సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైద్యులు తప్పనిసరిగా పీపీఈ కిట్లు వాడాలని రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి సూచించారు. రాజంపేటలో కరోనా వైరస్ నియంత్రణ చర్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా వైరస్ టెస్ట్ చేసే వైద్యులందరూ తప్పకుండా ఎన్-95 మాస్కులనే వాడాలన్నారు. రాజంపేట, రాయచోటి మున్సిపాలిటీ కేంద్రాల్లో టన్నెల్ స్ప్రే ట్యాంకులు ఏర్పాటు చేయాలని ఆర్డీవోలకు ఎంపీ సూచించారు. నష్టపోయిన అరటి, బొప్పాయి రైతులకు పరిహారం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వం ముందు చూపుతో ఉంది కాబట్టే..
కరోనా వైరస్ నివారణకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. కరోనా వైరస్‌కు ఎలాంటి మందులు లేవని.. సామాజిక దూరం, లాక్‌డౌన్ మాత్రమే మార్గమని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్‌పై ముందుచూపుతో ఉంది కాబట్టే.. కరోనా వ్యాప్తి రేటు గణనీయంగా తగ్గిందని శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment