విశాఖ: విశాఖ జిల్లాలోని అప్పికొండ బీచ్ వద్ద ఆరుగురు యువకులు ఆదివారం గల్లంతయ్యారు. సెలవురోజు కావడంతో వారు విహారానికి అప్పికొండ బీచ్ వద్దకు వెళ్లినట్టు తెలిసింది. అయితే గల్లంతైన వారిలో ఒకరి మృతదేహం లభ్యమైనట్టు అధికారులు తెలిపారు. మృతుడు (8) ప్రసన్నగా గుర్తించారు.
ముగ్గురు విద్యార్థులు నితిన్, ఉపేంద్ర, భరత్ లను మత్స్యకారులు రక్షించగా, ఆచూకీ గల్లంతైన మరో ఇద్దరు రూపేష్, అఖిలేష్ ల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు అధికారులు పేర్కొన్నారు. అయితే గల్లంతైన విద్యార్థులందరూ డీఏవీ పబ్లిక్ స్కూల్ కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
అప్పికొండ బీచ్ వద్ద ఆరుగురు యువకుల గల్లంతు
Published Sun, Jul 5 2015 6:25 PM | Last Updated on Sun, Sep 3 2017 4:57 AM
Advertisement
Advertisement