
ట్రాలీ ఆటోలో తరలిస్తున్న ఇసుక బస్తాలు
పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లాలో కిలో ఇసుకను రూ.6 చొప్పున విక్రయిస్తున్నారు. వర్షాకాలం కావడంతో గోదావరి, మానేరు నదులు వరద కారణంగా ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఇసుక కొరత ఏర్పడింది. ఇప్పటికే జిల్లాలో చాలా చోట్ల ఇళ్ల నిర్మాణాలు నిలిచిపోయాయి. ఇళ్ల నిర్మాణాలు చివరిదశలో ఉన్న యజమానులు మాత్రం అక్కడక్కడ ఇసుక బస్తాలు కొనుగోలు చేస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకున్న వ్యాపారులు 25 కిలోల ఇసుక బస్తాను రూ.150 విక్రయిస్తున్నారు. అంటే దాదాపు కిలో ఇసుక రూ.6కు దొరుకుతోంది. ఇళ్ల నిర్మాణంలో చివరగా ప్లాస్టరింగ్ చేసేందుకు పెద్ద మొత్తంలో డబ్బు వెచ్చిస్తూ బస్తాల చొప్పున ఇసుకను కొనుగోలు చేస్తున్నారు. వేసవి సీజన్‌లో ఇసుకను జల్లెడ పట్టి బస్తాల్లో నింపి మానేరు, గోదావరి ఒడ్డున గ్రామాల్లోని కొందరు ఏజెంట్లు రహస్యంగా నిల్వ ఉంచుకున్నారు. వారే ప్రస్తుతం వ్యాపారులకు 25 కిలోల బస్తా రూ.100కు విక్రయించగా రిటైల్‌గా వ్యాపారులు రూ.130 నుంచి 150కి అమ్ముతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment