దివంగత సీఎం వైఎస్సార్ తాత వైఎస్ వెంకటరెడ్డి నివాసం ఉన్న ఇంటిని సందర్శించి కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న వైఎస్ భారతిరెడ్డి
సాక్షి, పులివెందుల రూరల్/సింహద్రిపురం: రాష్ట్రాభివృద్ధి జరగాలంటే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని ఆయన సతీమణి వైఎస్ భారతిరెడ్డి పేర్కొన్నారు. సోమవారం సింహాద్రిపురం మండలంలోని బలపనూరు గ్రామంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సతీమణి వైఎస్ భారతిరెడ్డి, వైఎస్ అవినాష్‌రెడ్డి సతీమణి వైఎస్ సమతారెడ్డి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి బలపనూరులో నాయకులు ఘన స్వాగతం పలికారు. ప్రచారంలో భాగంగా వారు ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లను కలిసి వైఎస్సార్‌సీపీని అధికారంలోకి తేవాలని విజ్ఞప్తి చేశారు.
సార్వత్రిక ఎన్నికలలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్ అవినాష్‌రెడ్డిల ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.గ్రామంలో వృద్ధుల సమస్యలు తెలుసుకుంటూ వారిని ఆప్యాయంగా పలకరిస్తూ ముం దుకు సాగారు. రాజన్న ఆశయాలు నెరవేరాలంటే జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలన్నారు. చంద్రబాబు 2014 ఎన్నికల సమయంలో అబద్ధపు హామీలిచ్చి అధికారంలోకి రావడం జరిగిందన్నారు. అటువంటి వారికి ప్రజలే బుద్ధి చెప్పాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ సింహాద్రిపురం మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆప్యాయ పలకరింపు
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తాతఅయిన వైఎస్ వెంకటరెడ్డి నివాసం ఉన్న ఇంటిని సోమవారం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సతీమణి వైఎస్ భారతిరెడ్డి సందర్శించారు.ఇంటిలో ప్రతి ఒక్కరినీ ఆమె ఆప్యాయంగా పలకరించారు. ఆనాటి ఇళ్లు ఇప్పటికీ చెక్కు చెదరలేదని ఇంట్లో ఉన్న వారు ఆమెకు వివరించారు. వైఎస్ కుటుంబ సభ్యులు శ్వేత, పద్మజ, మంజుల పూర్వీకుల పేర్లను గుర్తుకు తెచ్చుకున్నారు. బలపనూరు గ్రామంలో చిన్నపిల్లలు ‘రావాలి జగన్ – కావాలి జగన్’అని పలకలో రాసి వైఎస్ భారతిరెడ్డికి చూపించారు. దీంతో చిన్నారిని ఆమె ముద్దాడారు.
Comments
Please login to add a commentAdd a comment