
జైపూర్ : రాజస్ధాన్‌లో పాలక కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికల్లో జయభేరి మోగించింది. సార్వత్రిక ఎన్నికల్లో కాషాయ పార్టీ ప్రభంజనం సృష్టించినా స్ధానిక పోరులో కాషాయ పార్టీకి కాంగ్రెస్ గట్టి షాక్ ఇచ్చింది. 17 మున్సిపల్ కౌన్సిల్స్‌కు గాను 11 కౌన్సిల్స్‌లో కాంగ్రెస్ విజయం సాధించింది. బీజేపీ మూడు కౌన్సిల్స్‌కే పరిమితం కాగా మిగిలిన మూడు మున్సిపల్ కౌన్సిల్స్‌లో ఇండిపెండెంట్లు విజయం సాధించారు. ఇక 29 మున్సిపాలిటీలకు గాను కాంగ్రెస్ పార్టీ 15, బీజేపీ ఆరింటిని దక్కించుకోగా మిగిలిన మున్సిపాలిటీల్లో ఇండిపెండెంట్లు విజయం సాధించారు. తమ ప్రభుత్వ సామర్ధ్యాన్ని మెచ్చిన ప్రజలు తమకు స్ధానిక ఎన్నికల్లో పట్టం కట్టారని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ వ్యాఖ్యానించారు. రాజస్ధాన్ స్ధానిక పోరులో కాంగ్రెస్ పార్టీ మూడింట రెండు స్ధానాలను గెలుచుకుందని ఆ పార్టీ నేత, రాష్ట్ర మంత్రి ప్రతాప్ సింగ్ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment