![AP High Court Clears Line For Panchayat Elections - Sakshi](/styles/webp/s3/article_images/2021/01/21/ap-high-court.jpg.webp?itok=qwkhq2_y)
సాక్షి, అమరావతి : స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ వేసిన రిట్ పిటిషన్‌ను హైకోర్టు అనుమతించింది. ఇబ్బంది లేకుండా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని గురువారం హైకోర్టు ఆదేశించింది. అయితే హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది.
కాగా, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఈ నెల 8వ తేదీన పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించగా.. 11వ తేదీన ఎస్ఈసీ ఆదేశాలను హైకోర్టు సింగిల్ జడ్జి కొట్టేశారు. ఎన్నికల కమిషన్ ఆచరణ సాధ్యం కాని నిర్ణయం తీసుకుందని ఆక్షేపించారు. ఈ ఎన్నికల షెడ్యూల్ రాజ్యాంగంలోని అధికరణలు 14, 21లకు విరుద్ధమని తేల్చి చెప్పారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణ నిమిత్తం ఎన్నికల కమిషన్ జారీ చేసిన నోటిఫికేషన్, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కరోనా వ్యాక్సినేషన్ బృహత్కార్యానికి విఘాతం కలిగిస్తుందని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment