
పాలకుర్తి (రామగుండం): విధుల్లో ఉన్న ఓ టీచర్ ఊపిరి ఆగింది. పాఠం చెబుతుండగానే గుండెపోటు రావడంతో కుప్పకూలి ప్రాణాలొదిలాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం బసంత్‌నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం జరిగింది. వివ రాలు.. శాయంపేటకు చెందిన రాజయ్య (45) బసంత్‌నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణితం ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. 8వ తరగతి విద్యార్థులతో మాట్లాడుతూ ఒక్కసారిగా కుప్పకూలి పడి పోయారు. అక్కడికి చేరుకున్న తోటి సిబ్బంది పాలకుర్తి జెడ్పీటీసీ సంధ్యారాణికి విషయం చెప్పారు. జెడ్పీటీసీ వాహనంలో గోదావరిఖనిలోని ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment