విశాఖ: విశాఖ జిల్లాలోని అప్పికొండ బీచ్ వద్ద గల్లంతైన విద్యార్థుల్లో మృతుల సంఖ్య రెండుకు చేరింది. అప్పకొండ- గంగవరం మధ్య అఖిలేష్ అనే విద్యార్థి మృత దేహం లభ్యమైంది. ఆదివారం కావడంతో డీఏవీ పబ్లిక్ స్కూలు కు చెందిన ఆరుగురు విద్యార్థులు విహారానికి అప్పికొండ బీచ్ కు వెళ్లారు. గల్లంతైన వారిలో ప్రసన్న అనే విద్యార్థి మృతదేహం ఆదివారమే లభించింది. ముగ్గురు విద్యార్థులు నితిన్, ఉపేంద్ర, భరత్ లను మత్య్సకారులు రక్షించగా, ఆచూకీ తెలియని రూపేష్, అఖిలేష్ లకోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే సోమవారం ఉదయం అఖిలేష్ మృతదేహం లభ్యమైంది. రూపేష్ కోసం గాలిస్తున్నారు.