క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిసిన ఆర్.కృష్ణయ్య
సాక్షి, అమరావతి: చరిత్రాత్మక బీసీ బిల్లును రాజ్య సభలో ప్రవేశపెట్టిన ఘనత సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికే దక్కుతుందని, అవినీతికి తావులేని, సమర్థవంతమైన, ప్రజారంజక పాలన అందిస్తున్న సీఎంగా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య కొనియాడారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని క్యాంప్ కార్యాలయంలో గురువారం కృష్ణయ్య మర్యాదపూర్వకంగా కలిశారు.
బీసీలకు సంబంధించిన పలు డిమాండ్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సింగా సీఎంకు విజ్ఞప్తి చేశారు. 56 బీసీ కులాలకు కార్పొరేషన్‌లు ఏర్పాటుచేయడం, కాంట్రాక్ట్‌లు, నామినేటెడ్ పోస్టుల్లో రిజర్వేషన్‌లు కల్పించడం వంటి చర్యలతో పేద వర్గాలకు దగ్గరయ్యారని అభినందించారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి బీసీల డిమాండ్లు నెరవేర్చేందుకు కృషిచేయాలని సీఎం వైఎస్ జగన్‌కు విజ్ఞప్తి చేసినట్టు ఆర్.కృష్ణయ్య వెల్లడించారు.
చదవండి: ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు
ఏపీ: కోవిడ్ నివారణ చర్యల కోసం యూనిసెఫ్ సాయం
Comments
Please login to add a commentAdd a comment