AP Budget 2022-23
-
Ap Budget 2023-24: పరిశ్రమలు, వాణిజ్యానికి రూ. 2,602 కోట్ల కేటాయింపు
సాక్షి, అమరావతి: పరిశ్రమలు, మౌలిక సదుపాయల అభివృద్ధి ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావాన్ని చూపడమే కాక, వివిధ రంగాలలో ఉత్పాదక సామర్థ్యాలను వెలికితీస్తూ, ఉపాధి కల్పనను ప్రోత్సహిస్తుంది. ఇటీవల విశాఖపట్టణంలో జరిగిన ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సుకు అద్భుతమైన స్పందన వచ్చి, ఆకర్షణీయమైన ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానంగా ఏపీ రాష్ట్రం పటిష్టతను ఈ సదస్సు నిరూపించింది. 8,000 మందికి పైగా ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఎన్టీపీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, అదానీ గ్రూప్, జిందాల్ స్టీల్ అండ్ వపర్, భారత్ బయోటెక్, జీఎంఆర్ గ్రూప్, దాల్మియా గ్రూప్, రెన్యూ పవర్, బజాజ్ ఫిన్సర్వ్ లిమిటెడ్, సెంచురీ ఫ్లైబోర్డ్స్, శ్రీ సిమెంట్, రామ్‌కో సిమెంట్స్, అపోలో హాస్పిటల్స్‌తోపాటు అనేక ఇతరప్రముఖ పారిశ్రామిక సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ప్రతిపాదించాయి. ఈ సదస్సులో 48 దేశాల నుంచి రాయబారులు, దౌత్యవేత్తలు, విదేశీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఇజ్రాయెల్, పోలాండ్, డెన్మార్క్,న ఆర్వే, నెదర్లాండ్స్, సింగపూర్, జపాన్ల నుంచి ఏడు అంతర్జాతీయ వ్యాపార ప్రతినిధుల బృందాలు ఏపీ పారిశ్రామిక సామర్థ్యాలపై ఎంతో ఆసక్తిని కనబరిచాయి. ఈ అవకాశాలను అన్వేషించడానికి యూఏఈ, నెదర్లాండ్స్, వియత్నాం, పశ్చిమ ఆస్ట్రేలియా దేశాలతో నాలుగు సమావేశాలు జరిగాయి. 13.42 లక్షల కోట్ల రూపాయల అంచనా పెట్టుబడితో ఏపీలో 6 లక్షలకు పైగా ఉద్యోగాలను సృష్టించే అవకాశంతో, 378 అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేయడంతో ఈ సదస్సు ముగియడం ఎంతో గర్వించదగ్గ విషయం. ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు నుంచి వచ్చిన ఈ విశేష, స్పందన, అనుకూలమైన ప్రభుత్వ పారిశ్రామిక అభివృద్ధి విధానానికి, విశ్వసనీయతకు నిదర్శనం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ ప్రథమ స్థానంలో నిలిచింది. పెట్టుబడిదారుల అన్ని అవసరాల కోసం సింగిల్ డెస్క్ పోర్టల్ సర్వర్లు వన్ స్టాప్ షాప్‌గా ఉంటాయి. దీనిలో భాగంగా ఏప్రిల్ 2019, నుంచి 36,972 దరఖాస్తులు స్వీకరించండి. వాటిలో 36,049 దరఖాస్తులు ఆమోదించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ 31, 2022 వరకు, 13 పెద్ద, భారీ ప్రాజెక్ట్‌లు 15,099 కోట్ల రూపాయల పెట్టుబడి, 12,490 మందికి ఉపాధిని కల్పించి వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించాయి. అదే విధంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా (ఎమ్ఎస్ఎమ్ఈ) రంగంలో 7,742 కోట్ల రూపాయల పెట్టుబడితో 54,430 యూనిట్లు 2,11,219 మందికి ఉపాధి కల్పనతో ఉత్పత్తిలోకి ప్రవేశించాయి. చదవండి: AP Budget 2023-24: పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధికి రూ. 15,873 కోట్ల డిసెంబర్ 2022 వరకు, పారిశ్రామిక ప్రోత్సాహకాల క్రింద జనరల్ కేటగిరీలోని 902 సూక్ష్మ చిన్న మరియు మధ్యతరహా (ఎం.ఎస్.ఎం.ఈ.) యూనిట్లకు, ఇతర వెనుకబడిన తరగతులకు చెందిన 448 యూనిట్లకు, షెడ్యూలు కులాలకు చెందిన 3,748 యూనిట్లకు షెడ్యూలు తెగలకు చెందిన 602 యూనిట్లకు మొత్తం 482 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. అలాగే ఈ ప్రభుత్వం క్లస్టర్ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తోంది. సూక్ష్మ, చిన్న తరహా సంస్థలు-క్లస్టర్ అభివృద్ధి (ఎమ్ఎస్ఈసీడీపీ) ప్రాజెక్టుల కింద కేంద్ర ప్రభుత్వం నుంచి ఏపీ ప్రభుత్వం ఐదు క్లస్టర్ల నిర్మాణానికి అనుమతిని పొందింది. అంతే కాకుండా మన రాష్ట్రం జాతీయ పారిశ్రామిక వాడల అభివృద్ధి సంస్థ విశాఖపట్నం నోట్లోని నక్కపల్లి క్లస్టర్, శ్రీకాళహస్తి-ఏర్పేడు నోడ్లోని చిత్తూరు సౌత్ క్లస్టర్, విశాఖపట్నం-చెన్నై పారిశ్రామిక కారిడార్ (వీసీఐసీ) కింద కడప నోడ్ కొప్పర్తి క్లస్టర్ ఈ మూడు పారిశ్రామిక వాడల అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేందుకు ఆమోదం తెల్పింది. 3,155 ఎకరాలలో కొప్పర్తి సమీపంలో వైఎస్సార్ జగనన్న భారీ పారిశ్రామిక వాడను అభివృద్ధి చేస్తోంది. ఈ పారిశ్రామిక వాడ బహుళ ఉత్పత్తుల భారీ పారిశ్రామిక పార్క్ గా 25,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో 75,000 మందికి ఉపాధి కల్పిస్తుంది. భారీ పారిశ్రామిక వాడకు ఆనుకుని వైఎస్సార్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్‌ను కూడా అభివృద్ధి చేస్తోంది దీని ద్వారా సుమారు 10 వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించాలని 25,000 మందికి ఉపాధిని కల్పించే అవకాశం ఉంటుంది. జిందాల్ స్టీల్ వర్క్స్ కంపెనీ 3,300 కోట్ల రూపాయల పెట్టుబడితో, సంవత్సరానికి రెండు మిలియన్ టన్నులు ఉత్పత్తి చేయగల సామర్ధ్యంతో రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో కడప ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయనున్నది. దీని మొదటి దశలో 1000 ఉద్యోగాల వరకు ప్రత్యక్ష ఉపాధిని, రెండవ దశలో ప్రత్యక్షంగా 2,500 ఉద్యోగాలను, పరోక్షంగా 10,000 మందికి ఉపాధిని కల్పిస్తుంది. ఈ ప్రాజెక్టు కడప ప్రాంత ఆర్థిక అభివృద్ధికి దోహదం చేస్తుంది. ► 2023-24 ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమలు మరియు వాణిజ్యం కోసం 2,602 కోట్ల రూపాయల కేటాయించింది. రవాణా, రహదారుల మౌలిక సదుపాయాలు రాష్ట్రంలో దాదాపు 32,725 కి.మీ. ప్రధాన జిల్లా రహదారులు, జిల్లాల్లోని ఇతర రోడ్ల నిర్వహణతోపాటు 4,000 కి.మీ పొడవున ఉన్న బి.టి. రోడ్లను పునరుద్ధరించడానికి చర్యలు తీసుకోవడమైంది. రూ. 400 కోట్ల రూపాయలతో దెబ్బతిన్న రోడ్ల నిర్వహణ, అత్యవసర మరమ్మతులను ప్రభుత్వం చేపట్టింది. 2,205 కోట్ల రూపాయలతో 8,268 కి.మీ. రాష్ట్ర రహదారుల, జిల్లా ప్రధాన రహదారుల అభివృద్ధిని సాధించింది. 'రహదారుల అనుసంధాన ప్రాజెక్ట్' క్రింద కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలకు 437.59 కి.మీ. పొడవుగల రోడ్లకు సంబంధించి 391 కోట్ల రూపాయలతో 46 పనులను మంజూరు చేయడమైనది. డిసెంబర్ 2022 నాటికి 383.66 కి.మీ. పొడవు మేర రహదారి పనులు పూర్తయ్యాయి. ► 2023-24 ఆర్థిక సంవత్సరానికి రవాణా, రహదారుల మరియు భవనాల శాఖకు 9,118 కోట్ల రూపాయల కేటాయించింది. -
AP Budget 2023-24: పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధికి రూ. 15,873 కోట్ల
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సుస్థిరమైన జీవనోపాధిని కల్పించడానికి, గ్రామీణ ప్రాంతాల్లో శాశ్వతమైన ఆస్తులను సృష్టించడానికి 16 ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుంటూ మహత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి కల్పనా హామీ పథకం (ఎమ్‌జీఎన్‌ఆర్‌జీఎస్) అమలు చేస్తోంది. ఈ ఆస్తులలో 10,917 గ్రామ సచివాలయ భనాలు, 10,243 వ్యవసాయ ఉత్పత్తులను నిల్వచేసే నిర్మాణాలు, 8,320 భారత్ నిర్మాణ సేవా కేంద్రాలు, ఎక్కువ మోతాదులో పాల శీతలీకరణ చేసే 3,734 పాల శీతలీకరణ యూనిట్లు, నీటి సంరక్షణా కట్టడాలు ఉన్నాయి. డిసెంబర్ 2022 నాటికి ఈ రంగంలో సుమారుగా 18,39 కోట్ల పని దినాలు కల్పించాయి. అంతేగాక 98 శాతం చెల్లింపులు 15 రోజులలోపు చేశారు. ఉచితంగా బోరు బావులు తవ్వి పంపుసెట్లను ఏర్పాటు చేస్తూ, తద్వారా సాగు యోగ్యమైన భూములకు నీటిపారుదల సౌకర్యాన్ని పెంచేవిధంగా సీఎం జగన్.. సన్న, చిన్నకారు రైతుల కోసం వైఎస్సార్ జలకళ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 28, 2020న ప్రారంభించారు. ఇప్పటి వరకు 17,047 బోరు బావులు తవ్వడం జరిగింది. ప్రస్తుత ప్రభుత్వంలో కుళాయి కనెక్షన్ల ద్వారా సుమారు 65 లక్షల ఇళ్లకు సురక్షిత మంచినీటిని అందించింది. జగనన్న కొత్త హౌసింగ్ కాలనీలతో సహా 2024 సంవత్సరం నాటికి రాష్ట్రంలోని అన్ని కుటుంబాలు వీటి కిందకు తీసుకురాబడతాయి. అంతేగాక 250 అంతకంటే ఎక్కువ జనాభా ఉండి రహదారుల అనుసంధానం లేని అన్ని నివాసాలకు అనుసంధానించడానికి 'ఆంధ్రప్రదేశ్ గ్రామీణ రహదారి ప్రాజెక్టు'ను అమలు చేస్తోంది. ఇప్పటివరకు 1,737 కి.మీ. రహదారుల పొడవుతో సుమారు 1,198 ఆవాసాలు ఈ ప్రాజెక్టు క్రింద అనుసంధానం చేయబడ్డాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 3,692 కి.మీ. రహదారి పొడవుతో అదనంగా 2,461 ఆవాసాలను కలుపుటకు ఈ ప్రాజెక్టు క్రింద ప్రణాళిక చేయబడింది. ప్రయోజనకరమైన ఈ రహదారుల అనుసంధానం వలన మార్కెట్ మెరుగుపడి రోజువారీ వేతనాల పెరుగుదలకు దారితీసింది. ►2023-24 ఆర్థిక సంవత్సరానికి పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధికి 15,873 కోట్ల రూపాయల కేటాయించింది. చదవండి: AP Budget: మహిళా సాధికారతే ధ్యేయంగా.. -
AP Budget 2023-24: విద్యా రంగానికి పెద్దపీట.. ఎన్ని కోట్లు కేటాయించారంటే!
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మన బడి నాడు-నేడు, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, జగనన్న అమ్మ ఒడి, పాఠ్యాంశ సంస్కరణలు, మరుగుదొడ్ల నిర్వహణ నిధి (టీఎమ్‌ఎఫ్), పాఠశాల నిర్వహణ నిధి(ఎన్.ఎమ్, ఎఫ్), సమీకృత పాఠ్యాంశ, పరిపాలన సంస్కరణల వంటి కార్యక్రమాలను, విధి విధానాలను ప్రవేశపెట్టడం ద్వారా పాఠశాల విద్యలో పరివర్తన యుగానికి నాంది పలికింది. ప్రభుత్వ పాఠశాలలో విద్యను మెరుగుపరిచి రాష్ట్ర విద్యార్థులను ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా చేయడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యాన్ని సాధించే దిశగా అన్ని ప్రభుత్వ పాఠశాలలో ప్రత్యేక దృశ్య మాధ్యమ తరగతులు, విద్యా పునాదిని వేసే ప్రాథమిక పాఠశాలలో స్మార్ట్ టీవీ గదులు నిర్మించేందుకు ప్రభుత్వం ఆమెదం తెలిపింది. ఉపాధ్యాయులకు 60,000 ట్యాబ్‌లను, కేంద్ర మాధ్యమిక విద్యా బోర్డు(సీబీఎస్ఈ) సూచించిన విధానంలో 2024-25 విద్యా సంవత్సరంలో 10 వతరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే ప్రస్తుత 8వ తరగతి విద్యార్థులకు 4.6 లక్షల ట్యాబ్‌లను పంపిణీ చేసింది. జగనన్న అమ్మ ఒడి. వినూత్నమైన, విశిష్టమైన జగనన్న అమ్మ ఒడి కార్యక్రమాన్ని అమలు చేయడం ద్వారా పేదరికం విద్యకు అడ్డంకిగా మారకుండా హాజరు శాతం తగ్గకుండా ప్రభుత్వం చూస్తోంది. ఈ పథకం కింద 2019-20 సంవత్సరం నుంచి 44 లక్షల 50 వేల మంది తల్లులకు.. 84 లక్షల మంది పిల్లలకు ప్రయోజనం చేకూర్చేందుకు ఏటా సూమారు రూ. 19,618 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తూ రావడం జరుగుతోంది. ►2023-24 ఆర్థిక సంవత్సరానికి జగనన్న అమ్మ ఒడి పథకం కోసం రూ.6,500 కోట్లు కేటాయించింది. మన బడి నాడు-నేడు మన బడి నాడు-నేడు కార్యక్రమం కింద 15,715 పాఠశాలలో అదనపు తరగతి గదులు, సురక్షిత తాగునీరు పెద్ద, చిన్నచిన్న మరమత్తుల పనులు,మరుగుదొడ్ల నిర్వహణ, విద్యుద్ధీకరణ, పెయింటింగ్, ఫర్నీచర్, గ్రీన్ బోర్డులు, ఇంగ్లీష్ ల్యాబ్‌లు, వంట శాలలను అనే 10 మౌలిక సదుపాయాలు ఆధునీకరిస్తుంది సీఎం జగన్ ప్రభుత్వం.. ఈ కార్యక్రమం కింద మొదటి, రెండవ దశలలో మొత్తం 22,344 పాఠశాలలో పనులు చేపట్టారు. ►2023-24 ఆర్థిక సంవత్సరానికి మన బడి నాడు-నేడు కార్యక్రమం కిందరూ. 3,500 కోట్లు కేటాయించింది. జగనన్న విద్యాకానుక ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతాన్ని మెరుగుపరిచేందుకు. యూనిఫామ్‌లు, బూట్లు, సాక్స్‌లు, పాఠ్యపుస్తకాలు, వర్క్‌బుక్‌లు, స్కూల్ బెల్ట్, మాస్క్‌ల సెట్లతో కూడిన ‘టీచింగ్-లెర్నింగ్ మెటీరియల్’ను విద్యార్థి కిట్ల రూపంలోప్రభుత్వం అందిస్తుంది. ఈ పథకం కిద 47.4 లక్షల మంది పిల్లలకు లబ్ధి చేకూర్చేందుకు ఇప్పటి వరకు రూ. 2,368 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది ►2023-24 బడ్జెట్లో జగనన్న విద్యాకానుక కోసం రూ.560 కోట్లు కేటాయించారు. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పాలిటెక్నిక్, ఐటీఐ, ఇంజనీరింగ్, మెడికల్, డిగ్రీతో పాటు ఉన్నత కోర్సులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అందించే జగనన్న విద్యా దీవెన పథకం ప్రభుత్వం అమలు చేస్తోంది. 2019 నుంచి ఈ పథకం కింద 9,249 కోట్ల రూపాయలను పంపీణి చేశారు ►2013-24 ఆర్థిక సంవత్సరానికి జగనన్న విద్యాదీవెన పథకం కోసం రూ. 2.841 కోట్లు కేటాయించింది. ►జగనన్న వసతి దీవెన పథకం కోసం రూ. 2,200 కోట్ల కేటాయింపు జరిగింది. ►2023-24 ఆర్థిక సంవత్సరానికి పాఠశాల విద్య కోసం రూ. 29,690 కోట్ల రూపాయలు కేటాయించింది. ►ఉన్నత విద్య కోసం రూ. 2,064 కోట్లు కేటాయించింది. -
అందరికీ సంక్షేమాభివృద్ధి..!!
-
చర్చకు రమ్మంటే.. టీడీపీ అలా చేసింది
సాక్షి, అమరావతి: సభలో సభ్యులు అందరూ మాట్లాడతారని అనుకున్నామని, కానీ, టీడీపీ తీరుతో అంతా తలకిందులైందని అన్నారు ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి. సమావేశాల ప్రారంభంలోనే గవర్నర్‌ని అవమానిస్తూ టీడీపీ సభ్యులు ఘోరాలకు పాల్పడ్డారని, అది చూసి ముఖ్యమంత్రి సహా అంతా ఆశ్చర్యపోయారని శ్రీకాంత్ రెడ్డి ఆక్షేపించారు. బడ్జెట్ సమావేశాలు ముగిసిన అనంతరం.. చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. వ్యవస్థలను నాశనం చేసింది చంద్రబాబే అని, టీడీపీ సభ్యులు పబ్లిసిటీ కోసం అసెంబ్లీలో గవర్నర్ ని సైతం అవమానపరిచారని గుర్తు చేశారు. ఆపై సభలోనూ టీడీపీ సభ్యులు సరిగా వ్యవహరించలేదు. ఏదైనా అనుమానం ఉంటే అడగాల్సింది. కానీ, వాళ్ల ప్రవర్తన చూశాక.. టీడీపీ అంటేనే ప్రజలు అసహ్యించుకుంటున్నారు. కేవలం సభలో అలజడి సృష్టించడానికే వాళ్లు వచ్చారు. సభలోకి వచ్చి గొడవ చేసి బయటకు వెళ్లిపోవడమే పనిగా పెట్టుకున్నారు. సభ జరిగినంత కాలం చిడతలు కొట్టడం, కాగితాలు చించటం చేశారు. పోనీ.. వారు వేసిన ప్రశ్నలకు సమాధానం కూడా చెప్పనీయకుండా చేశారు. ఇళ్ల పట్టాల మీద స్వల్ప కాలిక చర్చ పెడితే దానిలో కూడా మాట్లాడలేదు. తమ ఎల్లో మీడియా ద్వారా పోలవరం ఎత్తు తగ్గించారంటూ రచ్చ చేశారు. సరేనని దానిపై చర్చ పెడితే టీడీపీ సభ్యులు మాట్లాడలేదు. మద్యం పాలసీపై స్వల్ప కాలిక చర్చ పెడితే.. అందులోనూ పాల్గొనలేదు. ఆఖరికి.. అసెంబ్లీ హక్కుల గురించి చర్చ పెట్టినా వారు రాలేదు. ప్రతీ అంశంపై సీఎం జగన్ చాలా స్పష్టంగా వివరణ ఇచ్చారు. అసలు చర్చలపై పట్టుబట్టిందే వాళ్లు. కానీ, చర్చకు రాకుండా గొడవలు చేశారు అంటూ టీడీపీ తీరుపై అసహనం వ్యక్తం వ్యక్తం చేశారు ప్రభుత్వ చీఫ్ విప్. -
ఇది పేదవర్గాలకు వెల్ఫేర్.. చంద్రబాబుకి ఫేర్వెల్: సీఎం జగన్
సాక్షి, అమరావతి: తమది ప్రతిపక్షం ఆరోపిస్తున్నట్లు అంకెల గారడీ బడ్జెట్ కాదని, గత మూడేళ్లుగా ప్రజాసంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసమే మంచి బడ్జెట్ ప్రవేశపెట్టామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ముగింపు సెషన్ సందర్భంగా.. సంక్షేమ పథకాల క్యాలెండర్‌ను విడుదల చేశారాయన. ఈ సందర్భంగా.. సంక్షేమ పథకాల క్యాలెండర్‌ను స్వయంగా చదివి వినిపించిన అనంతరం సీఎం జగన్ మాట్లాడారు. ఇది పేద వర్గాలకు వెల్ఫేర్ క్యాలెండర్ అని.. ప్రతిపక్ష నేత చంద్రబాబుకు, ఆయనకు ఢంకా బజాయించే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5లకు ఏమాత్రం రుచించని క్యాలెండర్ అని, ఒకరకంగా గుబులు పుట్టించే క్యాలెండర్ అని వైఎస్ జగన్ చమత్కరించారు. పైగా ఇది చంద్రబాబుకు ఫేర్వెల్ క్యాలెండర్ అవుతుందని చెప్పారు సీఎం వైఎస్ జగన్. కరోనా లాంటి సమయంలోనూ.. ప్రజలకు సంక్షేమ ఫలాలు ఎక్కడా ఆగలేదని గుర్తు చేశారు సీఎం జగన్. ఎక్కడా కులం, మతం, ప్రాంతం, పార్టీలు కూడా చూడకుండా అందరూ మనవాళ్లే, అందరూ నా వాళ్లే అని నమ్మి ఈ ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తోందని స్పష్టం చేశారు. సంక్షేమ అభివృద్ధి పథకాల ఫలాలు.. ఎప్పుడు, ఏ నెలలో అమలు చేస్తున్నామో సందేహాలకు తావు లేకుండా ముందుకెళ్తున్నామని అన్నారాయన. పైగా లబ్ధిదారులు ప్లాన్ చేసుకునేందుకు వీలుగానే కాకుండా.. పారదర్శకంగా, అవినీతి, వివక్షకు లేకుండా ఏ నెలలో ఏ స్కీమ్ వస్తుందో చెబుతూ క్రమం తప్పకుండా అమలు చేస్తూ.. భరోసా ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తమదని సీఎం వైఎస్జగన్ అన్నారు. మంచి బడ్జెట్.. దేవుడి దయ.. ప్రజలందరి చల్లని దీవెనలు ప్రభుత్వానికి ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటున్నట్లు చెబుతూ ప్రసంగం ముగించారు. అనంతరం జనరంజకమైన ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2022-23ని రాష్ట్ర అసెంబ్లీ శుక్రవారం ఆమోదించిన స్పీకర్.. సభను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఏప్రిల్ 2022-2023 మార్చి సంక్షేమ పథకాల క్యాలెండర్ ► 2022.. ఏప్రిల్‌లో వసతి దీవెన, వడ్డీలేని రుణాలు ► మేలో విద్యా దీవెన, అగ్రి కల్చర్ ఇన్సూరెన్స్, రైతు భరోసా, మత్య్సకార భరోసా ► జూన్‌లో అమ్మ ఒడి పథకం ► జూలైలో విద్యా కానుక, వాహన మిత్ర, కాపు నేస్తం, జగనన్న తోడు. ► ఆగష్టులో విద్యా దీవెన, ఎంఎస్ఎంఈలకు ఇన్సెన్టివ్, నేతన్న నేస్తం. ► సెప్టెంబర్‌లో వైఎస్సార్ చేయూత ► అక్టోబర్‌లో వసతి దీవెన, రైతు భరోసా ► నవంబర్‌లో విద్యా దీవెన, రైతులకు వడ్డీలేని రుణాలు ► డిసెంబర్లో ఈబీసీ నేస్తం, లా నేస్తం పథకాలు ►2023.. జనవరిలో రైతు భరోసా, వైఎస్సార్ ఆసరా, జగనన్న తోడు పథకాలు ► ఫిబ్రవరిలో విద్యా దీవెన, జగనన్న చేదోడు పథకాలు ► మార్చిలో వసతి దీవెన అమలు -
చంద్రన్న కానుకలే ఈ చీప్ లిక్కర్ బ్రాండ్లు: సీఎం జగన్
సాక్షి, అమరావతి: చంద్రబాబు ఇంటి పేరు నారా బదులు సారా అని పెడితే బాగుంటుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. బుధవారం మద్యం పాలసీపై అసెంబ్లీ సమావేశాల్లో స్వల్పకాలిక చర్చ సందర్భంగా.. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను ప్రస్తుత ప్రభుత్వానికి రుద్దే ప్రయత్నం జరుగుతోందని సీఎం జగన్ వివరించారు. రాష్ట్రంలో 20 డిస్టిలరీలకుగానూ 14 డిస్టీలరీలకు అనుమతి ఇచ్చిన పాపం చంద్రబాబుదేనని, 2019 తర్వాత ఒక్క డిస్టిలరీకి గానీ, ఒక్క బ్రూవరీకిగాని తమ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని సీఎం జగన్ గుర్తు చేశారు. ‘‘నవరత్నాలు, అమ్మ ఒడి.. ఇవీ మా ప్రభుత్వ బ్రాండ్లు. ప్రెసిడెంట్ మెడల్, గవర్నర్ ఛాయిస్ భూంభూం బీర్, పవర్ స్టార్ 999, 999 లెజెండ్.. బ్రాండ్లన్నీ చంద్రన్న కానుకలే. ఇవన్నీ చంద్రబాబు ఆశీస్సులతో వచ్చిన బ్రాండ్లే. ప్రెసిడెంట్ మెడల్ బ్రాండ్.. చంద్రబాబు మెడల్ బ్రాండ్. గవర్నర్ ఛాయిస్ 2018, నవంబర్ 5న అనుమతి ఇచ్చింది చంద్రబాబే. ఆయన దిగిపోయే చివరి క్షణం వరకు లిక్కర్ బ్రాండ్లకు అనుమతులు ఇస్తూనే ఉన్నారు. చంద్రబాబు హయాంలోనే 254 బ్రాండ్లు వచ్చాయి. ఇవన్నీ ఆయన ట్రేడ్ మార్క్ బ్రాండ్లు. కానీ, ఈ బ్రాండ్లను మేం క్రియేట్ చేసినట్లుగా ప్రచారం చేస్తున్నారు. స్పెషల్ స్టేటస్, త్రీ క్యాపిటల్ అంటూ తప్పుడు లేబుల్స్‌తో ప్రచారం చేసిన ఘనత కూడా టీడీపీ నేతలదేనని సీఎం జగన్ అన్నారు. ‘‘2019 తర్వాత మా ప్రభుత్వం ఒక్క బ్రాండ్‌కు కూడా అనుమతి ఇవ్వలేదు. మేం అమ్మే బ్రాండ్లన్నీ లైసెన్స్డ్ డిస్టిలరీస్ నుంచి వచ్చినవే. మనిషి పరంగా చంద్రబాబు, పార్టీపరంగా టీడీపీ , మరో వైపు ఎల్లో మీడియా ఇవే అసలు సిసలైన చీప్ బ్రాండ్స్. ఏ షాపు నుంచి తీసుకొచ్చారో ఆధారాలు లేకుండా శాంపిల్స్ టెస్టింగ్‌కు ఇచ్చారు. ఇక్కడ శాంపిల్స్‌లో ట్యాంపరింగ్ కూడా చేసి ఉండొచ్చు కదా. వారు ఇచ్చిన లైసెన్స్డ్ డిస్టిలరీస్ నుంచే మద్యం విక్రయిస్తున్నాం. అప్పుడు అది విషంగా ఎలా మారుతుంది?’’ అని ప్రశ్నించారు సీఎం జగన్. మా ప్రభుత్వం 16 మెడికల్ కాలేజీలకు అనుమతిస్తే.. డిస్టిలరీలకు అనుమతి ఇచ్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని, జంగారెడ్డిగూడెం మరణాలపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని, సహజ మరణాలను కల్తీ సారా మరణాలుగా చంద్రబాబు చిత్రీకరిస్తున్నారంటూ సీఎం జగన్ ఆక్షేపించారు. టీడీపీ నేతలవి క్రిమినల్ బ్రెయిన్స్ అని, వాళ్లందరినీ జూలో పెట్టడమే కరెక్ట్ అంటూ సీఎం జగన్ చమత్కరించారు. పీఎంకే డిస్టిలరీస్ యనమల వియ్యంకుడిది కాదా?, శ్రీకృష్ణ డిస్టిలరీస్ ఆదికేశవులనాయుడిది కాదా? విశాల డిస్టిలరీస్ ఎవరిది? అయ్యన పాత్రుడిది కాదా? అని సీఎం జగన్.. సభాముఖంగా నిలదీశారు. -
వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబుతో ఇంటర్వ్యూ
-
Live Blog: ఏడో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు
-
AP: మారని తీరు.. అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్
సాక్షి, అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపక్ష తెలుగు దేశం తీరు తీరు మారడం లేదు. పదేపదే సభను అడ్డుకోవడంతో స్పీకర్ తమ్మినేని సీతారాం చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో ఇవాళ పదకొండు మంది టీడీపీ ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్ చేశారు. అంతకు ముందు.. అసెంబ్లీలో టీడీపీ సభ్యులు హుందాగా ప్రవర్తించాలంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హితవు పలికారు. అయినా వాళ్ల తీరు మారలేదు. స్పీకర్ పోడియం చుట్టు ముట్టి నిరసన తెలియజేశారు. హుందాగా వ్యవహరించాలని.. ఇటు సీఎం జగన్, అటు స్పీకర్ సైతం కోరినా టీడీపీ సభ్యులు వెనక్కు తగ్గలేదు. దీంతో ఏపీ శాసన సభ నుంచి 11 మంది టీడీపీ సభ్యులను ఒక్కరోజు సస్పెండ్ చేశారు స్పీకర్ సీతారాం. టీడీపీ సభ్యులు అశోక్ బెందాళం, ఆదిరెడ్డి భవాని, చినరాజప్ప, గణబాబు, భోగేశ్వరరావు, రామకృష్ణబాబు, రామరాజు, గొట్టిపాటి రవి, ఏలూరు, సాంబశివరావు, సత్యప్రసాద్‌లను సస్పెండ్ అయినవాళ్లలో ఉన్నారు. అంతకుముందు సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. సభలో టీడీపీ సభ్యులు వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు. -
ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా
-
ఎన్టీఆర్‌ను గుర్తు చేస్తూ.. చంద్రబాబుపై ఫైర్ అయిన కొడాలి నాని
సాక్షి, అమరావతి: అసెంబ్లీలో టీడీపీ అధినేత చంద్రబాబుపై పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు ఎన్టీఆర్ మద్య నిషేధం అమలు చేస్తే, దానికి తూట్లు పొడిచి చంద్రబాబు తన పాలనలో ఇష్టారాజ్యంగా మద్యం అమ్మకాలు పెంచారని అన్నారు. ఎక్కడ పడితే అక్కడ బెల్ట్‌షాప్‌లు ఏర్పాటు చేయించి, మద్యం అమ్మకాలు పెంచి, అంతులేని అవినీతికి పాల్పడ్డాడని విమర్శించారు. ఈరోజు కూడా ఎల్లో మీడియా, ఈనాడు జంగారెడ్డిగూడెం ఘటనను తప్పు పట్టిస్తూ, ప్రజల్లో అపోహలు కల్పించే విధంగా కథనం రాసిందని మండిపడ్డారు. రామోజీరావు ఆ స్థాయికి దిగజారాడని ఆరోపించారు. చంద్రబాబు శవ రాజకీయం చేస్తున్నారు. ఏ మాత్రం బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్న టీడీపీ సభ్యులను సస్పెండ్ చేయాలన్నారు. -
AP: రేపటికి ఏపీ అసెంబ్లీ వాయిదా
-
ఈనెల 15న వైఎస్సార్సీపీ శాసనసభాపక్ష సమావేశం
సాక్షి, అమరావతి: ఈనెల 15వ (మంగళవారం) తేదీన వైఎస్సార్సీపీ శాసనసభాపక్ష సమావేశం జరుగనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. మంగళవారం మధ్యాహ్నం అసెంబ్లీలోని కమిటీ హాల్-1లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం జగన్ భేటీ కానున్నారు. -
భారీ కేటాయింపులు..పేదల సొంతింటి కలకు రూ.4,791కోట్లు
సాక్షి, అమరావతి: నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం 2022–23 బడ్జెట్లో రూ.4,791.69 కోట్ల నిధులు కేటాయించింది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీకి కట్టుబడి అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఇళ్లులేని నిరుపేదలు ఉండరాదన్న లక్ష్యంతో సీఎం జగన్ ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం ప్రవేశపెట్టారు. పథకం కింద రెండు దశల్లో 28.30 లక్షల ఇళ్లను రూ.50,944 కోట్లతో ప్రభుత్వం నిర్మిస్తోంది. తొలి దశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణం రూ.28,084 కోట్లతో జరుగుతోంది. వీటిలో 10.88 లక్షల ఇళ్లు ప్రస్తుతం పునాది దశలో ఉన్నాయి. 2.50 లక్షల ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణాలు కొనసాగుతున్నాయి. 21.7 కోట్ల పనిదినాల సృష్టి రాష్ట్రవ్యాప్తంగా ఎన్నడూలేని విధంగా తొలిదశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టడం ద్వారా 21.7 కోట్ల పనిదినాలు కల్పించారు. తద్వారా ఇప్పటివరకూ ఇళ్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు ప్రభుత్వం రూ.1,146.7 కోట్లు చెల్లించింది. అదేవిధంగా ఒక్కో లబ్ధిదారురాలికి 3 శాతం వడ్డీతో రూ.35వేల రుణాన్ని ప్రభుత్వం బ్యాంకుల ద్వారా ఇప్పిస్తోంది. రుణ విముక్తి.. ఇక 2011కు ముందు గృహ నిర్మాణ సంస్థ ద్వారా రుణసాయంతో ఇళ్లు నిర్మించుకున్న వారికి జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కింద రుణ విముక్తి కల్పిస్తున్నారు. అదే విధంగా లబ్ధిదారులకు స్పష్టమైన టైటిల్, స్వాధీన హక్కుతో ఇళ్లను రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నారు. రుణాలు పొందకుండా ఇళ్లు నిర్మించుకున్న వారికీ హక్కులు కల్పిస్తున్నారు. ఇప్పటివరకూ 8.56 లక్షల మంది పథకం ద్వారా లబ్ధిపొందారు. సచివాలయాలకు పెరిగిన కేటాయింపులు సాక్షి, అమరావతి: గ్రామ సచివాలయాలకు ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్ కేటాయింపులను బాగా పెంచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ శాఖకు ప్రభుత్వం ఖర్చు రూ.2,890.26 కోట్లు ఉండగా వచ్చే ఏడాదికి రూ.3,396.25 కోట్లకు పెంచింది. ఇందులో గ్రామ సచివాలయాలు, శాఖ ప్రధాన కార్యాలయాల నిర్వహణ ఖర్చులతోపాటు గ్రామ సచివాలయ ఉద్యోగుల జీతభత్యాలు, గ్రామ వలంటీర్ల గౌరవ వేతనం వంటి ఖర్చులు కలిసి ఉంటాయి. గ్రామ సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగుల ప్రొబేషనరీ ప్రకటన కసరత్తును జూన్ నెలాఖరుకల్లా పూర్తిచేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. ప్రొబేషనరీ ప్రకటనతో అర్హులైన గ్రామ సచివాలయాల ఉద్యోగులకు జీతాలు పెరిగే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ శాఖకు బడ్జెట్ కేటాయింపులను కూడా పెంచినట్టు అధికారులు వెల్లడించారు. వార్డు సచివాలయ ఉద్యోగులకు వార్డు వలంటీర్లకు వేరుగా మునిసిపల్ శాఖ నుంచి ప్రభుత్వం వేరుగా మరికొన్ని నిధులను కేటాయించింది. -
AP Budget 2022-23: ప్రజారోగ్యానికి పెద్దపీట
ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో వైద్య ఆరోగ్య శాఖకు భారీగా కేటాయింపులు చేసింది. 2021–22తో పోలిస్తే 11.23 శాతం అదనంగా నిధులు కేటాయించింది. గత బడ్జెట్లో రూ.13,830.43 కోట్లు కేటాయించగా ఈసారి రూ.15,384.26 కోట్లకు పెంచింది. దాదాపు కోటిన్నర కుటుంబాలను ఆదుకుంటున్న అపర సంజీవని లాంటి డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకానికి రూ.2 వేల కోట్లు, వైఎస్సార్ ఆరోగ్య ఆసరాకు రూ.300 కోట్లు బడ్జెట్లో కేటాయించారు. గతేడాదితో పోలిస్తే ఆరోగ్యశ్రీ, ఆసరా కోసం రూ.541.06 కోట్లు అదనంగా కేటాయించడం గమనార్హం. ►నాడు–నేడుతో ఆస్పత్రులు బలోపేతం నాడు–నేడు ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల ముఖచిత్రం మారిపోయింది. కొత్త భవనాల నిర్మాణం, మరమ్మతుల కోసం రూ.1,603 కోట్లు, వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల అప్‌గ్రేడ్ కోసం రూ.350 కోట్లు కేటాయించారు. మౌలిక వసతుల కల్పనకు రూ.500 కోట్లు ప్రభుత్వం వెచ్చించనుంది. కరోనాకు ఉచిత వైద్యం కరోనా బాధితులు వైద్యం కోసం ఆర్థిక ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం అండగా నిలిచింది. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా దేశంలో తొలిసారిగా అర్హతతో సంబంధం లేకుండా అందరికీ ఉచిత వైద్యం అందించింది. ఇప్పటివరకూ రాష్ట్ర వ్యాప్తంగా 2,09,765 మందికి చికిత్స కోసం రూ.732.16 కోట్లు ఖర్చు చేసింది. తొలగిన చీకట్లు.. రాష్ట్రంలో 5.6 కోట్ల మందికి ఉచితంగా సమగ్ర, నాణ్యమైన కంటి సంరక్షణ సేవలు అందించేందుకు ప్రభుత్వం వైఎస్సార్ కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించింది. రెండు దశల్లో విద్యార్థులకు కంటి పరీక్షలు చేశారు. మూడో దశలో 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు వైద్య పరీక్షలు చేస్తున్నారు. ఇప్పటి వరకూ 16,64,919 మందికి కంటి పరీక్షలు నిర్వహించి సమస్యలున్న 8.50 లక్షల మందికి కళ్లద్దాలు పంపిణీ చేయడంతో పాటు 1.55 లక్షల మందికి శస్త్ర చికిత్సలు చేశారు. -
పారిశ్రామిక రంగం ఇక పరుగులే.. గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి పరుగులు పెట్టేందుకు వీలుగా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బడ్జెట్లో పలు ప్రతిపాదనలు చేశారు. పరిశ్రమలు, పారిశ్రామిక మౌలిక వసతులు, ఐటీ, నైపుణ్యాభివృద్ధికి కలిపి రికార్డు స్థాయిలో రూ.5,081.41 కోట్లు కేటాయించారు. గత ఏడాది కేటాయించిన రూ.4,779.1 కోట్లతో పోలిస్తే ఇది 6.32 శాతం అదనం. ఇందులో ఒక్క పారిశ్రామిక మౌలిక వసతులకే రూ.1,142.53 కోట్లు వ్యయం చేయనున్నారు. పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా రాష్ట్రంలో కొత్తగా మూడు పోర్టులు, తొమ్మిది ఫిషింగ్ హార్బర్లు, రెండు గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాలను అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఏపీ మారిటైం బోర్డు రూ.8,000 కోట్లు రుణం తీసుకోవడానికి కూడా అనుమతించారు. ఇందులో ఇప్పటికే రామాయపట్నం, భావనపాడు పోర్టు పనులకు టెండర్లు ఖరారు కాగా.. బందరు పోర్టుకు తాజాగా టెండర్లు పిలిచారు. అదే విధంగా విశాఖ వద్ద భోగాపురం, నెల్లూరు దగదర్తి వద్ద గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాలను అభివృద్ధి చేస్తున్నారు. ఇక పరిశ్రమలకు కావాల్సిన నైపుణ్యం కలిగిన విద్యార్థులను అందించడానికి ఏకంగా రూ.969.91 కోట్లు వ్యయం చేయనున్నట్లు కూడా మంత్రి ప్రకటించారు. పరిశ్రమల రంగానికి రూ.2,755.17 కోట్లు, ఐటీ రంగానికి రూ. 212.13 కోట్లు కేటాయించారు. ఎంఎస్ఎంఈలకు రూ.450 కోట్లు అత్యధిక మందికి ఉపాధి కల్పించే ఎంఎస్ఎంఈ రంగానికి ఇచ్చే ప్రోత్సాహకాల కోసం ఈ బడ్జెట్లో రూ.450 కోట్లు కేటాయించారు. అలాగే, ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు వైఎస్సార్ జగనన్న, వైఎస్సార్ బడుగు వికాసం కింద రాయితీలకు రూ.175 కోట్లు కేటాయించారు. ఐటీ రంగ కంపెనీల ప్రోత్సాహకాలకు రూ.60 కోట్లు, ఇతర పారిశ్రామిక ప్రోత్సాహకాలకు రూ.411.62 కోట్లు కేటాయిస్తూ బడ్జెట్లో ప్రతిపాదనలు చేశారు. ఏడీబీ నిధులతో అభివృద్ధి చేస్తున్న విశాఖ–చెన్నై కారిడార్‌లో వివిధ పనులకు రూ.611.86 కోట్లు కేటాయించారు. ఈ కారిడార్‌లో రహదారుల అభివృద్ధికి రూ.250 కోట్లు, ఏపీఐఐసీ మౌలిక సదుపాయాల కల్పనకు రూ.236.86 కోట్లు, విద్యుత్ సదుపాయాల కోసం రూ.125 కోట్లు వ్యయం చేయనున్నారు. ఎగుమతుల్లో ఏడు నుంచి నాలుగో స్థానానికి.. మరోవైపు.. 2019–20లో దేశ ఎగుమతుల్లో 7వ ర్యాంకులో ఉన్న రాష్ట్రం 2020–21 నాటికి 4వ ర్యాంకుకు చేరుకుందని, 16.8 బిలియన్ డాలర్లుగా ఉన్న రాష్ట్ర ఎగుమతులను 2030 నాటికి రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. వైఎస్సార్ నవోదయం కింద రూ.7,976 కోట్ల విలువైన ఎంఎస్ఎంఈ ఖాతాలను పునర్వ్యవస్థీకరణ చేసినట్లు మంత్రి వెల్లడించారు. ప్రస్తుత ఏడాదిలో వెనుకబడిన, షెడ్యూల్ తరగతులకు చెందిన పరిశ్రమలకు రూ.671 కోట్ల ప్రోత్సాహకాలు విడుదల చేశారు. వైఎస్సార్ ఈఎంసీ ప్రారంభం ఐటీ, ఎలక్ట్రానిక్ రంగంలో పెట్టుబడులు ప్రోత్సహించే విధంగా కొప్పర్తిలో వైఎస్సార్ ఈఎంసీని సీఎం జగన్ గత ఏడాది డిసెంబర్ 23న ప్రారంభించారని బుగ్గన చెప్పారు. ఇప్పటికే ఇక్కడ రూ.660 కోట్లతో 9,000 పైచిలుకు ఉద్యోగాలు కల్పించడానికి పలు కంపెనీలు ముందుకు వచ్చాయన్నారు. ఈ రంగంలో వచ్చే మూడేళ్లలో రూ.4,000 కోట్ల పెట్టుబడితో 25,000 మందికి ఉపాధి కల్పించే కంపెనీలు రానున్నాయన్నారు. పారిశ్రామిక రంగానికి రాష్ట్ర ప్రభుత్వం తన తాజా బడ్జెట్లో ఇలా భారీ కేటాయింపులు చేయడంపై పారిశ్రామిక సంఘాలు హర్షం వ్యక్తంచేస్తున్నాయి. రాష్ట్రానికి భారీ పరిశ్రమలు రాష్ట్రంలో పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని బుగ్గన రాజేంద్రనాథ్ తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31 నాటికి రాష్ట్రంలో 7,107 ఎంఎస్ఎంఈ యూనిట్ల ద్వారా రూ.2,099 కోట్ల పెట్టుబడులతో పాటు 46,811 మందికి ఉపాధి లభించిందన్నారు. అలాగే, జనవరి 31, 2022 నాటికి 11 మెగా ప్రాజెక్టులు ఏర్పాటుకావడం ద్వారా 3,989 మందికి ఉపాధి లభించినట్లు తెలిపారు. మరో 55 భారీ ప్రాజెక్టులు రూ.44,097 కోట్ల పెట్టుబడులను పెట్టడానికి ముందుకొస్తున్నాయన్నారు. వీటిద్వారా 93,116 మందికి ఉపాధి లభిస్తుందన్నారు. ఆర్థిక వృద్ధికి దోహదం చేసే బడ్జెట్ రాష్ట్ర ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చే విధంగా పలు అభివృద్ధి పథకాలను ప్రకటించారు. ముఖ్యంగా రాష్ట్ర వృద్ధిలో కీలకమైన ఎంఎస్ఎంఈ రంగానికి పెద్దపీట వేయడంతో పాటు భోగాపురం ఎయిర్‌పోర్టు, కర్నూలులో ఎయిర్‌పోర్టు సిటీ, రూ.6,400 కోట్లతో జిల్లా–మండల రహదారుల అనుసంధానం వంటి ప్రాజెక్టులను సీఐఐ స్వాగతిస్తోంది. రైతులకు వ్యవసాయ యంత్రాలను అద్దెకిచ్చే విధంగా రైతు భరోసా కేంద్రాల వద్ద 10,750 కస్టమ్ హైరింగ్ సెంటర్స్‌ను ఏర్పాటు చేయడం ఆహ్వానించదగ్గ నిర్ణయం. - నీరజ్ శరద, -చైర్మన్, సీఐఐ, ఏపీ చాప్టర్ గ్రామీణాభివృద్ధికి పెద్దపీట గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేసి వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించే విధంగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. పరిశ్రమల రంగానికి రూ.2,755.17 కోట్లు, విద్యుత్ రంగానికి రూ.10,000 కోట్లు కేటాయించడాన్ని ఆహ్వానిస్తున్నాం. కోవిడ్ సంక్షోభం నుంచి త్వరగా కోలుకునే విధంగా ప్రభుత్వం తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తాయి. - సీవీ అచ్యుతరావు, అధ్యక్షుడు, ఫ్యాప్సీ -
బడ్జెట్లో బీసీలకు ప్రత్యేక ప్యాకేజీ: ఆర్. కృష్ణయ్య హర్షం
సాక్షి, అమరావతి: దేశంలో మరే రాష్ట్రంలోనూ లేనివిధంగా ఏపీ బడ్జెట్లో వెనుకబడిన తరగతుల(బీసీల) అభివృద్ధికి ఏకంగా రూ.28 వేల కోట్లు కేటాయించడం చరిత్రాత్మకమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య స్పష్టం చేశారు. బడ్జెట్‌పై శుక్రవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ.. దేశంలో బీసీ ముఖ్యమంత్రులున్న రాష్ట్రాల్లోనూ బీసీలకు రూ.5 వేల కోట్లకు మించి కేటాయింపులు చేయలేదని గుర్తు చేశారు. అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో బీసీల సంక్షేమానికి కేవలం రూ.4 వేల కోట్లు మాత్రమే కేటాయిచారన్నారు. కేంద్ర ప్రభుత్వం బీసీల సంక్షేమానికి నామమాత్రంగానే నిధులు కేటాయించిందన్నారు. అందుకు విరుద్ధంగా ఏపీలో జనాభా ప్రాతిపదికన బీసీలకు ఏకంగా రూ.28 వేల కోట్లను బడ్జెట్లో కేటాయించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ధైర్యసాహసాలకు సలామ్ చేస్తున్నానన్నారు. ఇప్పటికే బీసీ కులాల అభివృద్ధికి 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం, నామినేటెడ్ పదవులు, నామినేటెడ్ పనుల్లో 50 శాతం వాటా ఇవ్వడం సీఎం వైఎస్ జగన్ గొప్ప దార్శనికతకు అద్దం పడుతోందన్నారు. అమ్మ ఒడి, విద్యా దీవెన వంటి విప్లవాత్మక పథకాలతో బీసీ, అట్టడుగు వర్గాల్లో సామాజిక, ఆర్థిక, రాజకీయ చైతన్యానికి సీఎం జగన్ కృషి చేస్తున్నారని కితాబిచ్చారు. -
సుస్థిరాభివృద్ధికి నాలుగు స్తంభాలు
