Breadcrumb
AP: రేపటికి ఏపీ అసెంబ్లీ వాయిదా
Published Mon, Mar 14 2022 8:44 AM | Last Updated on Mon, Mar 14 2022 3:26 PM
Live Updates
Live Blog: ఐదో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు
రేపటికి ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాయిదా
ఏపీ శాసన సభ, శాసన మండలి సమావేశాలు వాయిదా పడ్డాయి. తిరిగి రేపు (మంగళవారం) ప్రారంభం కానున్నాయి.
ప్రజలు తిరస్కరించినా టీడీపీ తీరు మారలేదు: గుడివాడ అమర్నాథ్
రాష్ట్రంలోటీడీపీ 23 స్థానాలకు పడిపోయిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ అన్నారు. అసెంబ్లీలో బడ్జెట్ చర్చలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు తిరస్కరించినా టీడీపీ తీరు మారలేదని తెలిపారు.
సాధారణ మరణాలపై టీడీపీ తప్పుడు ప్రచారం: సీఎం వైఎస్ జగన్
సాధారణ మరణాలపై తప్పుడు ప్రచారం జరుగుతోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జంగారెడ్డిగూడెం మరణాలపై టీడీపీ చేస్తోన్న అసత్య ప్రచారంపై ఆయన స్పందిస్తూ.. నేచురల్ డెత్స్‌పై టీడీపీ రాజకీయం చేస్తోందన్నారు. సహజ మరణాలను కూడా వక్రీకరిస్తున్నారని దుయ్యబట్టారు.
టీడీపీ అపోహలు సృష్టిస్తోంది: మంత్రి ఆళ్ల నాని
జంగారెడ్డిగూడెంలో జరగని మరణాలపై టీడీపీ అసత్య ప్రచారం చేస్తోందని మంత్రి ఆళ్లనాని మండిపడ్డారు. టీడీపీ శవ రాజకీయాలు చేస్తూ లేని సమస్యలు పెద్దవి సృష్టిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నలుగురు చనిపోతే 18 మంది మృతిచెందారంటూ ప్రచారం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. వాస్తవాలను ప్రజలకు వివరించాల్సి ఉందన్నారు. టీడీపీ తప్పుడు ప్రచారంపై ప్రజలు ఆలోచించాలన్నారు. సహజ మరణాలపై కూడా అపోహలు సృష్టిస్తున్నారన్నారు. టీడీపీ డ్రామాలకు కొన్ని ప్రతికలు వంత పాడుతున్నాయని మండిపడ్డారు. అభూత కల్పనలతో ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నారన్నారు. బాధితుడు మద్యం వల్లకాదు గుండెనొప్పితో చనిపోయాడు. మద్యం తాగలేదని మృతుడి భార్యే స్వయంగా ప్రకటిందన్నారు.
సభ జరగడం టీడీపీకి ఇష్టం లేదు: మంత్రి కన్నబాబు
సభ జరగడం తెలుగుదేశం పార్టీకి ఇష్టం లేదని మంత్రి కన్నబాబు మండిపడ్డారు. అసెంబ్లీ గౌరవాన్ని టీడీపీ కించపరుస్తోందన్నారు.
ఏపీ అసెంబ్లీ నుంచి ఐదుగురు టీడీపీ సభ్యుల సస్పెన్షన్
ఏపీ అసెంబ్లీ నుంచి ఐదుగురు టీడీపీ సభ్యులను సస్పెన్షన్ చేశారు. బుచ్చయ్యచౌదరి, పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, అచ్చెన్నాయుడు, బాల వీరాంజనేయులను సెస్పెన్షన్ చేశారు. సభా కార్యక్రమాలను అడ్డుకోవడంతో స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ సభ్యుల ప్రవర్తనపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో టీడీపీ సభ్యులు హుందాగా వ్యవహరించాలన్నారు.
జంగారెడ్డిగూడెం ఘటనపై మంత్రి ఆళ్ల నాని ప్రకటన
జంగారెడ్డిగూడెంలో మరణాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు విచారణ చేపట్టామని అసెంబ్లీలో మంత్రి ఆళ్ల నాని ప్రకటించారు. జంగారెడ్డి గూడెంలో వాస్తవ పరిస్థితులు పరిశీలించాలని సీఎం ఆదేశించారని తెలిపారు.
టీడీపీ ఓర్వలేకపోతోంది: మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్
వాయిదా అనంతరం ఏపీ అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభమయ్యాయి. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతూ టీడీపీ సభ్యులు కావాలనే సభకు అడ్డం పడుతున్నారని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వానికి పేరు రావడం చూసి టీడీపీ ఓర్వలేకపోతోందని దుయ్యబట్టారు.
ఏపీ అసెంబ్లీ వాయిదా..
అసెంబ్లీలో టీడీపీ సభ్యులు గందరగోళం సృష్టిస్తున్నారు. స్పీకర్‌పై టీడీపీ సభ్యులు పేపర్లు విసిరి అనుచితంగా వ్యవహరించారు. సభను పదేపదే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో అసెంబ్లీని స్పీకర్ వాయిదా వేశారు.
సభలో టీడీపీ సభ్యుల తీరు సరిగా లేదు: మంత్రి బొత్స
అసెంబ్లీలో టీడీపీ సభ్యుల తీరు సరిగా లేదని మంత్రి బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. సభలో గొడ చేయడమే టీడీపీ సభ్యుల సాంప్రదాయం అంటూ దుయ్యబట్టారు. సభలో టీడీపీ సభ్యుల ప్రవర్తనను ప్రజలు గమనిస్తున్నారన్నారు.
మద్యం సిండికేట్లతో చంద్రబాబు కుమ్మక్కు: ఎమ్మెల్యే ఆర్కే రోజా
మద్యం సిండికేట్లతో చంద్రబాబు కుమ్మక్కయ్యారని ఎమ్మెల్యే ఆర్కే రోజా మండిపడ్డారు. బెల్టుషాపులు ఎత్తేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చి 40వేల షాపులు తెరిచారని ఆమె దుయ్యబట్టారు. చంద్రబాబు పాలనలో మద్యాని ఏరులై పారించారని రోజా మండిపడ్డారు.
చంద్రబాబు పాపాలను ప్రజలు ఇంకా మరిచిపోలేదు: ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి
చంద్రబాబు పాపాలను ప్రజలు ఇంకా మర్చిపోలేదని ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి అన్నారు. ప్రతి అంశాన్ని రాజకీయం చేయాలని టీడీపీ ప్రయత్నిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
శవ రాజకీయాలకు టీడీపీ పేటేంట్ తీసుకుంది: మంత్రి కన్నబాబు
శవ రాజకీయాలకు టీడీపీ పేటెంట్ తీసుకుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు. ప్రజల కోసం ఎన్టీఆర్ మద్య నిషేధం తెచ్చారన్నారు. మద్య నిషేధానికి చంద్రబాబు తూట్లు పొడిచారని ఆయన మండిపడ్డారు.
టీడీపీ సభ్యులను సస్పెండ్ చేయాలి: జోగి రమేష్
సభలో గొడవ చేస్తున్న టీడీపీ సభ్యులను సస్పెండ్ చేయాలని ఎమ్మెల్యే జోగి రమేష్ డిమాండ్ చేశారు. వారి తీరును ప్రజలు గమనిస్తున్నారన్నారు. టీడీపీ సభ్యులకు సభలో ఉండే అర్హత లేదని జోగి రమేష్ ధ్వజమెత్తారు.
అవి సాధారణ మరణాలు: మంత్రి కొడాలి నాని
జంగారెడ్డి గూడెంలో సహజ మరణాలను టీడీపీ వక్రీకరిస్తోందని మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. జంగారెడ్డి గూడెంలో జరిగినవి సాధారణ మరణాలని.. టీడీపీ నేతలు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన నిప్పులు చెరిగారు.
తిరిగి ప్రారంభమైన అసెంబ్లీ
వాయిదా అనంతరం ఏపీ అసెంబ్లీ ప్రారంభమైంది. మద్యపాన నిషేధంపై మాట్లాడే హక్కు టీడీపీ సభ్యులకు లేదని మంత్రి కొడాలి నాని అన్నారు. మద్యపాన నిషేధానికి చంద్రబాబు తూట్లు పొడిచారని మండిపడ్డారు.
శాసన మండలి వాయిదా
ప్రతిపక్ష టీడీపీ సభ్యుల ఆందోళనతో శాసన మండలిలో గందరగోళం నెలకొంది. టీడీపీ సభ్యులు అడుగడుగునా అడ్డు తగలడంతో చైర్మన్ మండలిని వాయిదా వేశారు.
టీడీపీ సభ్యుల తీరును తప్పుబట్టిన మండలి చైర్మన్
ఏపీ శాసన మండలిలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ టీడీపీ సభ్యుల ఆందోళన. ప్రతిపక్ష సభ్యుల తీరును తప్పుబట్టిన చైర్మన్ మోషేన్‌రాజు. ప్లకార్డులు ప్రదర్శించడంపై ఆగ్రహం.
టీడీపీ సభ్యుల గందరగోళంతో సభను వాయిదా వేసిన స్పీకర్
టీడీపీ సభ్యుల గందరగోళంతో సభను స్పీకర్ తమ్మినేని వాయిదా వేశారు. స్పీకర్ చైర్ వైపు టీడీపీ ఎమ్మెల్యేలు దూసుకెళ్లారు. వారి తీరుపై స్పీకర్ వ్యక్తం చేశారు.
అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేల ఓవర్ యాక్షన్
అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. స్పీకర్ చైర్ వైపు టీడీపీ ఎమ్మెల్యేలు దూసుకెళ్లారు. వారి తీరుపై స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు.
లైవ్ వీడియో
టీడీపీ సభ్యుల తీరుపై మంత్రి బుగ్గన అభ్యంతరం
టీడీపీ సభ్యుల తీరుపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అభ్యంతరం తెలిపారు. సభను అడ్డుకోవడమే ప్రతిపక్షం పనిగా పెట్టుకుందని ఆయన మండిపడ్డారు. సభను సాగనీయకుండా ప్రతిరోజూ అడ్డుపడుతున్నారన్నారు. ప్రతి అంశాన్ని చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు.
ఏపీ అసెంబ్లీ 5 నిమిషాల పాటు వాయిదా
ఏపీ అసెంబ్లీ 5 నిమిషాల పాటు వాయిదా పడింది. సభలో టీడీపీ సభ్యుల గందరగోళంతో స్పీకర్ వాయిదా వేశారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
ఐదో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాలు చేపట్టారు. అనంతరం బడ్జెట్‌పై చర్చ జరగనుంది.
కాసేపట్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
కాసేపట్లో ఐదో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 9 గంటలకు ప్రశ్నోత్తరాలు ప్రారంభమవుతాయి. అనంతరం బడ్జెట్‌పై చర్చ జరగనుంది. శాసనమండలి 10 గంటలకు ప్రారంభం కానుంది. 10 గంటల నుంచి శాసనమండలిలో ప్రశ్నోత్తరాలు చేపడతారు. అనంతరం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ కొనసాగిస్తారు. అనంతరం బడ్జెట్‌పై చర్చ ప్రారంభమవుతుంది.
Related News By Category
Related News By Tags
-
Live Blog: ఏడో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు
-
ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా
-
సిద్ధం సభ.. ప్రసంగాన్ని ట్వీట్ చేసిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: ‘‘ఈ దుష్టచతుష్టయం పద్మవ్యూహంలో చిక్కుకుపోవడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు.. అర్జునుడు.. పెత్తందారులపై ఈ కురుక్షేత్ర యుద్ధానికి నేను సిద్ధం.. మీరంతా సిద్ధమా...?’’ అంటూ భీమిలి వేదిక...
-
మూడేళ్లలో 95 శాతం హామీలు నెరవేర్చాం: సీఎం జగన్
-
వికేంద్రీకరణ విషయంలో వెనకడుగు వేయబోం: సీఎం జగన్
Comments
Please login to add a commentAdd a comment