Breadcrumb
AP Budget 2022: ఏపీ బడ్జెట్ రూ. 2,56,256 కోట్లు
Published Fri, Mar 11 2022 9:19 AM | Last Updated on Fri, Mar 11 2022 8:50 PM
Live Updates
ఏపీ బడ్జెట్ సెషన్స్ 2022-23 అప్డేట్స్
వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన కన్నబాబు
వ్యవసాయ బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కురసాల కన్నబాబు
మార్కెటింగ్ యార్డుల్లో నాడు-నేడు, మార్కెటింగ్ శాఖ అభివృద్ధికి రూ. 614.23 కోట్లు
సహకార శాఖకు రూ.248.45 కోట్లు
ఆహార శుద్ధి విభాగానికి రూ.146.41 కోట్లు
ఉద్యానశాఖకు రూ.554 కోట్లు
పట్టు పరిశ్రమకు రూ. 98.99 కోట్లు
ఆచార్య ఎంజీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి రూ.421.15 కోట్లు
వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయానికి రూ.59.91 కోట్లు
వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయానికి రూ.122.50 కోట్లు
పశు సంవర్ధక శాఖకు రూ.1027.82 కోట్లు
ఏపీ వ్యవసాయ బడ్జెట్
మత్స్య శాఖ అభివృద్ధి కోసం రూ.337.23 కోట్లు
వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ కోసం రూ. 5000 కోట్లు
వైఎస్సార్ జలకళకు రూ. 50 కోట్లు
నీటి పారుదల రంగానికి రూ. 11450.94కోట్లు
ముగిసిన ఏపీ వార్షిక బడ్జెట్ ప్రసంగం
ఏపీ వార్షిక బడ్జెట్ ప్రసంగం ముగిసింది. ఆర్థికశాఖా మంత్రి బుగ్గన వార్షిక బడ్జెట్‌ను శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. సుమారు రెండు గంటల పాటు బుగ్గన ప్రసంగించారు.
రైతు భరోసా కేంద్రాల బలోపేతం
రైతు భరోసా కేంద్రాల బలోపేతానికి రూ. 18 కోట్లను ఏపీ బడ్జెట్లో కేటాయించారు.
వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ పథకానికి 7020 కోట్లు
వైఎస్సార్ ఉచిత పంటల బీమా కోసం 1802 కోట్లు
వైఎస్సార్ సున్నవడ్డీ పంట రుణాల కింద 500 కోట్లు
విత్తన రాయతీకి 200 కోట్లు
ప్రకృతి విపత్తుల సహాయ నిధి కోసం 2000 కోట్ల ప్రతిపాదన
సమగ్ర వ్యవసాయ పరీక్షా కేంద్రాలకు 50 కోట్లు
రైతుల ఎక్స్ గ్రేషియా కోసం 20 కోట్లు
వ్యవసాయంలో ఆధునిక సాంకేతికత కోసం 200 కోట్లు
సామాజిక సేవారంగంలో కేటాయింపులు
విద్యకు: రూ. 30, 077 కోట్లు
హౌసింగ్:రూ. 4,791.69 కోట్లు
లేబర్ అండ్ ఎంప్లాయిమెంట్: రూ. 1,033.86 కోట్లు
వైద్యం: రూ. 15, 384.26 కోట్లు
సామాజిక భద్రత మరియు సంక్షేమం: రూ. 4,331. 85 కోట్లు
క్రీడలు, యువత: రూ. 140.48 కోట్లు
సాంకేతిక విద్యః రూ. 413.5 కోట్లు
పట్టణాభివృద్ధి రూ. 8,796 కోట్లు
తాగునీరు, పారిశుధ్యం: రూ. 2, 133.63 కోట్లు
సంక్షేమంః రూ. 45,955 కోట్లు
టీడీపీ సభ్యులపై స్పీకర్ ఆగ్రహం
ఏపీ బడ్జెట్ ప్రసంగం కొనసాగుతున్న వేళ.. టీడీపీ సభ్యులు మంత్రి బుగ్గన ప్రసంగానికి అడ్డు తగిలారు. దీంతో స్పీకర్ తమ్మినేని అసహనం వ్యక్తం చేశారు. చర్చించే సమయం ఉంటుందన్నా కూడా వినకుండా టీడీపీ సభ్యులు సభకు విఘాతం కలిగించే ప్రయత్నం చేశారు. దీంతో స్పీకర్ తమ్మినేని, టీడీపీ సభ్యుల్ని వారించారు.
