person missing
-
అదృశ్యమైన వ్యక్తి శవమై కనిపించాడు
సాక్షి, ముత్తారం: పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం సీతంపల్లి గ్రామంలో పండగపూట విషాదం నెలకొంది. ఐదు రోజులుగా కనిపించకుండా పోయిన కొడారి రాములు(32) అనే వ్యక్తి మృతుడై కనిపించాడు. గ్రామంలో ఉన్న పత్తి చేనులో సోమవారం ఉదయం శవమై కనిపించాడు. అయితే ఇతడిని ఎవరో హత్య చేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. -
తాగిన మైకంలో నాలాలోకి దిగి...కొట్టుకుపోయి..
-
విజయవాడలో శ్రీలంక దేశస్థుడు అదృశ్యం
-
విజయవాడలో శ్రీలంక దేశస్థుడు అదృశ్యం
విజయవాడ: కృష్ణా జిల్లా విజయవాడలో శ్రీలంక దేశస్థుడు స్టీవెన్ రత్నాయక్ అదృశ్యం కలకలం రేపింది. గత పదిహేను రోజులుగా అతడి ఆచూకీ తెలియకుండా పోయింది. పోలీసుల కథనం ప్రకారం.. శ్రీలంకకు చెందిన రత్నాయక్ అక్టోబర్ 15న ఉదయం 11 గంటలకు తమిళనాడు ఎక్స్ ప్రెస్ రైలులో చెన్నై నుంచి హైదరాబాద్ కు బయలుదేరాడు. ఈ క్రమంలో విజయవాడ రైల్వేస్టేషన్లో అతడు అదృశ్యమయ్యాడు. ఈ విషయంపై లంక హై కమిషన్ విజయవాడ రైల్వేస్టేషన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే స్టీవెన్ ఏ పనిమీద వచ్చాడు.. అతడు ఏం చేస్తుంటాడన్న దానిపై స్పష్టమైన సమాచారం లేదు. ఈ ఘటన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఏరుదాటుతుండగా వ్యక్తి గల్లంతు
భారీ వర్షాల కారణంగా జిల్లాలో ఏర్లు వంకలు పొంగి పొర్లుతున్నాయి. తాజాగా.. దక్కిలి మండలం కందల వారిపల్లి వద్ద మంగళ వారం బైక్ పై ఏరు దాటుతుండగా.. ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. గల్లంతైన వ్యక్తి దక్కిలి మండలం రాపూర్ గ్రామానికి చెందిన సి. వేణుగోపాల్ రెడ్డి(36)గా గుర్తించారు. దక్కిలి సబ్ స్టేషన్ లో స్విచ్ ఆపరేటర్ గా పనిచేస్తున్న వేణుగోపాలు విధులు ముగించుకుని ఇంటికి వెళుతుండగా..ఈ విషాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకుని సంఘటనా స్థలానికి అధికారులు వచ్చినా.. భారీ వర్షం కురుస్తుండటంతో.. సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. -
చేపలు పట్టే యత్నంలో వ్యక్తి గల్లంతు
ఆగిరిపల్లి: చేపలు పడుతూ ప్రమాదవశాత్తూ కాలు జారడంతో వాగులో పడి ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. కృష్ణా జిల్లా ఆగిరిపల్లి మండలంలో ఈ ఘటన ఆదివారం జరిగింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు మంతెని వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆగిరిపల్లి గ్రామానికి చెందిన బోనం కొండయ్య (40) చేపలు పట్టేందుకు ఆదివారం వాగు దగ్గరకు వెళ్లాడు. వల విసిరే క్రమంలో కాలు జారి వాగులో పడిపోయాడు. ప్రవాహంలో కొట్టుకుపోగా అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆదివారం రాత్రి వరకూ ఎలాంటి ఆచూకీ లభించలేదు.