Sangareddy: Teacher dies of heart attack in school - Sakshi
Sakshi News home page

విషాదం.. స్కూల్‌లో గుండెపోటుతో టీచర్‌ అకాల మరణం

Published Wed, Apr 19 2023 6:40 PM | Last Updated on Wed, Apr 19 2023 6:52 PM

Teacher Padmalatha Died Of Heart Attack At Sangareddy School - Sakshi

సాక్షి, సంగారెడ్డి : ఇటీవలి కాలంలో గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ క్రమంలో సంగారెడ్డి జిల్లాలో మరో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వ ఉపాధ్యాయురాలు స్కూల్‌లోనే గుండెపోటుతో మృతిచెందింది. దీంతో, స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. 

వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లాలోని చౌటకూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్న పద్మలత బుధవారం పాఠాలు చెబుతోంది. ఈ క్రమంలో మధ్యలో తరగతి గది నుంచి బయటకు వచ్చి నీళ్లు తాగింది. అనంతరం, ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే ఆమెను సహచర ఉపాధ్యాయులు 108 అంబులెన్స్‌లో సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందింది. సంగారెడ్డి స్వస్థలమైన ఆమె మృతిపట్ల ఉపాధ్యాయులు, సిబ్బంది విచారం వ్యక్తం చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement