గుండెపోటుతో మోడల్ స్కూల్ ఉపాధ్యాయుడు మృతి
బదిలీపై కొత్త పాఠశాలకు వెళ్లిన రెండు రోజులకే తీవ్ర విషాదం
జగదేవ్‌పూర్(గజ్వేల్): బదిలీ అయ్యి పాఠశాలలో విద్యార్థులకు పరిచయం కాకముందే ఆ ఉపాధ్యాయుడిని విధి కాటేసింది. ఇంటి వద్ద కాలకృత్యాలకు వెళ్లి గుండెపోటుతో మృతి చెందాడు. ఈ విషాదకరమైన ఘటన మండలంలోని అలిరాజ్‌పేట గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన ధ్యాప వెంకటస్వామి(42), మంజుల (ఉపాధ్యాయురాలు), ఇద్దరు కుమార్తెలు సుష్మిత మిత్ర, అక్షర మిత్ర ఉన్నారు. వెంకటస్వామి గజ్వేల్ మోడల్ స్కూల్‌లో హిందీ ఉపాధ్యాయుడిగా 11 ఏళ్లుగా పని చేస్తున్నాడు. భార్య మంజుల జగదేవ్‌పూర్ బాలికల పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు.
అలిరాజ్‌పేట గ్రామం నుంచి గజ్వేల్‌కు మారి నూతనంగా ఇల్లు నిర్మించుకొని గత నెల 23న గృహ ప్రవేశం చేశారు. ఈ నెల 14న ఉపాధ్యాయుల బదిలీల్లో భాగంగా గజ్వేల్ నుంచి జగదేవ్‌పూర్ మోడల్ స్కూల్‌కు బదిలీ అయ్యారు. అదే రోజు సాయంత్రం పాఠశాలలో బాధ్యతలు తీసుకున్నారు. సోమవారం గజ్వేల్‌లోని కొత్త ఇంటిలో కాలకృత్యాలకు వెళ్లగా ఛాతిలో నొప్పి రావడంతో అక్కడే కుప్పకూలాడు. వెంటనే కుటుంబ సభ్యులు గజ్వేల్ ప్రభుత్వ ఆస్పతికి తరలించారు. వైద్యులు పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.
సామాజిక కార్యక్రమాలు..
వెంకటస్వామి ఉపాధ్యాయుడికి ముందు సామాజిక కార్యక్రమాలను చేపట్టారు. సామాజిక పాటలపై ప్రేమతో 11 పాటలను సొంత ఖర్చులు, దర్శకత్వంతో తీశారు. గ్రామానికి చెందిన పల్లెటూరి హీరో అనిల్ మొగిలితో 7 పాటలకు దర్శకత్వం, నిర్మాతగా వ్యవహరించారు. అలాగే రైతుల ఆత్మహత్యలపై పాటలకు నిర్మాత, దర్శకత్వం వహించారు.
నేత్రదానం..
వెంకటస్వామి మృతి చెందిన వెంటనే లోక్ నేత్ర ట్రస్టు వారికి అతడి కళ్లను దానం చేశారు. నేత్రదానం చేసి మరొకరికి చూపు ఇవ్వడంతో గ్రామస్తులు, తోటి ఉపాధ్యాయులు ఆ కుటుంబాన్ని అభినందించారు. పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు శశిధర్‌శర్మ, మండలాధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, టీపీటీఎఫ్, యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘూల నేతలు శంకర్, సత్తయ్య, ప్రవీణ్, వెంకట్ కిరణ్, ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయులు నివాళులరి్పంచారు.
Comments
Please login to add a commentAdd a comment