
సాక్షి, అమరావతి: మండల, జిల్లా పరిషత్‌ల ఎన్నికల కోసం గత ఏడాది మార్చి నాటికి తయారుచేసిన ఓటర్ల జాబితా ప్రకారమే గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ శుక్రవారం జారీచేసిన ఉత్తర్వుల్లో తెలిపారు. 2019 జనవరి 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన వారితో అప్పట్లో ఓటర్ల జాబితాలు తయారు చేశారని, 2020 మార్చి 7వ తేదీ నాటికి వాటిని అప్‌డేట్ చేశారని తెలిపారు.