీ పడుతున్నారు. వీరిద్దరిలో అయ్యన్నపాత్రుడు పీల గోవిందకు మద్దతునిస్తున్నారు. మన కుర్చీకింద తడి, పక్క కుర్చీ కోసం ప్లాన్ పెందుర్తి నుంచి మాజీ మంత్రి బండారు నారాయణమూర్తి పోటీ చేయాలని భావిస్తున్నారు. బండారుకు వ్యతిరేకంగా విశాఖ సౌత్ ఇన్చార్జిగా ఉన్న గండి బాబ్జిని పెందుర్తిలో పోటీ చేయించే ఆలోచన చేస్తున్నారు అయ్యన్నపాత్రుడు. తన నియోజకవర్గ పరిస్థితిని చక్క బెట్టుకోలేని అయ్యన్న జిల్లా అంతటా పెత్తనం చేయాలని భావిస్తుండటంతో ఆయా నియోజకవర్గాల్లోని నేతలు మండిపడుతున్నారు. ముందు తన నియోజకవర్గాన్ని చక్కదిద్దుకుంటే బాగుంటుందని సలహా ఇస్తున్నారు. ఇతరుల సలహాలు పాటిస్తే ఆయన అయ్యన్న ఎందుకవుతారనే సెటైర్లు వినిపిస్తున్నాయి. - పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
సిట్టింగ్‌లకు నో ఛాన్స్.. సుమారు 150 మందికి అవకాశం లేదు !
సాక్షి, న్యూఢిల్లీ : 2024 సార్వత్రిక ఎన్నికల కంటే ముందు, వచ్చే ఏడాది జరుగనున్న ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను కమలదళం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందులోభాగంగా క్షేత్రస్థాయి నుంచి తీసుకున్న అభిప్రాయాలు, నివేదికల ఆధారంగా అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులకు సీట్ల కేటాయింపు చేయాలని బీజేపీ అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలో రాష్ట్రంలో మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అసెంబ్లీ ఎన్నికలకు టిక్కెట్ల పంపిణీ కోసం ఒక ఫార్ములాను రూపొందించింది.. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం 2022 అసెంబ్లీ ఎన్నికల్లో పలువురు ఎమ్మెల్యేలతో సహా సుమారు 150 మంది అభ్యర్థులకు ఈసారి టికెట్ ఇవ్వకుండా ఉండేందుకు పార్టీ సిద్ధమవుతోంది. వీరిలో 2017 ఎన్నికల్లో గెలిచిన, ఓడిపోయిన అభ్యర్థులు ఉండనున్నారు. టార్గెట్ 350– క్షేత్రస్థాయిలో సర్వేలు.. వచ్చే ఏడాది జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో 50 శాతానికి పైగా ఓటు బ్యాంకుతో 403 స్థానాలున్న అసెంబ్లీలో కనీసం 350 సీట్లు గెలుచుకోవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు వడపోత ద్వారా దశలవారీగా అభ్యర్థుల ఎంపిక చేయాలని నిర్ణయించింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలోకి రావాలంటే ఎంతో కీలకమైన ఉత్తర్ప్రదేశ్పై తమ పట్టు నిలబెట్టుకోవడం వల్ల రాబోయే రెండు, మూడేళ్ళలో ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో తమ ప్రభావాన్ని కొనసాగించొచ్చని కమలదళం యోచిస్తోంది. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ అభ్యర్థుల ఎంపిక కోసం పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఒక సర్వే నిర్వహిస్తున్నారు. అంతేగాక కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం వివిధ ఏజెన్సీల ద్వారా సర్వేలు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జిల్లాల్లో పర్యటిస్తూ క్షేత్రస్థాయిలో అభిప్రాయాలను తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నారు. చదవండి: (బీజేపీని ముక్కలు–ముక్కలు చేస్తాను) వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వారికి గుడ్‌బై.. అంతేగాక పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, గత నాలుగున్నరేళ్ళుగా పార్టీ వ్యవహారాలు, ప్రభుత్వ కార్యకలాపాల్లో ఏమాత్రం చురుగ్గాలేని ఎమ్మెల్యేలకు మరోసారి అవకాశం ఇవ్వరాదని నిర్ణయించారు. అదే సమయంలో గత నాలుగున్నరేళ్ళలో తమ అనవసర, వివాదాస్పద ప్రకటనలు, వ్యాఖ్యలతో పార్టీని, ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే పరిస్థితి ఏర్పరిచిన ఎమ్మెల్యేలకు గుడ్ బై చెప్పాలని నిర్ణయించారు. వీరితో పాటు వయసురీత్యా 70 ఏళ్లు దాటిన, వివిధ రకాల తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న