‘ప్రతిపక్ష నేత లేక పనికిమాలిన వాడివా’ | Gadikota Srikanth Reddy Slams On Chandrababu At Amaravati | Sakshi
Sakshi News home page

‘ప్రతిపక్ష నేత లేక పనికిమాలిన వాడివా’

Published Thu, Apr 23 2020 12:31 PM | Last Updated on Thu, Apr 23 2020 2:20 PM

Gadikota Srikanth Reddy Slams On Chandrababu At Amaravati - Sakshi

సాక్షి, అమరావతి: హైదరాబాద్‌లో కూర్చుని చంద్రబాబు, లోకేష్‌ ఆటలు ఆడుకుంటూ రాజకీయాలు చేస్తున్నారని రాష్ట్ర చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. భజనపరులతో కాలక్షేపానికి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్నారని, వాటిని చూసిన ప్రజలు నవ్వుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. శ్రీకాంత్‌రెడ్డి గురువారం మీడియాతో మాట్లాడుతూ.. కన్నా ట్వీట్‌కు వివరణగా సంబంధిత మంత్రి వివరణ ఇచ్చినా అనవసరపు రాద్ధాంతం చేశారని దుయ్యబట్టారు. చంద్రబాబు హయాంలో ప్రతిపనిలో రూ. వేల కోట్ల అవినీతికి జరిగిందన్నారు. నాలుగు రోజుల పాటు కన్నా లక్ష్మీనారాయణ, ఎల్లో మీడియా బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. (హాఫీజ్‌ ఖాన్‌పై దుష్ప్రచారం.. అసలు వాస్తవం ఇది)

లోకేష్ లాక్‌డౌన్ ఉల్లంఘనలకు పాల్పడుతూ మాస్కులు లేకుండా తిరుగుతుంటే ఎల్లో మీడియా ఏం చేస్తోందని శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నించారు. కన్నా లక్ష్మీనారాయణ చెబితే టీడీపీ నేతలు మొరుగుతారని, రాష్ట్రంలో అనేకమంది పేదప్రజలు, వలసకూలీలు ఇబ్బందులు పడుతుంతే వారి సమస్యలు పట్టవా అని విరుచుకుపడ్డారు. చంద్రబాబు ప్రతిపక్ష నేత లేక పనికిమాలిన వాడా అని ప్రశ్నించారు. ఎల్లో మీడియా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అనే రాస్తున్నాయి తప్ప రాష్ట్ర ప్రభుత్వం అని ఎందుకు రాయడం లేదని ఆయన తీవ్రంగా ప్రశ్నించారు.

ఇంగ్లీషు మీడియంపై కోర్టులో పిల్ వేసిన వారి పిల్లలు ఏ మీడియంలో చదువుతున్నారో తెలపాలన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో ప్రతి మండలంలో తెలుగు మీడియం ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎవరైతే మాట్లాడుతున్నారో వారి పిల్లలని ఎంత మందిని చేర్పిస్తారో చూస్తామన్నారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను చూసి ఓర్వలేక అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రతి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రెడ్జోన్‌లో సైతం తిరుగుతూ ప్రజలకు మంచి చేస్తుంటే టీడీపీ నేతలు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. వైఎస్సార్‌సీపీ నేతలు ఎక్కడా లాక్ డౌన్ ఉల్లంఘించడం లేదని తెలిపారు. టీడీపీ వాళ్లు కులాలు, మతాలు మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఫైర్‌ అయ్యారు. (‘విపత్తుల్లో రాజకీయ లబ్ది ఆశించడం బాబుకే చెల్లుద్ది’)

రాష్ట్రంలో ఎక్కడైనా ప్రజలకు టీడీపీ నేతలు సహాయం చేస్తున్నారా అని ప్రశ్నించారు. ఎందుకు చంద్రబాబు ఏపీకి రాష్ట్రానికి రాలేక పోతున్నారని, దమ్ముంటే రాష్ట్రానికి రావాలన్నారు. ప్రభుత్వానికి మంచి సలహాలు ఇవ్వాలని హతవు పలికారు.  ఒకే నెలలో మూడు సార్లు రేషన్ ఇచ్చిన రాష్ట్రం ఏదైనా ఉందా? రాష్ట్ర ప్రభుత్వానికి పాజిటీవ్ కేసులు దాచి పెట్టాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.  వైద్యులపై దాడులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ను రాష్ట్ర ప్రభుత్వం స్వాగతిస్తుందని చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement