
సాక్షి, న్యూఢిల్లీ: బహిరంగ మల విసర్జన రహిత ప్రాంతం కోసం కృషి చేస్తున్న పెద్దపల్లి జిల్లాకు జాతీయ పురస్కారం లభించింది. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ పరిధిలోని తాగునీరు, పారిశుద్ధ్య విభాగం స్వచ్ఛత కార్యశాలలో స్ఫూర్తిదాయక పనితీరు కనబరిచిన జిల్లాలకు ఆదివారం ఢిల్లీలో స్వచ్ఛత దర్పణ్ అవార్డులు ఇచ్చారు. బాలీవుడ్ కథానాయకుడు ఆమిర్‌ఖాన్ ముఖ్య అతిథిగా హాజరై పురస్కారాలు అందజేశారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ దేవసేన అమిర్‌ఖాన్ చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు. ‘సమగ్ర బహిరంగ మల విసర్జన నిర్మూలన–సమాచారం, విద్య, కమ్యూనికేషన్–సామాజిక మరుగుదొడ్లు’అనే అంశంపై దేవసేన ఈ కార్యక్రమంలో ప్రజెంటేషన్ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment