రాత్రిపూట పొలానికి నీళ్లు పెట్టేందుకు వ్యవసాయ బావి వద్దకు వెళ్లిన దళిత దంపతులను అవమానకర రీతిలో దూషించడంతోపాటు స్టేషన్‌కు తరలించి చితక్కొడుతూ పోలీసులు సాగించిన దౌర్జ న్యంపై ఉన్నతాధికారులు స్పందించారు. పెద్దపల్లి జిల్లా లోని బొంపల్లి గ్రామంలో శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనపై ‘ఖాకీ కావరం’ పేరిట ‘సాక్షి’లో సోమవారం ప్రచురితమైన కథనంపై రామగుండం పోలీసు కమిషనర్ విక్రంజిత్ దుగ్గల్ విచారణకు ఆదేశించారు. పెద్దపల్లి ఏసీపీ, ఐపీఎస్ అధికారి సి.హెచ్.సింధూశర్మను విచార ణాధికారిగా నియమించారు. ఘటనకు కారకుడైన ధర్మారం ఎస్సై హరిబాబును హెడ్‌క్వార్టర్‌కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులిచ్చారు.
Published Tue, Mar 7 2017 7:02 AM | Last Updated on Thu, Mar 21 2024 8:47 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement