సాక్షి, తాడేపల్లి: ఏపీ స్కిల్ స్కామ్ కేసులో అన్ని ఆధారాలతో దొరికేసిన చంద్రబాబు నాయుడు.. తాను నిప్పును అని చెప్పుకుంటూ బిల్డప్ ఇవ్వడం నిజంగా సిగ్గు చేటన్నారు రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి. ఈరోజు(గురువారం) తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మీడియాతో మాట్లాడిన శ్రీకాంత్‌రెడ్డి.. క్విడ్ ప్రోకో కింద రాష్ట్ర నిధుల్ని దోచేసి నిప్పు అని చంద్రబాబు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. చంద్రబాబు నాయుడు తన హయాంలో చేసిన స్కాములు ఒక్కోక్కటిగా బయటికి వస్తున్నాయని ఈ సందర్భంగా శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు.
‘అసెంబ్లీలో స్కిల్ స్కామ్‌పై సుదీర్ఘ చర్చ జరిగింది. మరి ఆ సమావేశాల్ని నుంచి టీడీపీ సభ్యులు పారిపోయారు. టీడీపీ సభ్యులు ఎందుకు పారిపోవాల్సి వచ్చిందో చెప్పాలి. టీడీపీ సభ్యుల ప్రవర్తనను ప్రతి ఒక్కరూ అసహ్యించుకుంటున్నారు. చంద్రబాబు చేసిన స్కామ్‌లను సంబంధిత అధికారులు బయటపెడితే అదేదో రాజకీయ కక్ష సాధింపు అంటూ మాట్లాడటం సరికాదు. చంద్రబాబు అరెస్టు తర్వాత ఎల్లో మీడియా దారుణంగా ప్రవర్తించింది. చంద్రబాబు తప్పు చేయకపోతే కోట్లు పెట్టి లాయర్లను ఎందుకు పెట్టుకుంటాడు. అన్ని ఆధారాలతో చంద్రబాబును అరెస్టు చేశారు’ అని తెలిపారు.
గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఏమన్నారంటే..
►చంద్రబాబు అవినీతి ప్రపంచమంతా తెలిసిపోయింది
►దీనిపై అసెంబ్లీలో చర్చకు రాకుఙడా టీడీపీ నేతలు పారిపోయారు
►తమ బండారం బయట పడుతుందని తెలిసి టీడీపీ వారు వెళ్లిపోయారు
►పైగా స్పీకర్ పై దాడి చేయటం, విజిల్స్ వేయటం, తిడ కొట్టటం వంటి అరాచకాలు చేశారు
►వారి అరాచకం అంతా ప్రజలకు వాస్తవాలు తెలియకుండా అడ్డుకోవటానికే
►టీడీపీ వారు అడిగిందే మొదట టేకప్ చేయమని ముఖ్యమంత్రి చెప్తారు
►అందుకే బిఎసీలో కూడా పాల్గొనకుండా పరారయ్యారు
►రెండో రోజు కూడా బాలకృష్ణతో సహా టీడీపీ వారంతా అడ్డగోలుగా వ్యవహరించారు
►ఎందుకు ఇలా చేస్తున్నారని అడిగితే సమాధానం చెప్పరు
►వారు ఇచ్చిన వాయిదా తీర్మానం మీదనే చర్చిద్దామన్నా కూడా రాలేదు
►విజిల్స్ వేసిన ముగ్గురినే సస్పెండ్ చేస్తే మిగతావారు కూడా ఎందుకు సభ నుండి పారిపోయారో ప్రజలకు చెప్పాలి
►స్పీకర్ మీద పేపర్లు వేశారు, టేబుల్ మీద అద్దం పగులకొట్టారు
►బయటకు వెళ్లి పవర్ పాయింట్ ప్రజంటేషన్ అంటూ హడావుడి చేశారు
►అదే చర్చ సభలో పెడితే మేము సమాధానం చెప్పేవాళ్లం
►చంద్రబాబు అరెస్టు అయ్యాక ఎల్లోమీడియా పిచ్చి పీక్ స్టేజ్ కి వెళ్లింది
►దీన్ని ఎల్లో ఇజం అనాలో ఏమనాలో కూడా అర్థం కావటం లేదు
►నిజంగా చంద్రబాబు నిప్పు ఐతే మరి సభలో ఎందుకు చర్చించలేదు?
►మా దగ్గర అన్ని సమాధానాలు ఉన్నాయని తెలిసి మూడో రోజు నుండి ఇక సభకు రాలేదు
►దేవాలయంలాంటి అసెంబ్లీలో టీడీపీ సభ్యుల ప్రవర్తనపై వారే ఆత్మ పరిశీలన చేసుకోవాలి
►సీఐడీ కూడా కోర్టు ముందు ఇవే అంశాలను చెప్పింది కాబట్టే చంద్రబాబుకు రిమాండ్ విధించింది
►చంద్రబాబు చేసిన తప్పులన్నీ సీఐడీ బయట పెట్టింది
►షెల్ కంపెనీలకు డబ్బు ఎలా మళ్లించారో వాస్తవాలు ప్రజలకు తెలిశాయి
►చంద్రబాబు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు
►కోట్లకొద్దీ డబ్బు వెదజల్లి పెద్ద పెద్ద లాయర్లను తెచ్చినా కోర్టు వాస్తవాలనే గ్రహించి రిమాండ్ వేసింది
►18 బిల్లులపై చర్చించాం
►ప్రజలజు ఉపయోగపడే అనేక అంశాలపై చర్చిస్తుంటే ఎందుకు పారిపోయారు?
►కాంట్రాక్టు ఉద్యోగులకు మేలు చేసే నిర్ణయాలు తీసుకున్నా ఎల్లోమీడియాకు కనపడలేదు
►మహిళా స్వాబలంబన గురించి సుదీర్ఘ చర్చ జరిగినా టీడీపీ వారు పట్టించుకోలేదు
►పదవుల నుండి పథకాల వరకు అన్నిటిలోనూ మహిళలకు మేము ప్రాధాన్యత ఇచ్చాం
►దీనిపై చర్చించటానికి రమ్మంటే టీడీపీ వారు రాలేదు
►కోర్టులపైనే దూషణలు చేస్తున్నారు
►జైల్లో నుండే చంద్రబాబు అరాచకాలకు ఆదేశాలు ఇస్తున్నారు
►జగన్ గురించి టీడీపీ సభ్యులు చులకనగా మాట్లాడారు
►అలాంటి సమయంలో మావాళ్లు ఎంతో సంయమనం పాటించాం
►కానీ చంద్రబాబు మాత్రం తన భార్యను ఎవరో ఏదో అన్నారని మీడియా ముందు ఏడ్చారు
►అప్పుడే మేము వివరణ కూడా ఇచ్చాం
►కానీ భువనేశ్వరి మళ్ళీ ఇప్పుడు అదే విషయాన్ని రాజకీయ లబ్ది కోసం మాట్లాడారు
►ఇది తప్పు అని భువనేశ్వరి గుర్తించాలి
►ఫైబర్ నెట్, రింగ్ రోడ్‌లో ఎలాంటి స్కాంలు జరిగాయో అసెంబ్లీలో సుదీర్ఘంగా చర్చ జరిగింది
►చంద్రబాబు మేనేజ్ పాలిటిక్స్ మానుకోవాలి
చదవండి: నారా లోకేష్ యువగళం వాయిదా!.. టీడీపీ నేతల్లో కొత్త టెన్షన్!
Comments
Please login to add a commentAdd a comment