రాయచోటి: రామాపురం మండలంలోని సుద్దమళ్ల గ్రామం నుంచి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఎమ్మెల్యేలుగా గెలుపొందడం విశేషం. వీరిలో నాలుగో వ్యక్తి గడికోట శ్రీకాంత్‌రెడ్డి నాలుగు పర్యాయాలు వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రస్తుతం ప్రభుత్వ చీఫ్‌విప్‌గా బాధ్యతలను నిర్వర్తిస్తుండడం మరో విశేషం. సుద్దమళ్ల గ్రామానికి చెందిన గడికోట రామసుబ్బారెడ్డి (1978–1983) వరకు లక్కిరెడ్డిపల్లె ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన అనంతరం తనయుడు గడికోట ద్వారకనాథరెడ్డి (1994– 1999) వరకు ఎమ్మెల్యేగా కొనసాగారు. తర్వాత దాయాది మోహన్‌రెడ్డి (2004–09) లక్కిరెడ్డిపల్లెకు ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించారు.
మోహన్‌రెడ్డి (1971 నుంచి 1981) రెండు పర్యాయాలు సుద్దమల్ల గ్రామం సర్పంచ్‌గా,1981–86 వరకు లక్కిరెడ్డిపల్లె సమితి ప్రెసిడెంటుగా పనిచేశారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో లక్కిరెడ్డిపల్లెను రాయచోటిలో విలీనం చేయడంతో గడికోట మోహన్‌రెడ్డి తనయుడు గడికోట శ్రీకాంత్‌రెడ్డి 2009లో రాయచోటి స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యరి్థగా పోటీ చేసి గెలుపొందారు. 2012లో వైఎస్సార్‌సీపీ తరఫున ఉప ఎన్నికలోనూ, 2014, 2019లో జరిగిన సాధారణ ఎన్నికల్లో వరుసగా శ్రీకాంత్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో రాయచోటి రాజకీయ చరిత్రలో ఓ సుస్థిర స్థానాన్ని పొందారు.
Comments
Please login to add a commentAdd a comment