Breadcrumb
11వరోజు అసెంబ్లీ సమావేశాలు లైవ్ అప్డేట్స్
Published Wed, Mar 23 2022 8:41 AM | Last Updated on Wed, Mar 23 2022 4:39 PM
Live Updates
11వరోజు అసెంబ్లీ సమావేశాలు లైవ్ అప్డేట్స్
ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా
ఏపీ అసెంబ్లీ సమావేశాలు బుధవారం వాయిదా పడ్డాయి. తిరిగి రేపు(గురువారం)ప్రారంభం కానున్నాయి.
బాబు ప్రభుత్వమే ఆ మద్యం బ్రాండ్లకు అనుమతి ఇచ్చింది: సీఎం జగన్
చంద్రబాబు ప్రభుత్వమే ఎన్నో మద్యం బ్రాండ్లకు అనుమతి ఇచ్చిందని సీఎం వైఎస్ జగన్ అన్నారు. మా బ్రాండ్లు జగనన్న అమ్మఒడి, వైఎస్సార్ చేయూత, జగనన్న కాలనీలు అని తెలిపారు. చంద్రబాబు బ్రాండ్లు ప్రెసిడెంట్ మెడల్, గవర్నర్ ఛాయిస్, బూమ్‌బూమ్ బీర్ అని ఎద్దేవా చేశారు. పవర్‌స్టార్ 999 బ్రాండ్లన్నీ చంద్రన్న కానుకలే అని అన్నారు. ఇవన్నీ చంద్రబాబు ఆశీస్సులతో వచ్చిన బ్రాండ్లే అని తెలిపారు. ఈ బ్రాండ్లను మేం క్రియేట్ చేసినట్లుగా ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఇప్పుడు ప్రచారంలో ఉన్న లిక్కర్ బ్రాండ్లన్నీ చంద్రబాబు హయాంలోనివేనని అన్నారు. నవరత్నాలు మా బ్రాండ్స్ అయితే ప్రెసిడెంట్ మెడల్, గవర్నర్ ఛాయిస్, బూమ్‌బూమ్ బీర్, పవర్‌స్టార్ 999 బ్రాండ్లన్నీ చంద్రన్న కానుకలేనని సీఎం వైఎస్ జగన్ అన్నారు.
మహిళలకు మంచి చేసే మనసు చంద్రబాబుకు లేదు: సీఎం జగన్
కోటీ 16 లక్షల మంది దిశ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారని సీఎం జగన్ తెలిపారు. దిశ పేరు చెబితే మహిళతకు రక్షణ అని గుర్తుకొస్తుందని తెలిపారు. అమ్మఒడి పథకం ద్వారా రూ. 13,023 కోట్లు అందించామని చెప్పారు. వైఎస్సార్ చేయూత ద్వారా 9,082 కోట్లు అందించామని పేర్కొన్నారు. ఈబీసీ నేస్తం కింద రూ. 589 కోట్లు అందించామని చెప్పారు. మహిళ పక్షపాతి ప్రభుత్వంగా పలు నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. మహిళల సొంతింటి కల నెరవేర్చామని తెలిపారు. జంగారెడ్డిగూడెం మరణాలపై ఎల్లో మీడియా తప్పుడు కథనాలు ఇస్తోందన్నారు. మహిళలకు మంచి చేసే మనసు చంద్రబాబుకు లేదని అన్నారు. గత ప్రభుత్వం ఎన్నో మద్యం బ్రాండ్లకు అనుమతి ఇచ్చిందని తెలిపారు.
మహిళల భద్రత కోసం దిశ వాహనాలు ప్రారంభించాం: సీఎం జగన్
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ.. మహిళల భద్రత కోసం దిశ వాహనాలు ప్రారంభించామని తెలిపారు. మహిళల అవసరాలకు అనుగుణంగా అడుగులు వేస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే దిశ పోలీసు స్టేషన్ల పరిధిలో 900 ద్విచక్ర వాహనాలు ఏర్పాటు చేశామని తెలిపారు. 3 వేల వాహనాలను జీపీఎస్‌తో అనుసంధానం చేసి ఉపయోగిస్తున్నామని అన్నారు.
మద్యపాన నిషేదాన్ని ఎత్తేసిన వ్యక్తి చంద్రబాబు: పార్థసారథి
మద్యం పాలసీపై స్వల్పకాలిక చర్చలో ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడుతూ.. మద్యాపాన నిషేధాన్ని ఎత్తేసిన వ్యక్తి చంద్రబాబు అని తెలిపారు. ప్రభుత్వానికి ఆదాయం తగ్గిపోతోందని ఆనాడు చంద్రబాబు మద్యానికి తలుపులు తెరిచారని అన్నారు. మద్యాపాన నిషేధాన్ని ఎత్తేసేందుకు బాబు ముడుపులు తీసుకున్నారని తెలిపారు. డిస్టిలరీస్ నుంచి రూ.వేల కోట్లు వసూలు చేశారని అన్నారు.
