ఆర్‌సీ కుంతియా (ఫైల్ ఫోటో)
సాక్షి, హైదరాబాద్: నాలుగేళ్ల మోదీ పాలనలో ఎస్సీ, ఎస్టీలకు భద్రత లేకుండా పోయిందని పీసీసీ ఇన్‌చార్జ్ ఆర్‌సీ కుంతియా ఆరోపించారు. మోదీ వైఫల్యాలపై శనివారం మీడియాతో మాట్లాడుతూ... ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. జీఎస్‌టీ, నోట్ల రద్దు వంటి నిర్ణయాలతో ఉన్న ఉద్యోగాలు పోయ్యాయని విమర్శించారు. బీజేపీ పాలనలో విద్యావిధానం పూర్తిగా కార్పొరేటికరణ అయిందన్నారు.
విదేశాల్లో దాగిఉన్న నల్లధనం తీసుకువచ్చి జన్‌ధన్ ఖాతాలో ఒక్కొక్కరికి పదిహేను లక్షలు వేస్తామని చెప్పిన మోదీ నల్లధనాన్ని ఎందుకు తీసుకురాలేకపోయారని ప్రశ్నించారు. పెట్రొల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగాయని, ముడిచమురు చారెల్ ధర తక్కువగా ఉన్నా కూడా ప్రజల మీద భారం పెంచుతున్నారని ధ్వజమెత్తారు. బీజేపీ పాలనలో ప్రజలకు భద్రత కరువైందన్నారు. సర్జికల్ స్ట్రైక్స్ చేస్తే దేశ భద్రతా బలగాల, పౌరుల ప్రాణాలు ఎందుకు పోతున్నాయని బీజేపీ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు.
Comments
Please login to add a commentAdd a comment