
సాక్షి, పెద్దపల్లి : జిల్లాలోని ఓదెల మండలం కొలనూర్ చెరువులో మరో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. నిన్న చెరువులో ఈతకు వెళ్లి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు గల్లంతైయ్యారు. నిన్న రాజయ్య, సిద్దార్థ్ మృతదేహాలను వెలికి తీశారు. ఇవాళ ఆదర్శ్, హర్షవర్ధన్ మృతదేహాలను బయటకు తీశారు. నలుగురి మృతితో కొలనూర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. తాత రాజయ్యతో కలిసి సిద్దార్థ్, ఆదర్శ్, హర్షవర్ధన్‌లు చెరువులో ఈత నేర్చుకునేందుకు వెళ్లి మృత్యువాతపడ్డారు.