వారు దళిత దంపతులు.. రాత్రిపూట పొలానికి నీళ్లు పెట్టేం దుకు వెళ్లారు.. పిల్లలు మారాం చేస్తే వారినీ వెంట తీసుకెళ్లారు.. అంతా కలసి సొంత ఆటోలో పొలానికి చేరారు.. భర్త ఆటో దిగి మోటార్ స్టార్ట్ చేసేందుకు వెళ్లాడు.. ఇంతలో గస్తీ కాస్తున్న ఎస్సై అటుగా వచ్చాడు.. వాహనం ఆపి ‘ఇక్కడేం చేస్తున్నావ్..?’అంటూ ఆమెను గద్దించాడు.. పొలానికి నీళ్ల కోసం వచ్చామంది.. అందుకు ఎస్సై.. ‘చాల్లే ఏదో కేసులా ఉన్నావు.. దుకాణం నడుపుతు న్నావా..’అంటూ నానా దుర్భాషలాడాడు!