
సాక్షి, తాడేపల్లి : రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా చెప్పుకుంటున్న నిమ్మగడ్డ రమేష్‌కుమార్ తీరు సరిగా లేదని రాష్ట్రప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. రాజ్యంగ పదవిలో ఉండాలంటూనే.. హోటళ్లలో మంతనాలు జరుపుతున్నారని మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎస్‌ఈసీ వ్యవహారంపై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతుండగా.. రాజ్యంగ పదవిలో ఉన్న వ్యక్తి దానిని గౌరవించాల్సిన పని లేదా అని ప్రశ్నించారు. రాజ్యాంగ వ్యవస్థకు తగ్గట్టుగా నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ప్రవర్తించడం లేదని తెలిపారు. (దేవుడు కచ్చితంగా ఆశీర్వదిస్తాడు: సీఎం జగన్)
నిష్పక్షపాతంగా వ్యవహరించకుండా రాజకీయ నాయకులను ఎందుకు రహస్యంగా కలుస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ కోర్టులో కేసులు వేస్తున్నా నిమ్మగడ్డకు ఆ డబ్బులు ఎవరిస్తున్నారని ప్రశ్నించారు. అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచన అని గుర్తుచేశారు. సీఎం జగన్ సంక్షేమ పాలన చూసి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఓర్వలేకపోతున్నారని అన్నారు. చంద్రబాబు ఏదోరకంగా ప్రభుత్వంపై విషయం చిమ్మాలని చూస్తున్నారని మండిపడ్డారు. పబ్లిసిటీ కోసం చంద్రబాబు ఎంతకైనా తెగిస్తారని విమర్శించారు. శవాలపై కూడా రాజకీయం చేసే దుర్భుద్ధి చంద్రబాబుదని చెప్పారు.(ఇది జీవితంలో మరిచిపోలేని రోజు: మోపిదేవి)
Comments
Please login to add a commentAdd a comment