సాక్షి, అమరావతి: కరోనా వంటి సంక్షోభాలను ఎదుర్కొంటూ సుస్థిరాభివృద్ధిని సాధించే దిశగా 2022–23 ఆర్థిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నట్లు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పేర్కొన్నారు. మానవ సామర్థ్యం అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, జీవనోపాధికి మద్దతు, సామాజిక భద్రత లక్ష్యాలను నవరత్నాలతో ఏకీకరణ చేయడం ద్వారా లక్ష్యాలను చేరుకుంటున్నట్లు తెలిపారు. సుస్థిరాభివృద్ధికి ఈ నాలుగు స్తంభాలు కీలకం అని చెప్పారు. శుక్రవారం ఆయన వార్షిక బడ్జెట్ సందర్భంగా మాట్లాడుతూ.. ఎస్డీజీ ఇండియా 2020–21 నివేదిక ప్రకారం పేదరిక నిర్మూలన, స్వచ్ఛమైన నీరు–పారిశుద్ధ్యాన్ని పెంపొందించడం, లింగ సమానత్వం, చౌకగా సుస్థిర శక్తి – సముద్ర జలజీవుల పరిరక్షణ వంటి అంశాల్లో రాష్ట్రం 5వ స్థానంలో ఉందన్నారు. నాడు–నేడు, జగనన్న అమ్మ ఒడి, గోరుముద్ద, విద్యాకానుక, విద్యా దీవెన, వసతి దీవెన, వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్సార్ వైద్య శాలలు, వైద్య కళాశాలలు, ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా వంటి కార్యక్రమాల ద్వారా రాష్ట్రంలో మానవ సామర్థ్యాభివృద్ధికి పెద్ద పీట వేస్తున్నామన్నారు. వైఎస్సార్ జలయజ్ఞం, వైఎస్సార్ జలకళ, రహదారుల అభివృద్ధి, కొత్త ఓడరేవులు, నౌకాశ్రయాలు, వ్యవసాయం–పాడి పరిశ్రమలో మౌలిక సదుపాయాల కల్పన, జగనన్న కాలనీలు, వైఎస్సార్ హౌసింగ్ వంటి కార్యక్రమాల ద్వారా రాష్ట్రంలో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. మంత్రి బుగ్గనకు బడ్జెట్ పత్రాలతో కూడిన బ్యాగ్‌ను అందజేస్తున్న ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు జీవనోపాధి విషయానికి వస్తే వైఎస్సార్ రైతు భరోసా, వైఎస్సార్ మత్స్యకార భరోసా, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ జలకళ, ధరల స్థిరీకరణ నిధి, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, పాల శీతలీకరణ కేంద్రాలు, ఆక్వా రైతులకు విద్యుత్ రాయితీ వంటి పథకాలతో రాష్ట్రంలో 62 శాతం ఆధారపడి ఉన్న వ్యవసాయ రంగాన్ని ప్రభుత్వం సమగ్ర దృష్టితో అభివృద్ధి చేస్తోందన్నారు. సామాజిక భద్రతలో భాగంగా వైఎస్సార్ పెన్షన్ కానుక కింద 61.74 లక్షల మందికి ప్రతి నెలా ఠంచన్‌గా పింఛన్ చొప్పున వృద్ధాప్య ఫించన్ అందిస్తున్నట్లు తెలిపారు. కోవిడ్ వంటి సంక్షోభాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమర్థవంతంగా ఎదుర్కొన్నారని చెప్పారు. ఇందుకు సహకరించిన అన్ని విభాగాలకు ధన్యవాదాలు చెప్పారు. బుగ్గన ఇంకా ఏమన్నారంటే.. వ్యవసాయానికి పెద్ద పీట ►వైఎస్సార్ రైతు భరోసా–పీఎం కిసాన్ యోజన కింద ఇప్పటి వరకు రూ.20,117.59 కోట్లు ప్రత్యక్ష నగదు బదిలీ కింద నేరుగా రైతుల ఖాతాలో జమ చేశాం. ఈ పథకం కోసం 2022–23 ఏడాదికి రూ.3,900 కోట్లు కేటాయింపును ప్రతిపాదిస్తున్నాం. ►వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం కింద గత ప్రభుత్వ బకాయిలను కూడా కలిపి ఇప్పటి వరకు రూ.3,702.02 కోట్లు రైతుల ఖాతాలో వేశాం. ఈ పథకం కోసం బడ్జెట్లో రూ.1,802 కోట్లు కేటాయిస్తున్నాం. ►వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల కింద గత ప్రభుత్వ బకాయిలతో కలిపి ఇప్పటికే రూ.1,185 కోట్లు ఇవ్వగా, బడ్జెట్లో వచ్చే ఏడాది కోసం రూ.500 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. రైతు భరోసా కేంద్రాలకు రూ.50 కోట్లు, ధరల స్థిరీకరణ నిధికి కేంద్ర కేటాయింపులకు అదనంగా రూ.500 కోట్లు, వైఎస్సార్ వ్యవసాయ పరీక్షా కేంద్రాలకు రూ.50 కోట్లు, ఉచిత విద్యుత్‌కు రూ.5,000 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. వ్యవసాయ యాంత్రీకరణకు పెద్ద పీట వేయడంతో పాటు పశు సంవర్థక, మత్స్య అభివృద్ధికి రూ.1,568.83 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. వైద్య రంగానికి గత ఏడాది కంటే 11.23 శాతం అధికం ►నీతి ఆయోగ్ వైద్య సూచిక 2021 నివేదిక ప్రకారం రెండేళ్ల క్రితం నాల్గవ స్థానంలో ఉన్న రాష్ట్రం ఇప్పుడు రెండో స్థానానికి చేరుకుంది. రూ.1,000 కంటే ఎక్కువ ఖర్చు అయ్యే చికిత్సలకు ఉచిత వైద్యాన్ని అందిస్తున్నాం. ►ఇప్పటికే 1.4 కోట్ల వైఎస్సార్ ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డులు జారీ చేశాం. దీంతో 2019–20లో ఆరోగ్య బీమా పరిధిలోకి వచ్చే కుటుంబాల శాతం 74.6 నుంచి 2021–22 నాటికి 91.27 శాతానికి చేరుకుందని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 4వ విడత నివేదికలో పేర్కొంది. ►వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కింద రూ.489.61 కోట్లు, ఆరోగ్యశ్రీ కింద కోవిడ్ బాధితులకు రూ.732.16 కోట్లు చికిత్స వ్యయాన్ని ప్రభుత్వం భరించింది. 2022–23లో వైఎస్సార్ ఆరోగ్యశ్రీకి రూ.300 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. ►104లను మండలానికి ఒకటి చొప్పున 292 నుంచి 656కు పెంచాం. 560 వైఎస్సార్ పట్టణ క్లినిక్‌లను మంజూరు చేశాం. గిరిజన ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడం కోసం సీతమ్మపేట, పార్వతీపురం, ఆర్‌సీవరం, బుట్టాయిగూడెం, దోర్నాలలో ఐదు మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులతో పాటు పాడేరులో గిరిజన వైద్య కళాశాల మంజూరు చేశాం. ►2022–23 సంవత్సరానికి ఆరోగ్యం, వైద్యం, కుటుంబ సంక్షేమం కోసం రూ.15,384.26 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. ఇది గత బడ్జెట్ ప్రతిపాదన కంటే 11.23 శాతం అధికం. చిన్నారుల సంక్షేమమే లక్ష్యం ►గిరిజన ప్రాంతాల్లోని పిల్లలకు పోషకాహార నాణ్యత పెంపునకు వైఎస్సార్ సంపూర్ణ పోషణ.. సంపూర్ణ పోషణ ప్లస్ పథకాలపై కేంద్ర ప్రభుత్వ కేటాయింపుల కంటే రూ.1,560 కోట్లు అదనంగా వ్యయం చేశాం. ►కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల బాధ్యతను ప్రభుత్వం స్వీకరించింది. ఒక్కో చిన్నారికి రూ.10 లక్షల చొప్పున 298 మందికి పరిహారం ఇచ్చాం. వైఎస్సార్ స్వేచ్ఛ కార్యక్రమం ద్వారా కౌమార దశలో ఉన్న బాలికలకు నెలకు 10 బ్రాండెడ్ శానిటరీ నా‹ప్కిన్లను ఉచితంగా అందిస్తున్నాం. మహిళా పక్షపాతం ►కేవలం రెండేళ్లలో లింగ సమానత్వ సూచీలోరాష్ట్ర ప్రభుత్వం 12 ర్యాంకులు మెరుగు పరుచుకొని 5వ స్థానానికి చేరుకుంది. వైఎస్సార్ ఆసరా కింద ఇప్పటి వరకు రూ.12,757.97 కోట్లు స్వయం సహాయక సంఘాలకు విడుదల చేశాం. ఈ పథకానికి 2022–23లో రూ.6,400 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. ►స్వయం సహాయక సంఘాలకు సున్నా వడ్డీ కింద ఇప్పటి వరకు రూ.1,789 కోట్లు చెల్లించగా, బడ్జెట్లో రూ.800 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. చేయూత పథకానికి రూ.4,235.95 కోట్లతో పాటు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖకు రూ.4,322.86 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. సంక్షేమ ప్రభుత్వం ►పేదల సంక్షేమానికి ఈ ప్రభుత్వం పెద్ద పీట వేస్తోంది. ఎన్నికలకు ముందు కొంత మందికి పెన్షన్ పెంచిన వారికి ఇప్పుడు మాట్లాడటానికి అర్హత లేదు. 60 ఏళ్లు దాటిన వృద్ధులకు నెలకు రూ.2,500 చొప్పున ఇవ్వడానికి వైఎస్సార్ పింఛన్ పథకం కోసం 2022–23 సంవత్సరానికి రూ.18,000 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. ►వైఎస్సార్ బీమా పథకం కోసం రూ.372.12 కోట్లు, వైఎస్సార్ వాహన మిత్ర కోసం రూ.260 కోట్లు, వైఎస్సార్ నేతన్న నేస్తం కోసం రూ.200 కోట్లు, తోపుడు బండ్ల వారి కోసం జగనన్న తోడుకు రూ.25 కోట్లు, రజకులు–కుట్టుపని–నాయిబ్రాహ్మణులకు జగనన్న చేదోడు కోసం రూ.300 కోట్లు, వైఎస్సార్ ఈబీసీ నేస్తం కోసం రూ.590 కోట్లు, వైఎస్సార్ లా నేస్తం కు రూ.15 కోట్లు, వైఎస్సార్ కాపు నేస్తం కోసం రూ.500 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. ►అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమానికి, షెడ్యూల్డ్ కులాల ఉప ప్రణాళిక కోసం రూ.18,518 కోట్లు, షెడ్యూల్డ్ తెగల ఉప ప్రణాళిక కోసం రూ.6,145 కోట్లు, వెనుకబడిన తరగతుల ఉప ప్రణాళిక కోసం 29,143 కోట్లు, అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమం కోసం రూ.3,661 కోట్లు, కాపు సంక్షేమానికి రూ.3,537 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. -
మొన్న గవర్నర్.. నేడు బుగ్గనపై గురి!
