
రాయచోటి: నమ్మి వెంట నడిచిన వారిని నిండా ముంచడమే ప్రతిపక్ష నేత చంద్రబాబు నైజమని ప్రభుత్వ చీఫ్‌విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. అమరావతిపై ప్రేమ ఉంటే 23 మంది టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ప్రజా క్షేత్రంలోకి రావాలని సవాల్ విసిరారు. శుక్రవారం వైఎస్సార్ జిల్లా రాయచోటిలో ఆయన మీడియాతో మాట్లాడారు.
► కుట్ర రాజకీయాలు చేయడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య.
► ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని ఛిన్నాభిన్నం చేశారు.
► మేము అభివృద్ధి చేస్తుంటే అడ్డంకులు కల్పిస్తూ రాక్షసానందం పొందుతున్నారు.
► అమరావతి పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్న చంద్రబాబు ప్రజల మనసుల్లో శాశ్వతంగా తొలగిపోయారు.
► ఇది వైశ్రాయ్, ఈనాడు యుగం కాదు.. సోషల్ మీడియా యుగం.
► తోక పత్రికలు, టీవీలు ఏమి రాసినా, చూపించినా నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు.
Comments
Please login to add a commentAdd a comment