మాట్లాడుతున్న గోవర్ధనశాస్త్రీ
పెద్దపల్లిరూరల్ : తెలంగాణ ప్రభుత్వం ప్రజాసంక్షేమాన్ని విస్మరిస్తుందని.. ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను సానుకూలం చేసుకుని తిరిగి అధికారం దక్కించుకోవాలన్న ఆరాటంతో ఆర్భాటంగా పథకాలు ప్రవేశపెడుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు గోవర్ధనశాస్త్రీ విమర్శించారు. పెద్దపల్లిలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేసి వారిపై ఉన్న అప్పుల భారాన్ని తగ్గించిన విషయాన్ని రైతులు ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారన్నారు.
ప్రస్తుత టీఆర్‌ఎస్ ప్రభుత్వం నాలుగు విడతలుగా రుణమాఫీ చేశామని పేర్కొంటున్నా... రైతులపై ఇప్పటికీ వడ్డీభారం అలాగే ఉందని.. బ్యాంకుల్లో ఉన్న పాసుపుస్తకాలు ఇంకా రైతుల చేతికే రాలేదన్నారు. ఇపుడు కొత్తగా దేశానికే ఆదర్శమంటూ రైతులను మభ్యపెట్టేందుకే రైతుబంధు పేరిట ఎకరానికి రూ.4 వేలు చెల్లిస్తున్నాడని విమర్శించారు. ఎన్నికలు సమీపిస్తున్నందునే రైతుల్లో ఉన్న వ్యతిరేకతను తగ్గించాలన్న ఆలోచనతోనే ఈ పథకానికి శ్రీకారం చుట్టారని విమర్శించారు. ఆయన వెంట నాయకులు చిలారపు సదానందం, సిద్ధార్థరెడ్డి, ప్రేంకుమార్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment