సాక్షి, అమరావతి: నెల రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలన్నింటినీ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. హైకోర్టు కూడా ఇదే విషయం చెప్పిందని, స్థానిక సంస్థల ఎన్నికలు 14వ ఆర్థిక సంఘం నిధులతో ముడిపడి ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నిధులు రావాలంటే ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికలన్నీ పూర్తి కావాల్సిందేనని స్పష్టం చేశారు. మంగళవారం ఆయన ‘స్పందన’పై సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ నెలాఖరులోగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు పూర్తి చేయడానికి వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు బుధవారం అధికారులు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కలుస్తారని, అనంతరం ఎన్నికల తేదీలు ఖరారవుతాయని చెప్పారు. ఈ సమీక్షలో సీఎం ఇంకా ఏమన్నారంటే..
నిబంధనలు ఉల్లంఘిస్తే జైలుకే
‘పంచాయతీ రాజ్ చట్టంలో సవరణలు చేస్తూ విప్లవాత్మక మార్పుల కోసం ఆర్డినెన్స్ తెచ్చాం. అవినీతిని నిర్మూలించడంతో పాటు మద్యం, డబ్బుల పంపిణీని ఎన్నికల వ్యవస్థ నుంచి పూర్తిగా, శాశ్వతంగా తీసేయాలనే దృఢ సంకల్పంతోనే ఆర్డినెన్స్ తీసుకువచ్చాం. ఈ ఆర్డినెన్స్‌ను పూర్తి స్థాయిలో అమలు చేయడానికి ప్రతి పోలీసు అధికారి చిత్తశుద్ధితో పని చేయాలి. డబ్బులు పంచినట్లు ఎన్నికల తర్వాత నిర్ధారణ అయినా, బాధ్యులపై అనర్హత వేటు పడుతుంది. మూడేళ్ల పాటు జైలుకు పంపుతాం. ఎక్కడా కూడా డబ్బులు, మద్యం పంపిణీ ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకూడదనేది చాలా ప్రాధాన్యమైన అంశం. ఒక్క గ్రామంలో కూడా డబ్బులు, మద్యం పంపిణీ చేసి.. ఎన్నికలు నిర్వహించారనే మాట వినిపించ కూడదు. ఈ రెండు అంశాలపై పోలీసు యంత్రాంగం చాలా దృఢంగా పని చేయాలి. దీన్ని చాలెంజ్‌గా తీసుకోవాలి.
ఎస్పీలు కీలకంగా వ్యవహరించాలి
ఎవరో రియల్ ఎస్టేట్ వ్యాపారి వచ్చి రూ.కోట్లు వెదజల్లి ఎన్నికల్లో గెలవడం కాదు.. ఊరిలో ప్రజలందరికీ అందుబాటులో ఉండి, వారికి సేవ చేసే మంచి వ్యక్తులు గెలిచే అవకాశం సృష్టించడానికే ఈ ఆర్డినెన్స్ తీసుకు వచ్చాం. ఈ మార్పులు కనిపించే విధంగా ఎస్పీలందరూ పని చేయాలి. డబ్బులు, మద్యాన్ని అరికట్టడంలో ఎస్పీలు కీలకంగా వ్యవహరించాలి. ప్రతి గ్రామంలో ఉన్న పోలీస్ మిత్రలను, గ్రామ సచివాలయాల్లోని మహిళా పోలీసులను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి’ అని సీఎం వైఎస్ జగన్ అన్నారు.
ఇలా చేద్దాం..
– మన రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ దేశానికి ఆదర్శం కావాలి.
– సాధారణ ఎన్నికల్లో అక్రమాలు, ఉల్లంఘనల నిరోధానికి యాప్ ఉపయోగించిన తరహాలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా ఒక యాప్ అందుబాటులో ఉంచాలి.
– గ్రామాల్లో ఉండే పోలీసు మిత్రలు, గ్రామ సచివాలయంలో ఉండే మహిళా పోలీసులు, గ్రామ వలంటీర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగుల వద్ద, ప్రజల వద్ద ఈ యాప్ ఉండాలి.
– ఎక్కడ ఏం జరిగినా వెంటనే ఈ యాప్‌లో నమోదు కావాలి.
– ఎన్నికల అధికారులు, పోలీసు అధికారులకు ఈ యాప్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం చేరాలి.
– ఎవరైనా తప్పులు చేస్తే అనర్హత వేటు వేయడంతో పాటు జైలుకు పంపాలి.
– ఈ అంశాలతో ప్రభుత్వం రూపొందించిన ఆర్డినెన్స్ ప్రతిని గ్రామ సచివాలయాలన్నింటిలో ప్రదర్శించాలి.
ఇలా చేద్దాం..
అధికారులతో సీఎం
- మన రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ దేశానికి ఆదర్శం కావాలి.
- సాధారణ ఎన్నికల్లో అక్రమాలు, ఉల్లంఘనల నిరోధానికి యాప్ ఉపయోగించిన తరహాలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా ఒక యాప్ అందుబాటులో ఉంచాలి.
- గ్రామాల్లో ఉండే పోలీసు మిత్రలు, గ్రామ సచివాలయంలో ఉండే మహిళా పోలీసులు, గ్రామ వలంటీర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగుల వద్ద, ప్రజల వద్ద ఈ యాప్ ఉండాలి.
- ఎక్కడ ఏం జరిగినా వెంటనే ఈ యాప్‌లో నమోదు కావాలి.
- ఎన్నికల అధికారులు, పోలీసు అధికారులకు ఈ యాప్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం చేరాలి.
- ఎవరైనా తప్పులు చేస్తే అనర్హత వేటు వేయడంతో పాటు జైలుకు పంపాలి.
- ఈ అంశాలతో ప్రభుత్వం రూపొందించిన ఆర్డినెన్స్ ప్రతిని గ్రామ సచివాలయాలన్నింటిలో ప్రదర్శించాలి.
Comments
Please login to add a commentAdd a comment