మద్యం పాలసీపై స్వల్పకాలిక చర్చ
11వ రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మద్యం పాలసీపై స్వల్పకాలిక చర్చ కొనసాగుతోంది.
ద్వితీయ అధికార భాషగా ‘ఉర్దూ’ బిల్లు ఆమోదం
రాష్ట్ర ద్వితీయ అధికారిక భాషగా ఉర్దూ ప్రతిపాదిస్తూ ప్రవేశపెట్టిన బిల్లును ఆంధ్రప్రదేశ్ శాసనసభ బుధవారం ఆమోదం తెలిపింది.
శాసన మండలి వాయిదా
ఏపీ శాసన మండలి రేపటి(గురువారం)కి వాయిదా పడింది
మండలిలోనూ టీడీపీ సభ్యుల సస్పెన్షన్
ఏపీ శాసన మండలిలోనూ టీడీపీ సభ్యులు సస్పెండ్ అయ్యారు. బచ్చుల అర్జునుడు, అశోక్‌బాబు, దీపక్‌రెడ్డి, రామ్మోహన్, దువ్వాడ రామారావు, రవీంద్రనాథ్‌రెడ్డిని మండలి చైర్మన్ మోషేన్ రాజు ఒక్క రోజు సస్పెండ్ చేశారు. మంత్రుల ప్రసంగాన్ని పదేపదే అడ్డుకున్నారు. ఛైర్మన్ పోడియంపైకి ఎక్కి ఆందోళన చేశారు. దీంతో ఛైర్మన్ మోషేన్ రాజు సస్పెన్షన్ వేటు వేశారు. శాసనమండలిలో టీడీపీ సభ్యుల తీరు బాధాకరమని మంత్రులు బొత్స, కన్నబాబు అన్నారు.
ఛైర్మన్ స్థానాన్ని టీడీపీ సభ్యులు అగౌరవ పరుస్తున్నారు
శాసనమండలిలో తెలుగుదేశం సభ్యుల తీరు బాధాకరమని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. 'సభలో గందరగోళం చేయడం మంచి పద్ధతి కాదు. తెలుగుదేశం సభ్యులు ఛైర్మన్ స్థానాన్ని అగౌరవ పరుస్తున్నారు. పోడియం పైకెక్కిన తెలుగుదేశం సభ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలి. ఎవరైతే పోడియం పైకి ఎక్కారో వారిని వెంటనే సస్పెండ్ చేయండి అని శాసనమండలిని ఛైర్మన్‌ను మంత్రి బొత్స కోరారు.
మండలిలో తెలుగుదేశం సభ్యులు ఆందోళన
జంగారెడ్డిగూడెం మరణాలపై చర్చ జరపాలంటూ శాసనమండలిలో తెలుగుదేశం సభ్యులు ఆందోళన నిర్వహించారు. పోడియంపైకి ఎక్కి తెలుగుదేశం సభ్యులు చైర్మన్‌ను చుట్టుముట్టారు.
రాత్రికి రాత్రే అన్నీ సర్దుకుని చంద్రబాబు ఏపీ వచ్చేశారు: కన్నబాబు
ఏపీ శాసనమండలి మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ.. 'విభజన చట్టం ప్రకారం పదేళ్లపాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారు. కేసీఆర్‌కు భయపడి తెలంగాణ నుంచి అన్నీ సర్దుకుని చంద్రబాబు ఏపీ వచ్చేశారు. చంద్రబాబును ఎక్కడ జైళ్లో పెడతారని రాత్రికి రాత్రి ఏపీకి వచ్చేశారు. ఓటుకు కోట్లు కేసు కోసం చంద్రబాబు తెలంగాణలోని ఏపీ ఆస్తులను తాకట్టుపెట్టారు. మా ప్రభుత్వం వచ్చాక బకాయిలు, ఆస్తులకు సంబంధించి పోరాటం చేస్తున్నాం' అని అన్నారు.
ఐదుగురు టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్
ఎంత చెప్పినా టీడీపీ ఎమ్మెల్యేల తీరు మారకపోవడంతో సభ నుంచి రెండు రోజుల పాటు సభ్యులను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ సభ్యులు ప్రజా ధనాన్ని వృథా చేస్తున్నారంటూ వారి తీరుపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబు రాష్ట్రాన్ని పాలించడం మన దురదృష్టం: మంత్రి కొడాలి నాని
చంద్రబాబు అల్జీమర్స్‌తో బాధపడుతున్నారు. 240 బ్రాండ్స్‌కు పర్మిషన్ ఇచ్చింది చంద్రబాబు. చంద్రబాబు రాష్ట్రాన్ని పాలించడం మన దురదృష్టం. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు. టీడీపీని ఎవరు పట్టుకుంటే వారు సర్వనాశనం అవుతారు. తెలంగాణలో టీడీపీకి ఏ గతి పట్టిందో ఏపీలో అదే గతి పడుతుందని మంత్రి కొడాలి నాని అన్నారు..
