మున్సిపల్‌ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలి | Nimmagadda Ramesh Mandate to officers on Municipal Elections conduct | Sakshi
Sakshi News home page

మున్సిపల్‌ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలి

Feb 28 2021 4:07 AM | Updated on Feb 28 2021 4:07 AM

Nimmagadda Ramesh Mandate to officers on Municipal Elections conduct - Sakshi

అధికారులతో సమీక్షిస్తున్న నిమ్మగడ్డ రమేష్‌

యూనివర్సిటీ క్యాంపస్‌ (తిరుపతి): రాష్ట్రవ్యాప్తంగా మార్చిలో నిర్వహించే మున్సిపల్‌ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. తిరుపతి శ్రీ వేంకటేశ్వర వర్సిటీలో శనివారం రాత్రి మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణపై రాయలసీమ, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, మున్సిపల్‌ అధికారులతో నిమ్మగడ్డ సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికలు చక్కగా జరిగాయన్నారు. ఇదే స్ఫూర్తితో మున్సిపల్‌ ఎన్నికలను నిర్వహించాలన్నారు. ప్రతి ఓటరుకు ఓటింగ్‌ స్లిప్‌ చేరాలని చెప్పారు.

ఈ ప్రక్రియలో వలంటీర్లను దూరంగా ఉంచడంతో పాటు వారిపై నిఘా ఉంచాలన్నారు. ప్రతి మున్సిపాలిటీలో హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేసి ఓటరుకు తమ ఓటు, పోలింగ్‌స్టేషన్‌ వివరాలు అందించాలని ఆదేశించారు. పార్టీ ప్రాతిపదికన మున్సిపల్‌ ఎన్నికలు జరుగుతున్నందున పకడ్బందీగా ఎన్నికల నియమావళిని అమలు చేయాలన్నారు. కోవిడ్‌ నేపథ్యంలో ఇంటింటి ప్రచారానికి ఐదుగురికే అనుమతి ఇస్తున్నామన్నారు. దీనిని ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఎవరైనా మద్యం, డబ్బు పంపిణీ ద్వారా ప్రలోభాలకు గురి చేస్తే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. గతేడాది మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా ఒత్తిడికి, ప్రలోభాలకు లోనై నామినేషన్లు విత్‌ డ్రా చేసుకున్న వారు స్వచ్ఛందంగా ముందుకొచ్చి అభ్యర్థిస్తే సానుకూలంగా స్పందిస్తామన్నారు. మార్చి 1న రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహిస్తామని చెప్పారు.

స్థానికంలోనూ ఈసీ నిబంధనలే..
సాక్షి, అమరావతి: ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం తీసుకొచ్చిన నిబంధనలను.. రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తక్షణమే అమలులోకి తీసుకొస్తున్నట్టు నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ శనివారం తెలిపారు. మున్సిపల్‌ ఎన్నికలను స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులతో పాటు కలెక్టర్లు, ఎన్నికల నిర్వహణాధికారులు ఈ నిబంధనలను అమలు చేయాలని ఆదేశించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement