తప్పు చేసినవారే తప్పించుకునే యత్నం.. | TDP Unnecessarily Making an issue, says Chief Whip Srikanth Reddy | Sakshi
Sakshi News home page

టీడీపీ అనవసరంగా రాద్దాంతం చేస్తోంది..

Published Sat, Jun 13 2020 6:38 PM | Last Updated on Sat, Jun 13 2020 7:26 PM

TDP Unnecessarily Making an issue, says Chief Whip Srikanth Reddy - Sakshi

సాక్షి, తాడేపల్లి: అవినీతిపై తమ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి స్పష్టం చేశారు. అక్రమాలను వెలికి తీస్తుంటే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఎందుకు భయపడుతున్నారని సూటిగా ప్రశ్నించారు. శనివారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ‘ప్రజల సొమ్ముకు కాపలాదారుడుగా ఉంటానని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. ప్రజల సొమ్మును దోచుకున్న వారిని ఉపేక్షించేది లేదు. పోలవరం ప్రాజెక్టులో రివర్స్ టెండరింగ్ ద్వారా 2,200 కోట్లు ఆదా చేశారు.  (అచ్చెన్న.. ఖైదీ నెంబర్ 1573)

వెలిగొండ, సోమశిల ప్రాజెక్టులలో సైతం రివర్స్ టెండరింగ్ ద్వారా సత్ఫాలితాలు వచ్చాయి. రూ.100 కోట్లు దాటిన టెండర్లను జ్యూడీషియల్‌ వ్యవస్థ కిందకు తీసుకువచ్చాం. అవినీతి తోడుతుంటే అంత భయమెందుకు, కులం కార్డు వాడి తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారు. రూ.150 కోట్ల అవినీతిపై చంద్రబాబు హయాంలోని మంత్రే సంతకం పెట్టారు. ఈఎస్‌ఐ స్కాంలో తప్పు చేసినవారే తప్పించుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. మంత్రి హోదాలో ఒక కంపెనీకి కాంట్రాక్ట్‌లు ఇవ్వాలని అచ్చెన్నాయుడు సిఫార్సు చేశారు. 

ట్రావెల్స్ పేరుతో స్క్రాప్ వాహనాలతో 2017లో 45 మంది ప్రాణాలు గాలిలో కలిపేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఇతర రాష్టాల్లో అక్రమ రిజిస్ట్రేషన్లు చేసి లారీలను బస్సులుగా మార్చారు. అవినీతి కులం అధికారం ఉంటుందా....?. అధికారంలో  ఉంటే పంది కొక్కుల్లా దోచేయవచ్చా...?. చంద్రబాబు హయంలో జరిగిన అవినీతి అక్రమాలు అంతులేనివి. అవినీతి జరిగిందని నిరూపిస్తే ఎదురుదాడి చేస్తున్నారు. నిప్పు తుప్పు అని చెప్పే మాటలు ఇప్పుడు ఏమయ్యాయి. కార్మికులు సొమ్ము పందికొక్కులులా తిన్నారు.

చంద్రబాబు ఐదేళ్ల పాలనలో అవినీతి చేసింది మీరా మేమా....?. 23 మంది ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసింది ఎవరు?. చంద్రబాబు ఇప్పుడు ప్రలోభాల గురించి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది. ప్రజాస్వామ్య విలువలు కాపాడటమే మా ప్రభుత్వ లక్ష్యం. వ్యక్తులపై కాదు.. దోపిడీ, అవినీతిపై మాది కక్షసాధింపు. మీ పాలనలో 6లక్షల కోట్లు అవినీతి మయం చేశారు. ఎలుక, దోమల పేరుతో కూడా దోపిడీకి పాల్పడ్డారు. ట్రావెల్స్‌ పేరుతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వ్యక్తులను అరెస్ట్‌ చేస్తే తెలుగుదేశం పార్టీ అనవసరంగా రాద్ధాంతం చేస్తోంది. అవినీతిపరులను అరెస్ట్ చేయొద్దని చంద్రబాబు చెప్పదలచుకున్నారా?. వారిపై చర్యలు తీసుకుంటుంటే బాబు కులప్రస్తావన తెస్తున్నారు. తన వంతు, తన కొడుకు వంతు వస్తుందని బాబుకు భయం పట్టుకుంది’ అని వ్యాఖ్యానించారు. (జేసీ ప్రభాకర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement