appikonda beach
-
విశాఖ బీచ్‌లో రాళ్ల మధ్య యువతి.. 12 గంటల నరకం తర్వాత..
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నంలోని అప్పికొండ బీచ్‌లో ఓ యువతి రాళ్ల మధ్య చిక్కుకున్న ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. రాళ్ల మధ్య అపస్మారక స్థితిలో సదరు యువతి మృత్యువుతో పోరాడింది. అదృష్టవశాత్తు యువతిని స్థానికులు గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే, సదరు యువతి.. మరో యువకుడితో కలిసి బీచ్‌కు వెళ్లడం గమనార్హం. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన కావ్య.. వర్మ రాజుతో కలిసి ఈ నెల 2 నుంచి అప్పికొండ శివాలయ పరిసరాల్లో ఉంటున్నారు. ఆదివారం సాయంత్రం తీరం దగ్గరలో ఉన్న రాళ్ల గుట్టలపై ఆమె ఫొటో తీసుకుంటున్న క్రమంలో కిందపడిపోయింది. ఎత్తైన ప్రదేశం నుంచి జారి పడిపోయింది. ఈ క్రమంలో కావ్య.. అపస్మారక స్థితికి చేరుకోవడంతో వర్మ రాజు అక్కడి నుంచి పారిపోయడు. అప్పటికే రాత్రి కావడంతో కావ్య రాళ్ల మధ్యలో నుంచి కేకలు వేసింది. వర్మ రాజు ఎక్కడ.. బీచ్‌లో రాత్రివేళ జన సంచారం లేకపోవడంతో అలాగే రాత్రంతా మృత్యువుతో పోరాడింది. సోమవారం ఉదయం బీచ్‌కు వచ్చిన కొందరు జాలర్లు యువతిని చూడగా.. అక్కడే ఉన్న గజ ఈతగాళ్ల సహాయంతో అతి కష్టం మీద బయటకు తీసుకొచ్చారు. యువతి రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం, పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. చికిత్స నిమిత్తం 108 వాహనంలో కావ్యను కేజీహెచ్‌కు తరలించారు. ఈ సందర్బంగా తాను కాలుజారి రాళ్ల మధ్య పడిపోయానని.. వర్మ రాజును ఏమీ అనవద్దని ఆమె పోలీసులు కోరడం విశేషం. ఇక పరారీలో ఉన్న వర్మరాజు కోసం పోలీసులు గాలిస్తున్నారు. అంబులెన్సు సిబ్బంది యువతి తల్లికి సమాచారమివ్వగా.. వారు విశాఖ బయలుదేరి వెళ్లారు. ఇదిలా ఉంటే తమ కుమార్తె కనపడటంలేదని యువతి తల్లి మచిలీపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కిడ్నాప్ కేసు నమోదు చేశారు.. ఇంతలో పీఎస్ నుంచి అంబులెన్స్ సిబ్బందికి సమాచారమిచ్చారు. దువ్వాడ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అయితే పరారీలో ఉన్న యువకుడికి ప్రమాదం జరిగిందని.. అతడు కూడా కేజీహెచ్‌లో ఉన్నట్లు సమాచారం. యువతి మిస్సింగ్ కేసు.. విశాఖకు వెళ్లడం ఇప్పుడు మిస్టరీగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
అప్పికొండ తీరంలో కాకినాడ బాలిక గల్లంతు
సాక్షి, పెదగంట్యాడ: జీవీఎంసీ 77వ వార్డు పరిధి అప్పికొండ సముద్ర తీరంలో ఓ బాలిక సోమవారం గల్లంతైంది. దువ్వాడ సీఐ లక్ష్మి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ మండలం జగన్నాథపురానికి చెందిన ఓబులూరి ప్రదీప్, సత్య దంపతులు తమ ఇద్దరి కుమార్తెలతో పాటు బంధువులతో కలిసి దసరా పండగకని గంగవరం గ్రామంలోని అత్తారింటికి వచ్చారు. వారంతా సోమవారం తిరుగు ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకున్నారు. దువ్వాడ రైల్వేస్టేషన్లో రైలు వచ్చేందుకు ఇంకా సమయం ఉండడంతో పెద్దలు, పిల్లలతో సహా మొత్తం 12 మంది అప్పికొండ తీరానికి వెళ్లారు. అక్కడ సముద్రంలో సరదాగా గడుపుతుండగా.. ఓబులూరి దీపిక(15)తో పాటు స్నేహితురాలు హరిణి ఒక్కసారిగా కెరటాల ఉధృతికి కొట్టుకుపోయారు. గమనించిన దీపిక తండ్రి వారిని రక్షించే ప్రయత్నం చేశారు. హరిణిని ఒడ్డుకు తీసుకువచ్చారు. దీపిక మాత్రం అలల తాకిడికి కొట్టుకుపోయింది. వారు ఎంత ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. సమాచారం అందుకున్న దువ్వాడ పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. దీపిక కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రదీప్ ఫిర్యాదు మేరకు దువ్వాడ సీఐ లక్ష్మి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (అడవి బిడ్డలకు ఐఐటీ అవకాశాలు) -
అప్పికొండ బీచ్‌లో మరో మృతదేహం లభ్యం
విశాఖ: విశాఖ జిల్లాలోని అప్పికొండ బీచ్ వద్ద గల్లంతైన విద్యార్థుల్లో మృతుల సంఖ్య రెండుకు చేరింది. అప్పకొండ- గంగవరం మధ్య అఖిలేష్ అనే విద్యార్థి మృత దేహం లభ్యమైంది. ఆదివారం కావడంతో డీఏవీ పబ్లిక్ స్కూలు కు చెందిన ఆరుగురు విద్యార్థులు విహారానికి అప్పికొండ బీచ్ కు వెళ్లారు. గల్లంతైన వారిలో ప్రసన్న అనే విద్యార్థి మృతదేహం ఆదివారమే లభించింది. ముగ్గురు విద్యార్థులు నితిన్, ఉపేంద్ర, భరత్ లను మత్య్సకారులు రక్షించగా, ఆచూకీ తెలియని రూపేష్, అఖిలేష్ లకోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే సోమవారం ఉదయం అఖిలేష్ మృతదేహం లభ్యమైంది. రూపేష్ కోసం గాలిస్తున్నారు. -
బీచ్ వద్ద ఆరుగురు యువకుల గల్లంతు
-
అప్పికొండ బీచ్ వద్ద ఐదుగురు యువకుల గల్లంతు
-
అప్పికొండ బీచ్ వద్ద ఆరుగురు యువకుల గల్లంతు
విశాఖ: విశాఖ జిల్లాలోని అప్పికొండ బీచ్ వద్ద ఆరుగురు యువకులు ఆదివారం గల్లంతయ్యారు. సెలవురోజు కావడంతో వారు విహారానికి అప్పికొండ బీచ్ వద్దకు వెళ్లినట్టు తెలిసింది. అయితే గల్లంతైన వారిలో ఒకరి మృతదేహం లభ్యమైనట్టు అధికారులు తెలిపారు. మృతుడు (8) ప్రసన్నగా గుర్తించారు. ముగ్గురు విద్యార్థులు నితిన్, ఉపేంద్ర, భరత్ లను మత్స్యకారులు రక్షించగా, ఆచూకీ గల్లంతైన మరో ఇద్దరు రూపేష్, అఖిలేష్ ల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు అధికారులు పేర్కొన్నారు. అయితే గల్లంతైన విద్యార్థులందరూ డీఏవీ పబ్లిక్ స్కూల్ కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.