
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు కారణాలపై ప్రభుత్వం తుది అఫిడవిట్‌ను హైకోర్టులో శుక్రవారం సమర్పించింది. ఇప్పటికే ప్రభుత్వం ప్రిలిమినరీ కౌంటర్‌ను దాఖలు చేసిన విషయం తెలిసిందే. కాగా, అఫిడవిట్‌లో ఏపీ ప్రభుత్వం కీలక అంశాలు పేర్కొంది. రాష్ట్రంలో ఎన్నికల సంఘ సంస్కరణల్లో భాగంగా కొత్త కమిషర్‌ను నియమించామని తెలిపింది. రిటైర్డ్ జడ్జిని ఎస్‌ఈసీగా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించింది. ఈ మేరకు ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చిందని గుర్తు చేసింది.
(నిమ్మగడ్డ లేఖ విషయంలో సంచలన నిజాలు)
మిగిలిన రాష్ట్రాల్లో ఎస్‌ఈసీల కాలపరిమితి వివరాలను కూడా ప్రభుత్వం అఫిడవిట్‌లో పేర్కొంది. 2014లో రాష్ట్రవ్యాప్తంగా 221 హింసాత్మక ఘటనలు జరగ్గా.. 2020లో 88 ఘటనలు జరిగినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇక ఎస్‌ఈసీగా బాధ్యాయుత పదవిలో ఉన్న రమేష్‌కుమార్ ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేశారని ప్రభుత్వం తెలిపింది. పోలీసులు, పరిపాలనా యంత్రాంగంపై నిమ్మగడ్డ ఆరోపణలు అవాస్తవమని చెప్పింది. తనను కావాలనే ఎస్‌ఈసీ పదవి నుంచి తప్పించారని.. నిమ్మగడ్డ రమేష్‌కుమార్ వేసిన పిటిషన్ అవాస్తవమని ప్రభుత్వం అఫిడవిట్‌లో పేర్కొంది.
(రమేష్ కుమార్ పిటిషన్‌పై కీలక వాదనలు)
Comments
Please login to add a commentAdd a comment