నవరత్నాల సంక్షేమానికి పెద్దపీట
వైఎస్సార్ పెన్షన్ కానుక రూ. 18 వేల కోట్లు కేటాయింపు
వైఎస్సార్ రైతు భరోసా రూ. 3,900 కోట్లు కేటాయింపు
2022-23 ఏపీ వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన బుగ్గన
2022-23 ఏపీ వార్షిక బడ్జెట్ రూ. 2,56,256 కోట్లు
రెవెన్యూ వ్యయం రూ. 2,08, 261 కోట్లు
మూలధన వ్యయం రూ. 47,996 కోట్లు
రెవెన్యూలోటు రూ. 17,036 కోట్లు
ద్రవ్యలోటు రూ. 48,724 కోట్లు
వైఎస్సార్ పెన్షన్ కానుక రూ. 18 వేల కోట్లు కేటాయింపు
వైఎస్సార్ రైతు భరోసా రూ. 3,900 కోట్లు కేటాయింపు
ఏపీ బడ్జెట్ సెషన్స్ 2022-23
AP: అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
2022-23 ఏపీ వార్షిక బడ్జెట్ రూ. 2,56,256 కోట్లు
సంక్షేమ పథకాల వల్లే సుస్థిరాభివృద్ధి
అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించడంలో ఏపీ దేశ సగటు రేటు దాటిందని ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్‌కుమార్ ప్రకటించారు. సోషియో ఎకనామిక్‌ను సీఎం వైఎస్ జగన్ విడుదల చేయగా.. ముఖ్యాంశాలను విజయ్ కుమార్ వెల్లడించారు. వ్యవసాయం రంగంలో 14.5 శాతం ప్రగతి నమోదు అయ్యిందన్నారు. సామాజిక, ఆర్థిక సర్వే 2021-22లో జీఎస్డీపీలో వృద్ధి రేటు బాగా పెరిగిందని తెలిపారాయన. పరిశ్రమల రంగంలో 25.5 శాతం, సేవా రంగంలో 18.9 శాతం ప్రగతి నమోదు అయ్యింది. తలసరి వృద్ధి రేటు కూడా రూ.31 వేలు పెరిగి.. 17.5 శాతం పెరిగింది. వివిధ సంక్షేమ పథకాల్లో ప్రగతి రావడంతో సుస్థిరాభివృద్ధి పెరిగిందని విజయ్ కుమార్ వెల్లడించారు.
కాసేపట్లో ఏపీ బడ్జెట్
కాసేపట్లో ఏపీ వార్షిక బడ్జెట్ 2022-23ను మంత్రి బుగ్గన ప్రవేశపెట్టనున్నారు.
సోషియో ఎకనామిక్ సర్వే విడుదల
బడ్జెట్‌కు ముందు సోషియో ఎకనామిక్ సర్వే విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్
జగనన్న హామీలకు తగ్గట్లే బడ్జెట్
ఏపీ వార్షిక బడ్జెట్ 2022-23లో.. వ్యవసాయం, మహిళా సంక్షేమం, విద్య, వైద్య రంగాలకు అధిక కేటాయింపులు ఉంటాయి. నవరత్నాల పథకాలకు ప్రాధాన్యం ఇచ్చాం. సీఎం జగన్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా బడ్జెట్ రూపొందించాం: మంత్రి బుగ్గన
ఏపీ వార్షిక బడ్జెట్‌కు కేబినెట్.ఆమోదం
ఏపీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ భేటీ జరిగింది. ఈ భేటీలో ఏపీ వార్షిక బడ్జెట్ 2022-23కు ఆమోదం తెలిపింది కేబినెట్.
సచివాలయంకు చేరుకున్న ఆర్థిక మంత్రి బుగ్గన.. అధికారులు. బడ్జెట్ నేపథ్యంలో ఆలయంలో ప్రత్యేక పూజలు. ఉదయం 10.15ని. శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టునున్న మంత్రి. ప్రధాన రంగాలకే ఎక్కువ కేటాయింపులన్న మంత్రి.
మహిళా సాధికారతకు ప్రాధాన్యత
వరుసగా రెండో దఫా కూడా మహిళా సాధికారతకు ప్రాధాన్యత ఇస్తూ జెండర్ బేస్డ్ బడ్జెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉభయ సభల్లో ప్రవేశపెట్టనుంది. మహిళలు, పిల్లలకు బడ్జెట్లో ప్రత్యేకంగా కేటాయింపులు చేయనున్నారు.
అభివృద్ధి నిధి కింద ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి రూ.రెండు కోట్ల చొప్పున మొత్తం రూ.350 కోట్లను బడ్జెట్లో కేటాయించనున్నట్లు సమాచారం.
వరుసగా రెండో ఏడాది జెండర్ బేస్ట్ బడ్జెట్
శాసనమండలిలో డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి సాధారణ బడ్జెట్‌ను, వ్యవయసాయ బడ్జెట్‌ను సీదిరి అప్పలరాజు ప్రవేశపెడతారు.
వరుసగా రెండో ఏడాది జెండర్ బేస్ట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది వైఎస్సార్సీపీ ప్రభుత్వం. ప్రజాసంక్షేమమే లక్ష్యంగా సాగుతున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ప్రజల ఆకాంక్షలకు అద్దంపట్టేలా బడ్జెట్ ఉంటుందనే సంకేతాలు ఇదివరకే పంపించారు.
బడ్జెట్లో ముఖ్యంగా నవరత్నాలకు అధిక నిధులు కేటాయించే అవకాశం కనిపిస్తోంది. అటు జగనన్న కాలనీలు, విద్య, వైద్యానికి కూడా బడ్జెట్లో భారీ కేటాయింపులు ఉండనున్నట్లు సమాచారం.
ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన నవరత్నాల ప్రయోజనాలను కొనసాగించడమే లక్ష్యంగా అన్ని వర్గాలకు అండగా నిలిచేలా 2022 – 23 వార్షిక బడ్జెట్‌కు రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేసింది.
అసెంబ్లీలో ఏపీ వార్షిక బడ్జెట్
ఏపీ వార్షిక బడ్జెట్ 2022-23ను అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది వైఎస్సార్సీపీ ప్రభుత్వం. బడ్జెట్లో కేటాయింపులపై ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు ఏపీ ప్రజలు. శాసన సభలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రాష్ట్రవార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుండగా.. మంత్రి కన్నబాబు వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
Related News By Category
Related News By Tags
-
ఏపీ బడ్జెట్ 2022-23 ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి బుగ్గన
సాక్షి, అమరావతి: బడ్జెట్ సమావేశాల్లో భాగంగా.. ఏపీ వార్షిక బడ్జెట్ 2022-23ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టారు. తిరువళ్వార్ సూక్తులతో బడ్జెట్ ప్రసంగం మొదలుపెట్టిన మంత్రి బుగ్...
-
సుస్థిరాభివృద్ధికి నాలుగు స్తంభాలు
సాక్షి, అమరావతి: కరోనా వంటి సంక్షోభాలను ఎదుర్కొంటూ సుస్థిరాభివృద్ధిని సాధించే దిశగా 2022–23 ఆర్థిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నట్లు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పేర్కొన్నారు. ...
-
ఏపీ బడ్జెట్: మరో ముందడుగు
ఏ కుటుంబానికైనా ఆరోగ్యం, విద్య అత్యంత ముఖ్యం. పిల్లలను బాగా చదివించుకోవడానికి సహకారం అందడం.. ఎప్పుడైనా దురదృష్టవశాత్తు ఏదైనా జబ్బు బారిన పడితే ఆదుకునే వారుండటం.. సింహ భాగం ప్రజలు ఆశించేది ఇంతే. దీనికి...
-
AP Budget 2021: జన సాధికార బడ్జెట్
►మహిళలు ముందడుగు వేయాలి. స్వతంత్రంగా తలెత్తుకుని బతకాలి!!. ►అన్నదాతకు విత్తు నుంచి ఎరువుల వరకూ అన్నీ ఊళ్లోనే ఇవ్వాలి. కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇచ్చి కొనుగోలు చేయాలి. పంట దెబ్బతింటే బీమాత...
-
అప్పులపై అడ్డగోలు లెక్కలా?: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ‘అధికారంలోకి వచ్చి ఆర్నెల్లు అవుతోంది.. ప్రభుత్వ యంత్రాంగమంతా నీ చేతుల్లోనే ఉంది.. నీ చేతుల్లో ఉన్న అధికారులతో అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టావు.. అందులో అంకెలన్నీ నువ్వు పెట్టినవే.....
Comments
Please login to add a commentAdd a comment