ఆ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోండి: మల్లాది విష్ణు
సభకు వచ్చి టీడీపీ ఎమ్మెల్యేలు సమయాన్ని వృథా చేస్తున్నారు. సభా సమయం వృథా చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే మల్లాది విష్ణు స్పీకర్‌ను కోరారు.
టీడీపీ నేతలంతా చిడతలు వాయించుకోవాల్సిందే..
ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యులు చిడతలు వాయించడంపై అంబటి రాంబాబు స్పందిస్తూ.. ఎన్నికల తర్వాత టీడీపీ నేతలంతా చిడతలు వాయించుకోవాల్సిందేని అన్నారు. నిన్న విజిల్స్ వేశారు, ఇవాళ చిడతలు వాయించారు రేపు సభలో ఏం చేస్తారో..?. సభలో అమర్యాదగా ప్రవర్తించిన టీడీపీ సభ్యుల్ని సస్పెండ్ చేయాలని అంబటి రాంబాబు స్పీకర్‌ను కోరారు.
వారికి డ్రంక్ టెస్ట్ చేయాలి: జక్కంపూడి రాజా
టీడీపీ సభ్యులకు డ్రంక్ టెస్ట్ చేయించాలని ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. సభలో టీడీపీ ఎమ్మెల్యేల తీరును చూస్తూ మద్యం సేవించి అలా ప్రవర్తిస్తున్నారేమో అని అనుమానంగా ఉందని జక్కంపూడి రాజా అన్నారు.
సభలో అమర్యాదగా వ్యవహరిస్తున్నారు: మంత్రి వెల్లంపల్లి
అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేల తీరుపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. చంద్రబాబుకు చిడతలు కొట్టించుకోవడం బాగా అలవాటు. ఆ అలవాటు వాళ్ళ ఎమ్మెల్యేలకు కూడా వచ్చింది. చిడతలతో సభలో అమర్యాదగా వ్యవహరిస్తున్నారు. ఇలానే చేస్తే తండ్రి కొడుకులు 2024 తర్వాత చిడతలు తీసుకోవడమే అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేల భజన
అసెంబ్లీలో స్పీకర్ పోడియం వద్ద టీడీపీ ఎమ్మెల్యేలు భజన చేస్తూ అమర్యాదగా ప్రవర్తిస్తున్నారు. నిన్న కూడా విజిల్ వేసి టీడీపీ ఎమ్మెల్యేలు అమర్యాదగా ప్రవర్తించారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యేల తీరుపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కరోనా క్లిష్టసమయాల్లో చంద్రబాబు హైదరాబాద్‌కు పారిపోయారు
కరోనా క్లిష్టపరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలకు సకాలంలో వైద్యం అందించడంతో పాటు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించిన ఘనత వైఎస్సార్సీపీ ప్రభుత్వానికే దక్కుతుందని ఎమ్మెల్యే ఎం. తిప్పేస్వామి అన్నారు. అదే సమయంలో ప్రజలను పట్టించుకోకుండా చంద్రబాబు హైదరాబాద్‌లో కూర్చున్నాడని, అది ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.
ఇది సరికాదు
పేదల ఇళ్లకు సంబంధించిన చర్చ జరుగుతుంటే టీడీపీ సభ్యులు అడ్డుకోవడం సరికాదని ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి అన్నారు.
టీడీపీ సభ్యుల అనుచిత ప్రవర్తన.. స్పీకర్ సీరియస్
మళ్లీ పోడియం వద్ద టీడీపీ సభ్యుల అనుచిత ప్రవర్తనకు పాల్పడ్డారు. దీంతో స్పీకర్ ఇది సరైన పద్ధతి కాదంటూ వారిపై సీరియస్ అయ్యారు. టీడీపీ సభ్యులు సభను అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారు. పేదల ఇళ్ల విషయంలో ప్రశ్నోత్తరాలు జరుగుతుండగా అడ్డుకునే ప్రయత్నం చేశారు.
లైవ్ వీడియో
అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
11వ రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఆంద్రప్రదేశ్ పవర్ కార్పొరేషన్ వార్షిక నివేదికలను మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి సభ ముందు ఉంచనున్నారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ అధికార భాష సవరణ బిల్లును మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ సభ ముందు ఉంచనున్నారు. పలు బడ్జెట్ డిమాండ్ బిల్లులకు కూడా సభ ఆమోదం తెలపనుంది.
కాసేపట్లో 11వ రోజు అసెంబ్లీ సమావేశాలు
సాక్షి, అమరావతి: మరికాసేపట్లో పదకొండవ రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆంద్రప్రదేశ్ పవర్ కార్పొరేషన్ వార్షిక నివేదికలను మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి సభ ముందు ఉంచనున్నారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ అధికార భాష సవరణ బిల్లును మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ సభ ముందు ఉంచనున్నారు. పలు బడ్జెట్ డిమాండ్ బిల్లులకు కూడా సభ ఆమోదం తెలపనుంది.
Comments
Please login to add a commentAdd a comment