సాక్షి, అమరావతి: అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బడ్జెట్ ప్రసంగానికి ప్రతిపక్ష టీడీపీ సభ్యులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. గవర్నర్ ప్రసంగ సమయంలో వ్యవహరించిన మాదిరిగానే మరోసారి అడ్డంకులు కల్పించేందుకు విపక్షం పక్కా ప్రణాళికతో సభకు వచ్చింది. సభ ప్రారంభం కాగానే టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్లకార్డులు, కాగితాలు పంచడంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు బాల వీరాంజనేయ స్వామి, వెలగపూడి రామకృష్ణబాబు, అనగాని సత్యప్రసాద్ రన్నింగ్ కామెంటరీ చేస్తూ బడ్జెట్ ప్రసంగానికి పదేపదే అడ్డుతగిలారు. పిల్లలు, మహిళా సంక్షేమం గురించి బుగ్గన బడ్జెట్ ప్రతిపాదనలు చదువుతున్న తరుణంలో వీరాంజనేయ స్వామి రన్నింగ్ కామెంటరీ చేయడంతో అధికార పార్టీ సభ్యులు గట్టిగా బదులు ఇచ్చారు. ఈ దశలో సభాపతి జోక్యం చేసుకుని రన్నింగ్ కామెంటరీ సరికాదని హెచ్చరించారు. ఏదైనా చెప్పదల్చు కుంటే బడ్జెట్‌పై చర్చలో చెప్పవచ్చని టీడీపీ సభ్యులకు సూచించారు. ఆర్థికమంత్రి బుగ్గన కొద్దిసేపు తన బడ్జెట్ ప్రసంగాన్ని ఆపి టీడీపీ సభ్యుల ప్రవర్తనను తప్పుబట్టారు. మొన్న గవర్న ర్‌పై దాడి చేశారని, ఇప్పుడు బడ్జెట్‌పై అందులోనూ మహిళా సంక్షేమంపై మాట్లాడుతుంటే విపక్షం వ్యవహరిస్తున్న తీరు వారి ఆలోచనా విధానాన్ని తెలియచేస్తోందని ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా బడ్జెట్ ప్రసంగానికి దాదాపు పది నిమిషాలు అంతరాయం కలిగింది. చదవండి: (మరో ముందడుగు: రూ.2,56,256.56 కోట్లతో వార్షిక బడ్జెట్) -
ఏపీ బడ్జెట్: మరో ముందడుగు
ఏ కుటుంబానికైనా ఆరోగ్యం, విద్య అత్యంత ముఖ్యం. పిల్లలను బాగా చదివించుకోవడానికి సహకారం అందడం.. ఎప్పుడైనా దురదృష్టవశాత్తు ఏదైనా జబ్బు బారిన పడితే ఆదుకునే వారుండటం.. సింహ భాగం ప్రజలు ఆశించేది ఇంతే. దీనికి జీవనోపాధి కల్పన కూడా తోడయితే మహానందమే. ఇంకా సామాజిక భద్రత కూడా లభిస్తే.. రైతన్న ముఖంలో చెరగని చిరునవ్వు కనిపిస్తే.. శరవేగంగా అభివృద్ధికి రూట్ మ్యాప్ సిద్ధమై అమలైతే.. ఏ విషయంలోనూ మన అక్కచెల్లెమ్మలు తక్కువ కాదంటూ వారికి అన్నింటా పెద్ద పీట వేస్తే.. అన్ని రంగాలు అభివృద్ధి వైపు దౌడు తీసేలా నిధుల కేటాయింపు జరిగితే.. ఎక్కడైనా ఇవన్నీ సాకారం అయ్యేలా అడుగులు పడుతున్నాయంటే అక్కడ జనరంజక పాలన సాగుతున్నట్టే.. పేదరికాన్ని జయించడానికి బాణం ఎక్కు పెట్టినట్టే.. సరిగ్గా రాష్ట్రంలో ఇప్పుడదే జరుగుతోంది. ఇవాళ్టి బడ్జెట్లో మన కళ్లెదుట సాక్షాత్కరించింది. సాక్షి, అమరావతి : రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమంతో పాటు అన్ని రంగాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం జనరంజక బడ్జెట్‌ను శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశ పెట్టింది. అభివృద్ధి, సంక్షేమం సమతుల్యతతో అన్ని వర్గాలకు అండగా నిలిచే విధంగా రూపొందించిన 2022–23 ఆర్థిక ఏడాదికి మొత్తం 2,56,256.56 కోట్ల రూపాయలతో వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ శాసనసభలో ప్రవేశ పెట్టారు. పేదరికాన్ని జయించడమే చాలా సమస్యల పరిష్కారానికి సరైన మార్గం అని, ఆ దిశగా బడ్జెట్ రూపకల్పన, నిధుల కేటాయింపు జరిగేలా సీఎం వైఎస్ జగన్ దిశా నిర్దేశం చేశారు. ఇందులో భాగంగానే లక్ష్య సాధనకు ఇంజన్‌లా పనిచేస్తున్న ఆరోగ్యం, విద్య, జీవనోపాధి, సామాజిక భద్రత అంశాలకు బడ్జెట్ సమ ప్రాధాన్యత ఇచ్చింది. మంచి ఆరోగ్యం ఉంటే అన్నీ సాధించడం సులభం అని జగన్ ప్రభుత్వం గట్టిగా నమ్మింది. ఇందు కోసం ప్రజారోగ్య రంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు బడ్జెట్లో ప్రాధాన్యత ఇచ్చారు. నాణ్యమైన విద్య అందించి మానవ సామర్థ్యాల అభివృద్ధిని సాకారం చేయాలనే లక్ష్యంతో విద్యా రంగానికి కేటాయింపులు చేశారు. నిర్దేశించుకున్న లక్ష్య సాధనకు అనుగుణంగా మౌలిక సదుపాయాల అభివృద్ధికి బడ్జెట్లో పెద్దపీట వేశారు. ప్రజలకు సముచిత పని కల్పించడం ద్వారా జీవనోపాధి అందించడం, ఆర్థికాభి వృద్ధిలో అన్ని వర్గాలకు భాగస్వామ్యం కల్పించడం, ఫలితంగా ప్రగతికి బాటలు వేయడానికి బడ్జెట్ రూపకల్పనలో అధిక ప్రాధాన్యత ఇచ్చారు. సమాజంలో అసమానతలు తగ్గించి ప్రజలందరికీ సామాజిక భద్రత కల్పించడాన్ని ప్రభుత్వం అత్యున్నత లక్ష్యంగా నిర్ధారించుకున్న విషయాన్ని బడ్జెట్ తీరు స్పష్టం చేస్తోంది. వివిధ సంక్షేమ పథకాలు, కార్యక్రమాల అమలు వెనక ఉన్న మూలాధార సూత్రాన్ని బడ్జెట్ ప్రతిబింబించింది. మహిళా సాధికారత దిశగా.. ►మహిళా సాధికారత లక్ష్యంగా ప్రత్యేకంగా జెండర్ బేస్డ్ బడ్జెట్‌ను రెండోసారి వరుసగా అసెంబ్లీకి సమర్పించారు. మహిళల కోసమే ప్రత్యేకంగా వ్యయం చేసేందుకు రూ.55,015.20 కోట్లు, పిల్లలు, చిన్నారుల కోసం ప్రత్యేకంగా రూ.16,903.17 కోట్లు కేటాయించారు. ►వైఎస్సార్ చేయూత కింద మహిళల కోసం రూ.4,235.95 కోట్లు, పొదుపు సంఘాల మహిళలకు వైఎస్సార్ ఆసరా కోసం రూ.6,400 కోట్లు కేటాయించారు. ►ఎన్నికల మేనిఫెస్టోలోని నవరత్నాలకు అవసరమైన నిధులను బడ్జెట్లో కేటాయించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికలకు, కాపులు, ఈబీసీల సంక్షేమానికి భారీ కేటాయింపులు చేస్తూనే మరో పక్క వ్యవసాయం, విద్య, వైద్యం, సాగునీటి మౌలిక రంగాలకు బడ్జెట్లో పెద్ద పీట వేశారు. ►స్థానిక అవసరాలు, ప్రాధాన్యతలకు అనుగుణంగా అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిలో సంక్షేమం పెంచడానికి, సామాజిక ఆర్థిక అభివృద్ధి కార్యక్రమాలను పెంచడానికి ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ నిధి కింద ప్రతి ఎమ్మెల్యే పరిధిలో రెండు కోట్ల రూపాయల నిధి చొప్పున రూ.350 కోట్లు బడ్జెట్లో కేటాయించారు. ►నవరత్నాల పథకాల అమలుకు తగినన్ని నిధులు కేటాయిస్తూ ఐదు కోట్ల ప్రజానీకాన్ని సంతృప్తి పరిచే స్థాయిలో బడ్జెట్ కేటాయింపులు చేశారు. బడ్జెట్లో ఎక్కడా దాపరికాలు లేకుండా పూర్తి పారదర్శకతను ప్రదర్శించారు. ఏ ఏ రంగాలకు ఏ ఏ వర్గాలకు ఏ ఏ పథకాలకు ఎన్ని నిధులు కేటాయించారో స్పష్టంగా బడ్జెట్లో వివరించారు. ఆ రంగాలకు పెద్దపీట ►విద్య, వైద్య, సంక్షేమ రంగాలకు కేటాయింపులు భారీగా పెంచారు. వైద్య, ఆరోగ్య రంగంలో నాడు–నేడు కింద మౌలిక సదుపాయాల కల్పనకు బడ్టెట్ కేటాయింపుల్లో ప్రాధాన్యత ఇచ్చారు. ఏ వర్గాన్నీ విస్మరిం చకుండా అన్ని వర్గాలకు కేటాయింపులు చేశారు. ఇచ్చిన మాట మేరకు ఆటో డ్రైవర్లకు, నాయీ బ్రాహ్మణులు, రజకులు, మత్స్య కారులు, దర్జీలు, చేనేత కార్మికులు, బ్రాహ్మణులు, లాయర్లు, చిరు వ్యాపారులకు బడ్జెట్లో కేటాయింపులు చేశారు. ►రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యవసాయ అనుబంధ రంగాలకు, ఆ రంగాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కలిపి వ్యవసాయ ప్రత్యేక బడ్జెట్లో రూ.43,052 కోట్లు కేటాయించారు. రైతుల సంక్షేమానికి పలు కేటాయింపులు చేశారు. వైఎస్సార్ రైతు భరోసా కోసం రూ.3,900 కోట్లు, వైఎస్సార్ ఉచిత పంటల బీమా కోసం రూ.1,802.04 కోట్లు కేటాయించారు. రైతులకు సున్నా వడ్డీ పంట రుణాల కోసం రూ.500 కోట్లు కేటాయించారు. ►విద్యా రంగానికి రూ.30,077.20 కోట్లు కేటాయించారు. ఈ రంగంలో నాడు–నేడు కోసం రూ.3,500 కోట్లు కేటాయించారు. ఆరోగ్య రంగానికి రూ.15,384.26 కోట్లు కేటాయించారు. ఇందులో వైఎస్సార్ ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్‌కు రూ.2,600 కోట్లు, ఆస్పత్రుల్లో నాడు–నేడు కోసం రూ.2,848.00 కోట్లు కేటాయించారు. సంక్షేమ పెన్షన్లకు భారీగా.. ►అన్ని రకాల సంక్షేమ పెన్షన్లకు భారీ కేటాయింపులు దక్కాయి. వైఎస్సార్ పెన్షన్ కానుక కింద బడ్జెట్లో రూ.18,000 కోట్లు కేటాయించారు. సాగునీటి ప్రాజెక్టులకు రూ.11,482.37 కోట్లు కేటాయించారు. పేదల గృహాల నిర్మాణాల కోసం రూ.4,791.69 కోట్లు, వివిధ రంగాల్లో సంక్షేమానికి రూ.45,955.07 కోట్లు కేటాయించారు. ►జగనన్న అమ్మ ఒడి పథకానికి రూ.6,500 కోట్లు, ఎస్సీ ఉప ప్రణాళికకు రూ.18,518 కోట్లు, ఎస్టీ ఉప ప్రణాళికకు రూ.6,145 కోట్లు, బీసీ ఉప ప్రణాళికకు రూ.29,143 కోట్లు, మైనారిటీ ఉప ప్రణాళికకు రూ.3,662 కోట్లు, కాపుల సంక్షేమానికి రూ.3,532 కోట్లు, ఈబీసీల సంక్షేమానికి రూ.6,669 కోట్లు బడ్జెట్లో కేటాయింపులు చేశారు. గ్రామీణాభివృద్ధికి రూ.17,109.06 కోట్లు కేటాయించారు. రెవెన్యూ వ్యయం రూ.2,08,261 కోట్లు రూ.2,56,256.56 కోట్ల బడ్జెట్లో రెవెన్యూ వ్యయం రూ.2,08,261 కోట్లు, మూల ధన వ్యయం రూ.30,679.57 కోట్లు, మరో రూ.16,270.18 కోట్లు క్యాపిటల్ డిస్బర్స్మెంట్ (మూల ధన పంపిణీ) ఉంటుందని అంచనా వేశారు. రెవెన్యూ లోటు రూ.17,036.15 కోట్లు, ద్రవ్యలోటు రూ.48,724.11 కోట్లు ఉంటుందని అంచనా. రెవెన్యూ రాబడి రూ.1,91,225.11 కోట్లు ఉంటుందని, ఇందులో కేంద్ర పన్నుల వాటా రూపంలో రూ.33,050.00 కోట్లు, పన్ను ఆదాయం రూ.91,049.61 కోట్లు, పన్నేతర ఆదాయం రూ.11,092.50 కోట్లు, గ్రాంట్లు రూపంలో రూ.56,033.00 కోట్లు ఉంటుందని బడ్జెట్లో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా రాష్ట్ర ఆదాయం పెరుగుతుండటంతో పాటు అప్పులు తగ్గు తుండటంతో రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అప్పుల శాతం తగ్గుతూ వస్తోంది. 2020–21 ఆర్థిక ఏడాదిలో రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అప్పులు 35.53% ఉండగా, 2021–22లో సవరించిన అంచనాల్లో అది 32.51 శాతానికి తగ్గింది. అలాగే 2022–23 ఆర్థిక ఏడాదిలో 32.79% ఉంటుందని అంచనా. బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదం అసెంబ్లీ ప్రారంభానికి ముందు సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో 2022–23 బడ్జెట్‌కు ఆమోదముద్ర పడింది. ఆర్థిక మంత్రి బుగ్గన బడ్జెట్ ప్రతులను సీఎంకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఎస్ సమీర్‌శర్మ, ఫైనాన్స్ స్పెషల్ సీఎస్ రావత్, జీఏడీ (సర్వీసెస్ అండ్ హెచ్ఆర్ఎం) ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఆర్థిక శాఖ కార్యదర్శులు సత్యనారాయణ, గుల్జార్ పాల్గొన్నారు. -
పేదవాడి జీవితానికి అండగా నిలిచినా బడ్జెట్ ఇది
-
ప్రతి ఆర్బికే లో పదివేల డ్రోన్స్: మంత్రి కన్నబాబు
-
మంచి బడ్జెట్.. అందుకే టీడీపీకి కడుపుమంట: కన్నబాబు
సాక్షి, అమరావతి: బడ్జెట్లో అన్ని రంగాలకు కేటాయింపులు చేశామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. బడ్జెట్ అనంతరం శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, వ్యవసాయానికే బడ్జెట్లో అత్యధిక కేటాయింపులు చేసినట్లు వెల్లడించారు. మంచి బడ్జెట్ ప్రవేశపెడితే టీడీపీకి వాళ్లకు కడపుమంట అని దుయ్యబట్టారు. వనరులు, వసతులను సమకూర్పు సహా ఆదాయం పెంపుపై దృష్టి పెట్టామన్నారు. రైతులకు మద్దతు ధర కల్పిస్తున్నామని పేర్కొన్నారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేశామన్నారు. చదవండి: ఏపీ వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి కన్నబాబు వ్యవసాయం, రైతుల సంక్షేమానికి సీఎం ప్రాధాన్యత ఇచ్చారు. టీడీపీ నేతల ఊహకు అందరాని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. ప్రతి జిల్లాల్లో వైఎస్సార్ రైతు భవన్ నిర్మించనున్నాం. రైతులకు విశ్రాంతి గృహాలు అందుబాటులో ఉంటాయి. అబద్ధాలను ప్రచారం చేయడంలో టీడీపీని మించిన వారు లేరు. ఇరిగేషన్ ప్రాజెక్టులకు రూ.11వేల కోట్లకు పైనే కేటాయింపులు చేశామని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. -
పేదలకు అండగా నిలిచిన బడ్జెట్ ఇది: మంత్రి వేణుగోపాల కృష్ణ
సాక్షి, అమరావతి: పేదవాడికి అండగా నిలిచిన బడ్జెట్ ఇదని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి వేణుగోపాలకృష్ణ అన్నారు. విద్య కోసం అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన బడ్జెట్ అన్నారు. బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీలకు కూడా మేలు చేసే బడ్జెట్ అని పేర్కొన్నారు. బీసీ వర్గాలకు రూ.29 వేల కోట్లకుపైగా బడ్జెట్ కేటాయింపులు జరిగాయని తెలిపారు. బీసీ వర్గాలకు గొప్ప మేలు చేసే బడ్జెట్ ఇదని చెప్పారు. చదవండి: ఏపీ బడ్జెట్ 2022-23 ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి బుగ్గన నవరత్నాలతో పాటు అన్ని రంగాలకు ప్రాధాన్యత: శ్రీకాంత్‌రెడ్డి ఆర్థిక రంగాన్ని చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. చంద్రబాబు సర్కార్ చేసిన అప్పులకు మేం వడ్డీ కడుతున్నామన్నారు. తమ ప్రభుత్వం ప్రారంభించిన పథకాల్లో ఎక్కడా కేటాయింపులు తగ్గలేదన్నారు. నవరత్నాలతో పాటు అన్ని రంగాలకు సమాన ప్రాధాన్యత ఇచ్చామని శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. బడ్జెట్ ప్రసంగాన్ని సైతం అడ్డుకునేందుకు యత్నించిన దుర్మార్గపు ప్రతిపక్షం టీడీపీ అని దుయ్యబట్టారు. ప్రజలకు మంచి బడ్జెట్ ఇచ్చిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌కు శ్రీకాంత్‌రెడ్డి అభినందనలు తెలిపారు. డ్రోన్ల వినియోగం.. దేశంలోనే వినూత్న ప్రయత్నం: ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవసాయంలో డ్రోన్ల వినియోగాన్ని ప్రవేశపెడుతూ సీఎం జగన్ ప్రభుత్వం బడ్జెట్లో ప్రకటించిందని.. 10 వేల డ్రోన్లు వాడుకలోకి వస్తాయని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. పెస్టిసైడ్లు, ఎరువులు, విత్తనాలు డ్రోన్లతో చల్లడం వల్ల సేద్యం ఖర్చు తగ్గుతుందన్నారు. 20 వేల మంది డ్రోన్ పైలట్లుగా ఉపాధి పొందుతారన్నారు. దేశంలోనే వినూత్న ప్రయత్నం అని విజయసాయిరెడ్డి ట్విట్టర్లో పేర్కొన్నారు. సబ్ప్లాన్లకు భారీగా కేటాయింపులు: సామినేని బడ్జెట్లో వాస్తవ కేటాయింపులు, ఖర్చులు ఉంటాయని.. వివిధ సబ్ ప్లాన్లకు భారీగా కేటాయింపులు చేశారని ఎమ్మెల్యే సామినేని ఉదయభాను అన్నారు. చంద్రబాబు వ్యవసాయ బీమా బకాయిలు కూడా తమ ప్రభుత్వం చెల్లించిదన్నారు.