బీసీలకు సీట్లివ్వకుంటే దాడులే: ఆర్‌.కృష్ణయ్య | R Krishnaiah Warns All Political Parties Over Tickets Allocation To BCs | Sakshi
Sakshi News home page

Published Sun, Sep 9 2018 4:09 AM | Last Updated on Sun, Sep 9 2018 4:09 AM

R Krishnaiah Warns All Political Parties Over Tickets Allocation To BCs - Sakshi

ఆర్‌.కృష్ణయ్య (ఫైల్‌ ఫొటో)

హైదరాబాద్‌: బీసీలకు సీట్లు కేటాయించడంలో అన్ని రాజకీయ పార్టీలు మోసం చేస్తున్నాయని, జనాభా ప్రాతిపదికన 65 సీట్లు కేటాయించని పార్టీల ఆఫీసులపై దాడులు చేస్తామని బీసీ సంక్షేమ సంఘం నేత, మాజీ ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణయ్య పిలుపునిచ్చారు. శనివారం ఇక్కడ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ గంగపుత్ర మహాసభ నిర్వహించిన రాజకీయ చైతన్య సదస్సులో ఆయన మాట్లాడారు. బీసీలంటే ఓట్లు వేసే యంత్రాలా... జెండాలు మోసే కార్యకర్తలా... అని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ ప్రకటించిన 105 సీట్లలో 20 మంది, కాంగ్రెస్‌ కేటాయించిన 65 సీట్లలో 15 మంది బీసీలకు మాత్రమే సీట్లిచ్చారని విమర్శించారు. సమావేశంలో బీసీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ముఠా గోపాల్, బీసీ కమిషన్‌ సభ్యుడు వకుళాభరణం కృష్ణమోహన్, ఎంబీసీ చైర్మన్‌ తాడూరి శ్రీనివాస్, నాయకులు గుజ్జ కృష్ణ, కొప్పు పద్మ, గడ్డ సాయి, మెట్టు సూర్యప్రకాశ్, డా.సజయ్‌ కాల్‌ నిస్సాల్, లెల్లెల బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement