
పెద్దపల్లిలో విషాదం : ఏఎస్సై ఆత్మహత్య
పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కాల్వ శ్రీరాంపూర్ ఏఎస్సై రామనాథం పోలీసు క్వార్టర్లో ఆదివారం సాయంత్రం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో రామనాథం కుటుంబం విషాదంలో మునిగిపోయింది.
ఆయన మృతికి గల కారణాలపై జిల్లా ఉన్నతాధికారులు ఆరా తీస‍్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత‍్వాస్పత్రికి తరలించారు. కుటుంబ కలహాల కారణంగానే ఆయన ఆత్మహత్య చేసుకున్నట‍్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.