
సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేడు, రేపు వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఇందుకోసం మంగళవారం ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి 11.45 గంటలకు పులివెందుల చేరుకుంటారు. స్థానికంగా అందుబాటులో ఉంటారు.
బుధవారం ఉదయం 10 గంటలకు పులివెందులలోని గుంత బజార్ రోడ్డుకు చేరుకుంటారు. అక్కడ వైఎస్సార్ ఫౌండేషన్, ఎల్‌వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్ సంయుక్తంగా ఆధునీకరించిన ‘వైఎస్ రాజారెడ్డి ఐ సెంటర్’ను వైఎస్ జగన్ ప్రారంభిస్తారు.