పులివెందులలో కూరగాయలు విక్రయిస్తున్న మహిళకు నవరత్నాల గురించి వివరిస్తున్న వైఎస్ భారతిరెడ్డి
సాక్షి, పులివెందుల/వేంపల్లె : ప్రజా సంక్షేమమే వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యమని ఆయన సతీమణి వైఎస్ భారతిరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం పులివెందుల పట్టణంలోని 20, 21, 22 వార్డులైన మారుతిహాలు రోడ్డు, సుంకులమ్మ గుడి వీధి, బేతేలు చర్చి, బ్రాహ్మణపల్లె రోడ్డు ప్రాంతాల్లో పులివెందుల మున్సిపల్ చైర్ పర్సన్ వైఎస్ ప్రమీలమ్మ, వైఎస్సార్‌సీపీ నేత వైఎస్ మనోహర్‌రెడ్డిలతో కలిసి ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం వేంపల్లె పట్టణంలోని శ్రీరామ్‌నగర్, పుల్లయ్యతోట, రాజాతోట, కాలేజీ రోడ్డు తదితర ప్రాంతాలలో వైఎస్ భారతిరెడ్డి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె ఇంటింటికి వెళ్లి నవరత్న పథకాలను వివరిస్తూ పులివెందుల అసెంబ్లీ అభ్యర్థి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి, కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్‌రెడ్డి ఫ్యాన్ గుర్తుకు రెండు ఓట్లు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ఐదేళ్లలో టీడీపీ ప్రభుత్వం అమలుకాని హామీలతో ప్రజలను వంచించిన తీరును ఓటర్లకు వివరించారు.
దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి తరహాలో పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందాలంటే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికే సాధ్యమన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చెర్మెన్ చిన్నప్ప, పట్టణ కన్వీనర్ వర ప్రసాద్, బూత్ కమిటీ మేనేజర్ గంగాదర్‌రెడ్డి, ఇస్మాయిల్, అరుణ, హేమలత, రజియా, రమాదేవి, వీరారెడ్డి, పద్మనాభరెడ్డి, లక్ష్మినారాయణ, రాజేష్‌నాయుడు, కనక, బాల అశ్వర్థరెడ్డి, చంద్రమౌళి, సంపత్, ప్రసాద్, చలపతి, జగదీష్, కుళ్లాయప్ప, మాబ్‌జాన్‌లతోపాటు వేంపల్లె వైఎస్సార్‌సీపీ నాయకులు, ఎంపీపీ రవికుమార్‌రెడ్డి, కన్వీనర్ చంద్ర ఓబుళరెడ్డి, జెడ్పీటీసీ షబ్బీర్‌వల్లి, మైనార్టీ కన్వీనర్ మునీర్, బూత్ కమిటీ మేనేజర్ ఆర్.శ్రీను, నాయకులు బ్రహ్మయ్య, కిట్టయ్య, మాజీ ఎంపీపీ కొండయ్య, అంజి, బ్రహ్మకుమార్, రాజ్‌కుమార్, మహిళా నాయకురాలు భారతి, ఝాన్సీ, సల్మా తదితర నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment