AP Budget 2022-23 Highlights, Key Features, And Allocations Details - Sakshi
Sakshi News home page

ఏపీ బడ్జెట్‌ 2022-23: రూ. 2,56,256 కోట్లతో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి బుగ్గన

Published Fri, Mar 11 2022 10:47 AM | Last Updated on Fri, Mar 11 2022 1:16 PM

AP Budget 2022-23 Highlights And Key Features Details - Sakshi

సాక్షి, అమరావతి: బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా.. ఏపీ వార్షిక బడ్జెట్‌ 2022-23ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి ప్రవేశపెట్టారు. తిరువళ్వార్‌ సూక్తులతో బడ్జెట్‌ ప్రసంగం మొదలుపెట్టిన మంత్రి బుగ్గన.. బడ్జెట్‌ వివరాలను సభకు వివరించారు.  మధ్యమధ్యలో గురజాడ అప్పారావు, శ్రీశ్రీ కవితలను చదివి వినిపించారు.

విపత్తును ఎదుర్కొన్నప్పుడే మన సామర్థ్యం తెలుస్తుందన్న మంత్రి బుగ్గన.. నీతి ఆయోగ్‌ విడుదల చేసిన పలు నివేదికల్లో ఏపీకి దక్కిన ఘనత గురించి వివరించారు. సంక్షేమ పథకాల సమర్థవంతంగా అమలు చేయడం.. వెనుకబడిన వర్గాల అభివృద్ధికి రెండింతలు కేటాయింపులు పెంచినట్లు తెలిపారు. కరోనాలాంటి మహమ్మారిని ఎదుర్కొంటూ.. వైఎస్‌ జగన్‌ నేతృత్వంలోని ప్రభుత్వం సమర్థవంతంగా సంక్షేమ ఫలాలను ప్రజలకు అందించిందని మంత్రి బుగ్గన గుర్తు చేశారు.

ఇక 2022-23 వార్షిక బడ్జెట్‌ రూ. 2,56,256 కోట్లు గా పేర్కొన్న మంత్రి బుగ్గన.. రెవెన్యూ వ్యవయం రూ. 2, 08, 261 కోట్లు, మూల ధన వ్యవయం రూ. 47, 996 కోట్లు,  రెవెన్యూ లోటు రూ. 17, 036 కోట్లు,  ద్రవ్య లోటు రూ. 48, 724 కోట్లు, జీఎస్‌డీపీ రెవెన్యూ లోటు 1.27 శాతంగా బడ్జెట్‌లో పొందుపర్చారు.

మొత్తం బడ్జెట్ - రూ. 2,56,256 కోట్లు
రెవెన్యూ వ్యయం - రూ. 2,08,261 కోట్లు
మూలధన వ్యయం - రూ. 47,996 కోట్లు
రెవెన్యూ లోటు - రూ. 17,036 కోట్లు
ద్రవ్యలోటు - రూ. 48,724 కోట్లు
వైఎస్సార్ రైతు భరోసా రూ. 3,900 కోట్లు
వైఎస్సార్ పెన్షన్ కానుక పథకం రూ. 18 వేల కోట్లు
ఎస్సీ సబ్ ప్లాన్  రూ. 18,518 కోట్లు
ఎస్టీ సబ్ ప్లాన్  రూ. 6,145 కోట్లు
బీసీ సబ్ ప్లాన్  రూ. 29,143 కోట్లు
బీసీ సంక్షేమం రూ. 20,962 కోట్లు
మైనార్టీ యాక్షన్ ప్లాన్  రూ. 3,532 కోట్లు
ఈబీసీల సంక్షేమం రూ 6,639 కోట్లు
సోషల్ వెల్ఫేర్  12,728 కోట్లు
ఈడబ్ల్యూఎస్  రూ. 10,201 కోట్లు
 

పలు రంగాలకు కేటాయింపులు

  • వ్యవసాయం: రూ. 11,387.69 కోట్లు.
  • వైద్య శాఖ 15,384 కోట్లు
  • పశుసంవర్ధకం: రూ. 1568.83 కోట్లు.
  • బీసీ సంక్షేమం: రూ. 20,962.06 కోట్లు
  • రోడ్లు, భవనాల శాఖ రూ. 8,581 కోట్లు
  • పర్యావరణ, అటవీ: రూ. 685.36 కోట్లు.
  • ఉన్నత విద్య: రూ. 2,014.30 కోట్లు.
  • విద్యుత్: రూ. 10,281.04 కోట్లు.
  • సెకండరీ ఎడ్యుకేషన్: రూ. 27,706.66 కోట్లు.
  • ఎకానమికల్ బ్యాక్ వర్డ్: రూ. 10,201.60 కోట్లు.
  • సివిల్ సప్లైస్: రూ. 3,719.24 కోట్లు.
  • ఫైనాన్స్: రూ. 58,583.61 కోట్లు
  • జీఏడీ: రూ. 998.55 కోట్లు.
  • సచివాలయ వ్యవస్థ: రూ. 3,396.25 కోట్లు
  • మహిళా శిశు సంక్షేమం రూ. 4,382 కోట్లు
  • క్రీడల శాఖ రూ. 290 కోట్లు
  • పరిశ్రమల శాఖ రూ. 2,755 కోట్లు
  • హోంశాఖ 7,586 కోట్లు

సంక్షేమ పథకాల అమలు కోసం..

వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక -రూ. 18 వేల కోట్లు
వైఎస్సార్‌ రైతు భరోసా -రూ. 3, 900 కోట్లు
జగనన్న విద్యా దీవెన -రూ. 2, 500 కోట్లు
జగనన్న వసతి దీవెన -రూ. 2, 083 కోట్లు
వైఎస్సార్‌-పీఎం ఫసల్‌ బీమా యోజన-రూ. 1, 802 కోట్లు
వైఎస్సార్‌ స్వయంసహకార సంఘాల(గ్రామీణ) ఉచిత వడ్డీరహిత రుణాలు రూ. 600 కోట్లు
వైఎస్సార్‌ స్వయంసహకార సంఘాల(అర్బన్‌) ఉచిత వడ్డీరహిత రుణాలు రూ. 200 కోట్లు
వైఎస్సార్‌ వడ్డీ రహిత రైతు రుణాలు-రూ. 500 కోట్లు
వైఎస్సార్‌ కాపు నేస్తం -రూ. 500 కోట్లు 
వైఎస్సార్‌ జగనన్న చేదోడు-రూ. 300 కోట్లు
వైఎస్సార్‌ వాహన మిత్ర-రూ. 260 కోట్లు
వైఎస్సార్‌ నేతన్న నేస్తం- రూ. 199 కోట్లు
వైఎస్సార్‌ మత్స్యకార భరోసా-రూ. 120.49 కోట్లు
మత్స్యకారుల డీజిల్ సబ్సిడీ-రూ. 50 కోట్లు
రైతుల ఎక్స్‌గ్రేషియా-రూ. 20కోట్లు
లా నేస్తం- రూ. 15 కోట్లు
జగనన్న తోడు-రూ. 25 కోట్లు
ఈబీసీ నేస్తం   రూ. 590 కోట్లు
వైఎస్సార్‌ ఆసరా - రూ. 6, 400 కోట్లు
వైఎస్సార్‌ చేయూత-రూ. 4, 235 కోట్లు
అమ్మ ఒడి-రూ. 6, 500 కోట్లు

సామాజిక సేవారంగంలో కేటాయింపులు:
 విద్యకు-రూ. 30, 077 కోట్లు
 హౌసింగ్- రూ. 4,791.69 కోట్లు
 లేబర్ అండ్ ఎంప్లాయిమెంట్ః రూ. 1,033.86 కోట్లు
 వైద్యం-రూ. 15, 384.26 కోట్లు
 సామాజిక భద్రత మరియు సంక్షేమంః రూ. 4,331. 85 కోట్లు
 క్రీడలు, యువత -రూ. 140.48 కోట్లు
 సాంకేతిక విద్య- రూ. 413.5 కోట్లు
పట్టణాభివృద్ధి- రూ. 8,796 కోట్లు
తాగునీరు, పారిశుధ్యం- రూ. 2, 133.63 కోట్లు
సంక్షేమం- రూ. 45,955 కోట్లు - గతేడాది రూ. 27, 964 కోట్లు
మొత్తంగా సామాజిక సేవా రంగాల కోసంః రూ. 1,13,340.20 కోట్లు
(మొత్తంగా బడ్జెట్ లో సామాజిక సేవా రంగానికి 44. 23 శాతం)
ఇవికాకుండా, సాధారణ సేవలకు రూ. 73, 609.63 కోట్లు

 

వ్యవసాయ అనుబంధ రంగాలుః రూ. 13, 630.10 కోట్లు
ఇంధన రంగంః రూ. 10, 281.04 కోట్లు
జనరల్ ఎకో సర్వీసెస్-రూ. 4,420. 07 కోట్లు
ఇండస్ట్రీ అండ్ మినరల్స్- రూ. 2,755. 17 కోట్లు
ఇరిగేషన్ ఫ్లడ్ కంట్రోల్-రూ. 11, 482.37 కోట్లు
గ్రామీణాభివృద్ధి- రూ. 17, 109.04 కోట్లు
సైన్స్ అండ్ టెక్నాలజీ- రూ. 11.78 కోట్లు
ట్రాన్స్ పోర్టుః రూ. 9, 617. 15 కోట్లు
మొత్తంగా ఆర్థిక సేవల రంగానికిః రూ. 69, 306. 74 కోట్లు( బడ్జెట్ లో  27.5 శాతం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement