సాక్షి,తాడేపల్లి: పథకాలకు కేటాయింపులు లేకుండా కూటమి ప్రభుత్వం ఏపీ బడ్జెట్‌ను రూ.41వేల కోట్లు పెంచిందని మాజీ మంత్రి,వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి విమర్శించారు.
కూటమి ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన 2024-25 బడ్జెట్‌పై సోమవారం(నవంబర్ 11)తాడేపల్లి వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.‘అమరావతికి రూ.15వేల కోట్లు చూపించారు. అది గ్రాంటో అప్పో చెప్పలేదు. మైనస్‌లో ఉన్న మీరు ఆరు నెలల్లో రూ.24 వేల కోట్ల ఆదాయం ఎలా పెంచుతారు.
అన్నదాత సుఖీభవ పథకం ఎంతమందికి ఇస్తారో చెప్పలేదు. దీనికి బడ్జెట్‌లో పెట్టింది. కేవలం రూ.1000కోట్లు. ఈ పథకం అమలు చేయాలంటే రూ.10 వేల కోట్లు కావాలి. బడ్జెట్‌లో మహిళలకు ఉచిత బస్సు ప్రస్తావనే లేదు. బడ్జెట్‌లో ఆడబిడ్డ నిధి ఊసే లేదు. పథకాలకు నిధుల కేటాయింపు పూర్తిగా తగ్గించారు’అని బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు.
ప్రెస్‌మీట్‌లో బుగ్గన ఇంకా ఏమన్నారంటే..
- ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఐదు నెలలపాటు బడ్జెట్ ప్రవేశపెట్టలేదు.
- ఎంతో అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు ఎందుకు బడ్జెట్ పెట్టలేదు?
- ఐదు నెలలపాటు బడ్జెట్ పెట్టకపోవడం గండికోట రహస్యంగా మారింది.
- గత ప్రభుత్వం" అనే మాటని 21 సార్లు ఉపయోగించారు.
- మేనిఫెస్టో అమలు చేస్తారని భావించిన వారికి నిరాశ కలిగేలా బడ్జెట్ ఉంది.
- గత ప్రభుత్వం కంటే రూ.41 వేల కోట్ల ఎక్కువ ఖర్చు పెట్టేలా బడ్జెట్ ప్రవేశ పెట్టారు.
- ఎలాంటి పథకాలు అమలు చేయకుండానే ఇంత ఖర్చు ఎందుకో అర్థం కావడం లేదు.
- అమరావతి కోసం పెట్టే రూ.15 వేల కోట్ల ఖర్చు అప్పా? గ్రాంటా? ఆ లెక్కలకు క్లారిటీ ఇవ్వలేదు.
- మా హయాంలో ఆదాయం పెరిగితే చంద్రబాబు హయాంలో మైనస్ వచ్చింది.
- తల్లికివందనం కింద ఏడాదికి రూ.15 వేలు ఇస్తామన్నారు.
- ఎవరికీ ఈ పథకాన్ని అమలు చేయకుండానే చేసినట్టు మాట్లాడారు.
- ఇంతకంటే అన్యాయం ఉంటుందా?
- రూ.10,706 వేల కోట్లకుపైగా అన్నదాత సుఖీభవకు ఇవ్వాల్సి ఉండగా వెయ్యి కోట్లు మాత్రమే ఇవ్వడమేంటి?
- మహిళలకు ఉచితబస్సు గురించి ప్రస్తావనే లేదు.
- కరెంటు సంస్థలకు అప్పులు చెల్లించకుండా ఎగ్గొడితే మా ప్రభుత్వం చెల్లించింది.
- కానీ మా ప్రభుత్వం వల్ల కరెంటు సంస్థలకు నష్టాలు వచ్చినట్టు ఆరోపణలు చేస్తున్నారు.
- గతంలో కూడా రూ. 87వేల కోట్లు రైతురుణమాఫీ చేయాల్సి ఉండగా కేవలం రూ.15 వేల కోట్లు చేశారు.
- డ్వాక్రా గ్రూపులకు సున్నా వడ్డీలు 21వేల కోట్లు చెల్లించకుండా మోసం చేశారు.
- నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇస్తామని ఎగ్గొట్టారు.
- మళ్ళీ 2024 ఎన్నికల్లో కూడా ప్రజలను మోసం చేసి గెలిచారు.
- 2009,2014,2019,2024 లో వరుసగా అవే హామీలు ఇస్తూ జనాన్ని మోసం చేస్తూ వచ్చారు.
- అమరావతి ఏ రకంగా గొప్ప నగరమో తెలియదు.
- ప్రపంచబ్యాంకు నుంచి అప్పులు తీసుకుని కడతామంటున్నారు.
- మా హయాంలో ఏ పథకానికి ఎంత ఖర్చు చేస్తామో వివరంగా జనానికి తెలిపాం.
- ఎన్నికల సమయంలో ఆసరా డబ్బు ఇవ్వనీయకుండా చంద్రబాబు అడ్డుకున్నారు.
- ఏపీ మరో శ్రీలంక అవుతుందని ఎల్లోమీడియాలో తెగ వార్తలు రాశారు.
- మరి ఇప్పటి అప్పులు కనపడటం లేదా?
- రూ.14లక్షల కోట్ల అప్పులు చేసినట్టు గతంలో మాపైఆరోపణలు చేశారు.
- కానీ ఇప్పుడు టీడీపీ ప్రభుత్వమే రూ. 4 లక్షల కోట్లుగా అప్పు చేసినట్టు లెక్కలు చూపెట్టారు.
- మాపై తప్పుడు సమాచారం ప్రచురించిన మీడియా సంస్థలు ప్రజలకు క్షమాపణ చెప్పాలి.
- 2014-19 మధ్య చంద్రబాబు చేసిన అప్పులకంటే మా హయాంలో చాలా తక్కువగా అప్పులు చేశాం.
- ప్రజలంతా పరిస్థితులను గమనించాలి.
- మోసపూరిత మాటలు ఎవరు చెప్తున్నారో? ప్రజలకోసం ఎవరు చేస్తున్నారో చూడాలి
ఇదీ చదవండి: వ్యవసాయ బడ్జెట్: రైతులను దారుణంగా మోసం చేసిన చంద్రబాబు
Comments
Please login to add a commentAdd a comment