
సాక్షి, అమరావతి : నూతన ఎమ్మెల్సీగా ఎన్నికైన జకియా ఖానం సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. సామాన్య కుటుంబానికి చెందిన ఆమెను ఎమ్మెల్సీగా ఎంపిక చేసినందుకు సీఎం జగన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జగన్ అన్న ఇచ్చిన ఈ అవకాశాన్ని రాయచోటి అభివృద్ధికి కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు. మైనారిటీలకు ఇంత ప్రాధాన్యం ఇవ్వడం కేవలం వైఎస్ జగన్‌కే సాధ్యమవుతుందని కొనియాడారు. మహిళా సమస్యలపై పోరాటం చేసి పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలిపారు. అలాగే తనకు ఈ పదవి రావడానికి కృషి చేసిన ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డిలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. (రమేష్ హాస్పిటల్ నిర్లక్ష్యం వలనే...)
గవర్నర్ కోటాలో రాయచోటి ఎమ్మెల్సీ స్థానం నుంచి జకియా ఖానం నియమితులైన విషయం తెలిసిందే. ఈమె ఆరేళ్ల పాటు ఎమ్మెల్సీగా కొనసాగనున్నారు. కాగా సీఎం జగన్ ఆశీస్సులతో ఒక మైనారిటీ మహిళకు ఎమ్మెల్సీ ఇవ్వడం ఆనందంగా ఉందని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. మహిళల సమస్యలపై ఆమె స్పందించనుందని తెలిపారు. ముఖ్యమంత్రి ఇచ్చిన మాటను ఎప్పుడూ తప్పరని పునరుద్ఘాంటించారు. (సమగ్ర అభివృద్ధికి ‘వైఎస్సార్ ఏపీ వన్’: గౌతమ్‌రెడ్డి)
Comments
Please login to add a commentAdd a comment