ఎమ్మెల్యేలకు సైతం టికెట్లు ఇవ్వరాదని పార్టీ అధిష్టానం ఒక ఫార్ములా రూపొందించింది. ముఖ్యంగా స్థానిక ప్రజలు, కార్యకర్తలు, పార్టీ కార్యవర్గ సభ్యులు కోపంగా ఉన్న ఎమ్మెల్యేలకు బదులుగా, పార్టీలో నిబద్ధతగా పనిచేస్తున్న ఇతర నాయకులు, కొత్తవారికి అవకాశం ఇవ్వడం వల్ల ఖచ్చితంగా పార్టీకి ప్రయోజనకరంగా ఉంటుందని అధిష్టానం భావిస్తోంది. దీంతోపాటు వివిధ రకాల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మె ల్యేలకు, 2017 అసెంబ్లీ ఎన్నికల్లో భారీ తేడాతో ఓడిపోయిన అభ్యర్థులకు మరోసారి అవకాశం ఇవ్వరాదని పార్టీ పెద్దలు విశ్వసిస్తున్నారు. చదవండి: (అన్న ఐపీఎస్, తమ్ముడు ఐఏఎస్) ఒక్కో సీటుకి ఇద్దరు లేదా ముగ్గురితో ప్యానెల్.. అంతేగాక అభ్యర్థుల ఎంపిక కోసం జిల్లా అధ్యక్షులు వారి పరిధిలోని సీట్లలో ఒక్కొక్క స్థానానికి మూడు పేర్ల చొప్పున ప్యానెల్‌ను, ప్రాంతీయ బృందాల నుంచి మరో మూడు పేర్ల ప్యానెల్‌ను తీసుకుంటారు. వీటిని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జ్ ధర్మేంద్ర ప్రధాన్, బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ రాధా మోహన్ సింగ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్, ఉప ముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ మౌర్య, డాక్టర్ దినేష్ శర్మ, పార్టీ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ కమిటీ ప్రాంతాలు, జిల్లాల నుంచి వచ్చిన ప్యానెల్లను పరిశీలించి మూడు పేర్లతో ఉన్న ఒక ప్యానెల్‌ను సిద్ధం చేస్తుంది. ఈ కమిటీ తరపున, ప్రతి అసెంబ్లీ స్థానానికి సంబంధించి ప్రాధాన్యత క్రమంలో రెండు నుంచి మూడు పేర్లతో ఉన్న ప్యానెల్‌ను తయారుచేసి పార్టీ పార్లమెంటరీ బోర్డుకు పంపిస్తారు. అయితే పార్టీ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆర్ఎస్ఎస్ అభిప్రాయం కూడా కీలకంగా మారనుంది. సంఘ్ సర్కార్యవాహ దత్తాత్రేయ హోసబలే, సహ సర్కార్యవాహ కృష్ణగోపాల్లు గత కొంతకాలంగా ఉత్తర్‌ప్రదేశ్‌లో పర్యటిస్తూ క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంతో పాటు, 2022 అసెంబ్లీ ఎన్నికలకు వ్యూహరచన చేస్తున్నారు. -
మాట తప్పని వైఎస్ జగన్
సాక్షి, పులివెందుల రూరల్ : రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 11వ తేదీ జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికశాతం ఎంపీ, ఎమ్మెల్యే సీట్లలలో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వడంతో బీసీలకు చెందిన నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ అన్ని వర్గాల వారికి సముచిత స్థానం కల్పించడంతో బీసీ నాయకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బీసీలకు ఇచ్చిన మాట నిలుపుకున్నారని వచ్చే ఎన్నికల్లో బీసీల సత్తా చూపించి ఆయనకు అండగా నిలుస్తామంటున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అయితేనే రాష్ట్రంలో బీసీల అభివృద్ధి సాధ్యమంటున్నారు. వైఎస్ జగన్‌తోనే బీసీలకు న్యాయం రాష్ట్రంలో బీసీలకు న్యాయం జరగాలంటే ఒక్క వైఎస్ జగన్‌తోనే సాధ్యం. వైఎస్సార్సీపీ అభ్యర్ధుల జాబితాలో ఎక్కువ బాగం బీసీలకు కేటాయించారు. రాష్ట్రంలో ఎక్కువ శాతం బీసీలు ఉండటంవల్ల వైఎస్ జగన్ ఎన్నికల అభ్యర్థుల విషయంలో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వడం హర్షణీయం. – బాబు, బీసీ సంఘం నాయకుడు, పులివెందుల అధిక శాతం సీట్లు బీసీలకే.. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అధిక శాతం ఎమ్మెల్యే, ఎంపీ సీట్లలలో బీసీలకు కేటాయించారు. పార్టీలో బీసీలకు సముచిత స్థానం కల్పించిన వైఎస్ జగన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. బీసీ వర్గాలకు న్యాయం జరగాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలి. – అంబకపల్లె నారాయణస్వామి, వాల్మీకీ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు బీసీలకు అగ్రస్థానం కల్పించారు రాష్ట్రంలో బీసీలకు న్యాయం జరగాలంటే వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావాలి. ఆయనతోనే బీసీలకు న్యాయం జరుగుతుంది. బీసీలపట్ల చిన్నచూపు చూస్తున్న టీడీపీ ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో ప్రజలే గుఠపాఠం చెబుతారు. సీట్ల కేటాయింపులో బీసీలకు అగ్రస్థానం కల్పించారు. – రసూల్, వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి, పులివెందుల అన్ని వర్గాలకు న్యాయం ఎమ్మెల్యే, ఎంపీ సీట్ల విషయంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్ని వర్గాల వారికి న్యాయం చేశారు. బీసీలు అన్ని విధాలా అభివృద్ధి చెందాలంటే జగన్‌తోనే సాధ్యం. సార్వత్రిక ఎన్నికల్లో సీట్ల కేటాయింపే అందుకు నిదర్శనం. అన్ని వర్గాలకు న్యాయం కల్పిచడం హర్షణీయం. ఎన్నికల్లో జగనన్నకు బీసీలంతా అండగా నిలుస్తాం. – బాషా, బీసీ యువజన సంఘ రాష్ట్ర నాయకుడు, పులివెందుల -
బీసీలకు మరో 10 నుంచి 12 సీట్లు: లక్ష్మణ్‌రావు
సాక్షి, హైదరాబాద్: కాం గ్రెస్ ఇప్పటివరకు ప్రక టించిన 75 స్థానాల్లో 15 చోట్ల బీసీలకు టికెట్లు ఇచ్చిందని, మరో 10 నుంచి 12 స్థానాల్లో బీసీ అభ్యర్థులకు టికెట్లు ఆశిస్తున్నామని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పల్లె లక్ష్మణ్‌రావు గౌడ్ తెలి పారు. బుధవారం గాంధీభవన్‌లో ఆయన మీడి యాతో మాట్లాడుతూ బీసీలకు కాంగ్రెస్ తప్ప కుండా న్యాయం చేస్తుందన్న నమ్మకం తనకుం దని చెప్పారు. 40 ఏళ్లుగా ఎన్ఎస్యూఐ, యూత్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీల్లో పనిచేస్తున్న తనకు సికింద్రాబాద్ అసెంబ్లీ టికెట్ వస్తుందని ఆయన ధీమా ఆయన వ్యక్తం చేశారు. -
బీసీలకు సీట్లివ్వకుంటే దాడులే: ఆర్.కృష్ణయ్య
హైదరాబాద్: బీసీలకు సీట్లు కేటాయించడంలో అన్ని రాజకీయ పార్టీలు మోసం చేస్తున్నాయని, జనాభా ప్రాతిపదికన 65 సీట్లు కేటాయించని పార్టీల ఆఫీసులపై దాడులు చేస్తామని బీసీ సంక్షేమ సంఘం నేత, మాజీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు. శనివారం ఇక్కడ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ గంగపుత్ర మహాసభ నిర్వహించిన రాజకీయ చైతన్య సదస్సులో ఆయన మాట్లాడారు. బీసీలంటే ఓట్లు వేసే యంత్రాలా... జెండాలు మోసే కార్యకర్తలా... అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రకటించిన 105 సీట్లలో 20 మంది, కాంగ్రెస్ కేటాయించిన 65 సీట్లలో 15 మంది బీసీలకు మాత్రమే సీట్లిచ్చారని విమర్శించారు. సమావేశంలో బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ముఠా గోపాల్, బీసీ కమిషన్ సభ్యుడు వకుళాభరణం కృష్ణమోహన్, ఎంబీసీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, నాయకులు గుజ్జ కృష్ణ, కొప్పు పద్మ, గడ్డ సాయి, మెట్టు సూర్యప్రకాశ్, డా.సజయ్ కాల్ నిస్సాల్, లెల్లెల బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
బిహార్‌లో టికెట్ల అమ్మకం.. బీజేపీ ఎంపీ ఫైర్
బిహార్ ఎన్నికలలో పార్టీ అనుసరిస్తున్న విధానంపై బీజేపీ ఎంపీ ఆర్కే సింగ్ తీవ్రంగా మండిపడ్డారు. టికెట్ల కేటాయింపునకు డబ్బులు తీసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. నేరగాళ్లకు టికెట్లు ఇస్తున్నారని ఆరోపించారు. అలాంటివాళ్లకు టికెట్లు ఇస్తుంటే లాలుకు, మీకు తేడా ఏంటని పార్టీ అధిష్ఠానాన్ని ప్రశ్నించారు. బీజేపీ బిహార్ శాఖ అధ్యక్షుడు సుశీల్ మోదీకి ఈ అంశంపై ఎన్నిసార్లు ఫోన్ చేసినా అసలు స్పందించడం లేదని అన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలలో మంచి పేరు ఉన్నవాళ్లకు కూడా టికెట్లు ఇవ్వడం లేదని ఆర్కే సింగ్ మండిపడ్డారు. ఈ విషయంలో పార్టీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, అందులో వింతేమీ లేదని కూడా ఆర్కే సింగ్ చెప్పారు.