సాక్షి,తాడేపల్లి:తిరుపతి లడ్డూపై చంద్రబాబు కుటిల రాజకీయాలను వైఎస్‌జగన్ బట్టబయలు చేశారని మాజీ ఎంపీ, వైఎస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి మార్గాని భరత్ అన్నారు.శనివారం(సెప్టెంబర్28) తాడేపల్లిలోని వైఎస్‌ఆర్‌సీపీ ఆఫీసులో నిర్వహించిన మీడియా సమావేశంలో భరత్ మాట్లాడారు.
‘వెంకటేశ్వరస్వామిపై చంద్రబాబు చాలా పెద్ద నింద వేశారు.ఆ నిందారోపణలు పోగొట్టడానికి రాష్ట్రవ్యాప్తంగా వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులు పూజలు చేశారు.జూన్ 12 నుంచి ఏఆర్ డెయిరీ నెయ్యి సప్లై చేసింది.జులై నెలలో వచ్చిన ట్యాంకర్లు వెనక్కి పంపించేశామని ఈవో శ్యామల రావు చెబుతున్నారు.ఎన్డీడీబీకి పంపించిన శాంపుల్స్ రిపోర్ట్ జూలై 23న వచ్చింది.
నెయ్యిలో వెజిటబుల్ ఆయిల్ కలిసిందని ఈవోనే స్వయంగా చెప్పారు.జంతువుల కొవ్వు కలిసిందని తెలిసినప్పుడు సెప్టెంబర్ 2 వరకూ చంద్రబాబు ఎందుకు ఆగారు.చంద్రబాబు రెండు నెలలు ఆగి అబద్ధాలు చెప్పారు.చంద్రబాబు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు.నాలుగు నెయ్యి ట్యాంకర్లు వెనక్కి పంపించామని ఈవో చెబుతున్నారు.
2014-19 మధ్య 14సార్లు ట్యాంకర్లు వెనక్కి పంపించారు.2019-24 మధ్య 18సార్లు ట్యాంకర్లు వెనక్కి పంపించారు.చంద్రబాబుకు హిందుత్వం పట్ల హిందువుల పట్ల అసలు గౌరవం ఉందా.బూట్లు వేసుకుని శంకుస్థాపనలు చేశాడు.అదేనా హిందుత్వమంటే.వెయ్యి కాళ్ల మండపాన్ని చంద్రబాబు ఎందుకు కూల్చివేయించేశారు.
చంద్రబాబు రాజకీయాలను బీజేపీ నేతలు గమనించాలి.సీఎం హోదాలో వైఎస్‌జగన్ ఐదేళ్లు పట్టువస్త్రాలు సమర్పించారు.పాదయాత్ర పూర్తయ్యాక కాలినడకన వెళ్లి తిరుమల దర్శనంచేసుకున్నారు.డిక్లరేషన్‌పై అప్పుడు చంద్రబాబు ఎందుకు మాట్లాడలేదు.నెయ్యి నాణ్యత పై చంద్రబాబు తెలిసి మాట్లాడుతున్నారా..తెలియక మాట్లాడుతున్నారా.
ఎన్డీబీబీ నుంచి వచ్చిన నివేదికను టీడీపీ కార్యాలయం నుంచి ఎందుకు విడుదల చేశారు.ఎన్డీబీబీనుంచి రిపోర్ట్ వచ్చిన తర్వాత సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదు.వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనకు పర్మిషన్ లేదని మా పార్టీ నేతలకు నోటీసులిచ్చారు.చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్టే సిట్ అధికారులు అమలు చేస్తారు.
ప్రజల మనసులో చంద్రబాబు విషం నింపాలని ప్రయత్నం చేస్తున్నారు.ప్రాయశ్చిత్త దీక్ష ఎందుకు చేస్తారో పవన్ కు తెలుసా.చంద్రబాబు తప్పు చేశారు కాబట్టే పవన్ దీక్ష చేస్తున్నారా.బీజేపీ వాళ్లు ముందు చంద్రబాబుని ప్రశ్నించాలి’అని భరత్ డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: నెయ్యి కల్తీపై థర్డ్‌పార్టీ విచారణ చేయించండి: బొత్స
Comments
Please login to add a commentAdd a comment