యంగ్ హీరో సత్యదేవ్ లేటెస్ట్ మూవీ 'జీబ�...
సాక్షి, తాడేపల్లి: పీఏసీ చరిత్రలో ఇవా�...
సాక్షి, అమరావతి: ఏపీ శాసనమండలిలో మంత్�...
Gold Price Today: దేశంలో బంగారం ధరలు ఎంతకీ ఆగకుం...
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఉప ముఖ్య...
కర్నూలు (సెంట్రల్): ‘ఏయ్.. మా పవన్ కల...
అమరావతి, సాక్షి: అసెంబ్లీ ఎన్నికల వాత�...
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల అనర్హ�...
సియోల్: అగ్ర రాజ్యం అమెరికాలో సంచలన �...
మనలో చాలా మంది జీవితంలో మరపురాని సంద�...
జెరూసలేం: గాజాలో యుద్ధం నేరాలు, మానవా�...
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గత వైఎస్స�...
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో గ్రీన్ హ...
సాక్షి ,గుంటూరు: అసెంబ్లీ సాక్షిగా చం�...
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ పారిశ్రామ�...
Published Wed, Mar 16 2022 8:54 AM | Last Updated on Thu, Mar 17 2022 11:54 AM
ఏడో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్దపీట వేశారని వైఎస్సార్సీపీ విడదల రజనీ అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే సంక్షేమ సామ్రాజ్యాన్ని సృష్టించారన్నారు. మహిళా సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమన్నారు. మహిళలకు 50 శాతం రిజర్వేషన్ ఇచ్చిన ఘనత సీఎందేనన్నారు.
గత ప్రభుత్వాలు బీసీలను ఓటు బ్యాంకుగానే చూశాయని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి అన్నారు. సంక్షేమ రంగానికి సీఎం జగన్ అధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. బలహీనవర్గాలు, దళితుల కోసం వినూత్న రీతిలో పథకాలు అమలు చేస్తున్నారన్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 32 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. 29.24 లక్షల మందికి ఇళ్లు కట్టించి ఇస్తున్నారన్నారు. టీడీపీ పాలనలంతా అరాచకాలేనని.. జగన్ పాలనలో ప్రతీ పేజీ సువర్ణాధ్యాయం అన్నారు.
టీడీపీ సభ్యులపై డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపు టీడీపీ బండారం బయటపెడతానన్నారు. మీ బండారాలపై సమాధానం చెబితే రాజకీయాల నుంచి తప్పుకుంటానని టీడీపీకి సవాల్ విసిరారు.
ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులను సస్పెన్షన్ చేశారు. సభా కార్యకలాపాలకు అడ్డు తగులుతుండటంతో స్పీకర్ తమ్మినేని సీతారాం ఈ నిర్ణయం తీసుకున్నారు. 11 మంది టీడీపీ సభ్యులను ఒకరోజు పాటు సస్పెన్షన్ చేశారు. అశోక్, రామ్మోహన్, భవాని, చినరాజప్ప, వెంకటనాయుడు, జోగేశ్వరరావు, రామకృష్ణబాబు, రామరాజు, రవికుమార్, సాంబశివరావు, సత్యప్రసాద్‌లను సస్పెన్షన్ చేశారు.
చనిపోయిన వ్యక్తులకు పార్టీలను, కులాన్ని అంటగట్టి టీడీపీ నేతలు శవ రాజకీయాలు చేస్తున్నారని రాయదుర్గం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి విమర్శించారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రాయదుర్గానికి చెందిన వ్యక్తి మర్కెట్ యార్డ్‌లో విత్తనాలను తీసుకొని ఇంటికొచ్చి మళ్లీ బయటకెళ్లి చనిపోయారని తెలిపారు. అయితే సహజ మరణాన్ని కూడా విత్తన పంపిణీలో చనిపోయారని టీడీపీ నాయకులు ఆరోపణలు చేశారని గుర్తు చేశారు. చంద్రబాబు పబ్లిసిటీ నెత్తికెక్కి తొక్కిసలాటలో 29 మంది చనిపోతే ఆ శవాలు అప్పుడు కనపడలేదా అని ప్రశ్నించారు.
శవ రాజకీయాలు చేయడంలో టీడీపీ దిట్ట అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. శవ రాజకీయాలకు టీడీపీ పేటెంట్ అని ఎద్దేవా చేశారు. జంగారెడ్డిగూడెంలో పరామర్శకు రాజకీయ యాత్రలా వెళ్లారని దుయ్యబట్టారు. పుష్కరాల్లో మృతిచెందిన వారి కుటుంబాలను చంద్రబాబు పరామర్శించారా? అని మంత్రి ప్రశ్నించారు. టీడీపీ ప్రతిరోజూ స్పీకర్ చైర్‌ను కించపరిచేలా ప్రవర్తిస్తోందన్నారు. చంద్రబాబుకు భవిష్యత్‌పై ఆశలు పోయాయి. చంద్రబాబును పచ్చ పత్రికలు, ఛానెళ్లు భూజానికెత్తుకుని మోస్తున్నాయని కన్నబాబు ధ్వజమెత్తారు.
టీడీపీ సభ్యులు రోజూ సభను అడ్డుకుంటున్నారని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మండిపడ్డారు. టీడీపీ సభ్యుల తీరును ఆయన తప్పుబట్టారు.
సభలో పలు శాఖల డిమాండ్లను మంత్రులు ప్రవేశపెడుతున్నారు. టీడీపీ సభ్యుల తీరు మారలేదు. ఏడో రోజు కూడా సభా కార్యక్రమాలకు అడ్డుపడుతున్నారు. స్పీకర్ పోడియం వద్ద టీడీపీ సభ్యులు నినాదాలు చేస్తున్నారు.
ఏడో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాలు చేపట్టారు. అనంతరం పలు శాఖల బడ్జెట్ డిమాండ్లపై చర్చించనున్నారు. సాంఘిక, గిరిజన, బీసీ, మహిళ, శిశు, మైనారిటీ సంక్షేమం, గృహనిర్మాణ శాఖల పద్దులపై అసెంబ్లీ చర్చించనుంది.
కాసేపట్లో ఏడో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సభ ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాలు చేపట్టనున్నారు. అనంతరం పలు శాఖల బడ్జెట్ డిమాండ్లపై చర్చించనున్నారు. సాంఘిక, గిరిజన, బీసీ, మహిళ, శిశు, మైనారిటీ సంక్షేమం, గృహ నిర్మాణ శాఖల పద్దులపై అసెంబ్లీ చర్చించనుంది.
Comments
Please login to add a commentAdd a comment