వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
సాక్షి, పులివెందుల రూరల్ : రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 11వ తేదీ జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికశాతం ఎంపీ, ఎమ్మెల్యే సీట్లలలో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వడంతో బీసీలకు చెందిన నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ అన్ని వర్గాల వారికి సముచిత స్థానం కల్పించడంతో బీసీ నాయకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బీసీలకు ఇచ్చిన మాట నిలుపుకున్నారని వచ్చే ఎన్నికల్లో బీసీల సత్తా చూపించి ఆయనకు అండగా నిలుస్తామంటున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అయితేనే రాష్ట్రంలో బీసీల అభివృద్ధి సాధ్యమంటున్నారు.
వైఎస్ జగన్‌తోనే బీసీలకు న్యాయం
రాష్ట్రంలో బీసీలకు న్యాయం జరగాలంటే ఒక్క వైఎస్ జగన్‌తోనే సాధ్యం. వైఎస్సార్‌సీపీ అభ్యర్ధుల జాబితాలో ఎక్కువ బాగం బీసీలకు కేటాయించారు. రాష్ట్రంలో ఎక్కువ శాతం బీసీలు ఉండటంవల్ల వైఎస్ జగన్ ఎన్నికల అభ్యర్థుల విషయంలో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వడం హర్షణీయం.
– బాబు, బీసీ సంఘం నాయకుడు, పులివెందుల
అధిక శాతం సీట్లు బీసీలకే..
వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధిక శాతం ఎమ్మెల్యే, ఎంపీ సీట్లలలో బీసీలకు కేటాయించారు. పార్టీలో బీసీలకు సముచిత స్థానం కల్పించిన వైఎస్ జగన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. బీసీ వర్గాలకు న్యాయం జరగాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలి.
– అంబకపల్లె నారాయణస్వామి, వాల్మీకీ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు
బీసీలకు అగ్రస్థానం కల్పించారు
రాష్ట్రంలో బీసీలకు న్యాయం జరగాలంటే వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలి. ఆయనతోనే బీసీలకు న్యాయం జరుగుతుంది. బీసీలపట్ల చిన్నచూపు చూస్తున్న టీడీపీ ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో ప్రజలే గుఠపాఠం చెబుతారు. సీట్ల కేటాయింపులో బీసీలకు అగ్రస్థానం కల్పించారు.
– రసూల్, వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి, పులివెందుల
అన్ని వర్గాలకు న్యాయం
ఎమ్మెల్యే, ఎంపీ సీట్ల విషయంలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్ని వర్గాల వారికి న్యాయం చేశారు. బీసీలు అన్ని విధాలా అభివృద్ధి చెందాలంటే జగన్‌తోనే సాధ్యం. సార్వత్రిక ఎన్నికల్లో సీట్ల కేటాయింపే అందుకు నిదర్శనం. అన్ని వర్గాలకు న్యాయం కల్పిచడం హర్షణీయం. ఎన్నికల్లో జగనన్నకు బీసీలంతా అండగా నిలుస్తాం.
– బాషా, బీసీ యువజన సంఘ రాష్ట్ర నాయకుడు, పులివెందుల
Comments
Please login to add a commentAdd a comment