సాక్షి, అమరావతి: బడ్జెట్‌లో అన్ని రంగాలకు కేటాయింపులు చేశామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. బడ్జెట్ అనంతరం శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, వ్యవసాయానికే బడ్జెట్‌లో అత్యధిక కేటాయింపులు చేసినట్లు వెల్లడించారు. మంచి బడ్జెట్ ప్రవేశపెడితే టీడీపీకి వాళ్లకు కడపుమంట అని దుయ్యబట్టారు. వనరులు, వసతులను సమకూర్పు సహా ఆదాయం పెంపుపై దృష్టి పెట్టామన్నారు. రైతులకు మద్దతు ధర కల్పిస్తున్నామని పేర్కొన్నారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేశామన్నారు.
చదవండి: ఏపీ వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి కన్నబాబు
వ్యవసాయం, రైతుల సంక్షేమానికి సీఎం ప్రాధాన్యత ఇచ్చారు. టీడీపీ నేతల ఊహకు అందరాని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. ప్రతి జిల్లాల్లో వైఎస్సార్ రైతు భవన్ నిర్మించనున్నాం. రైతులకు విశ్రాంతి గృహాలు అందుబాటులో ఉంటాయి. అబద్ధాలను ప్రచారం చేయడంలో టీడీపీని మించిన వారు లేరు. ఇరిగేషన్ ప్రాజెక్టులకు రూ.11వేల కోట్లకు పైనే కేటాయింపులు చేశామని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment